Pumkin Tips : కాన్సర్‌కి గుమ్మడికాయతో చెక్... ఇవీ ప్రయోజనాలు

కాన్సర్‌కి గుమ్మడికాయతో చెక్... ఇవీ ప్రయోజనాలు

Health Benefits of Pumkin : గుమ్మడికాయతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా కాన్సర్ పేషెంట్లు వీటిని ఆహారంలో తప్పక వాడాలి.

  • Share this:
    Health Benefits of Pumkin : గుమ్మడికాయ అనగానే మనం లైట్ తీసుకుంటాం. దిష్టి తియ్యడానికి మాత్రమే అది పనికొస్తుందని అనుకుంటాం. విదేశీయులు సైతం... గుమ్మడికాయల్ని డెకరేషన్ వస్తువుల్లా చూస్తారు. కానీ... గుమ్మడికాయతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా మన శరీరంలో పాంక్రియాస్ (చిన్న పేగుల పక్కన ఉండే అవయవం)కి వచ్చే కాన్సర్ (pancreatic cancer)కి చెక్ పెట్టాలంటే గుమ్మడికాయను తినాలి. ముఖ్యంగా శీతాకాలం వస్తున్న సమయంలో గుమ్మడికాయలు ఎక్కువగా కాస్తాయి. వీటిలో కెరోటినాయిడ్స్ (బీటా కెరోటిన్, ల్యూటీన్ వంటివి) ఎక్కువగా ఉంటాయి. పసుపు, ఆరెంజ్ కలర్స్‌లో ఉండే గుమ్మడి కాయల్లో ఎక్కువ పోషకాలుంటాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్... మన కణాలు పాడవకుండా కాపాడతాయి.

    గుమ్మడికాయల్లో ఫైబర్, పొటాషియం కూడా ఎక్కువే. అందుకే వీటిని కాన్సర్ పేషెంట్ల ఆహారంలో చేర్చారు. ఐతే... గుమ్మడికాయలు... కాన్సర్ పేషెంట్లు అందరికీ సెట్ కావు. కొంతమంది పేషెంట్లకు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తినబుద్ధి కాదు. విరేచనాల సమస్య ఎదురవుతుంది. అలాంటి వారికి గుమ్మడికాయల ఆహారం పెట్టడం మంచిది కాదు. అది తప్పితే... మిగతా ఎవరికైనా ఇవి చాలా మేలు చేస్తాయి. ఓసారి డాక్టర్ సలహా తీసుకున్నాక వాడితే సరిపోతుంది.

    గుమ్మడికాయల్ని ఇలా తినవచ్చు.
    1. రోస్ట్ చేసి, తాజా మొజ్జారెల్లా సలాడ్‌లో కలిపి తినవచ్చు.
    2. గుమ్మడికాయ, బ్రెడ్ కలిపి తినవచ్చు.
    3. యాపిల్, గుమ్మడికాయ కలిపి పాన్ కేక్స్‌లా తినవచ్చు.
    4. గుమ్మడికాయ గింజల్ని వేపుకొని తినవచ్చు. గింజల్ని శుభ్రం చేసి... కొద్దిగా నూనె వేసి... వేపుకోవాలి. గింజలు గోల్డ్ కలర్‌లోకి మారే వరకూ వేపాలి. ఇందుకు దాదాపు 20 నిమిషాలు పడుతుంది. ఆ తర్వాత కాస్త ఉప్పు, ఇతరత్రా స్పైసీ వేసుకోవచ్చు.
    Published by:Krishna Kumar N
    First published: