Pulse Oximeter: భారీగా తగ్గిన పల్స్‌ ఆక్సీమీటర్‌ ధరలు.. మరో 5 రకాల వైద్య పరికరాల ధరలు తగ్గింపు..

ప్రతీకాత్మకచిత్రం

Pulse Oximeter: మెడికల్ డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చే ట్రేడ్‌ మార్జిన్‌ను గరిష్ఠంగా 70 శాతానికి కేంద్రం పరిమితం చేసింది. దీంతో నేషనల్‌ ఫార్మాస్యూటికల్స్‌ ప్రైసింగ్‌ అథారిటీ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈనెల 20 నుంచి కొన్ని వైద్య పరికరాల ధరలు దిగొచ్చాయి. దీనికి సబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    కోవిడ్ -19 చికిత్స మరియు నివారణలో విస్తృతంగా ఉపయోగించిన పల్స్ ఆక్సిమీటర్ మరియు డిజిటల్ థర్మామీటర్ వంటి ఐదు వైద్య పరికరాలపై ప్రభుత్వం వాణిజ్య మార్జిన్లను పరిమితం చేయడంతో వాటి ఎంఆర్పీ ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కరోనా మొదటి వేవ్ లో కేసులు విపరీతంగా పెరిగినా మరణాల సంఖ్య ఎక్కువగా నమోదు కాలేదు. అయితే మొదటి వేవ్ తగ్గినట్లే తగ్గి ఒక్కసారిగి కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడింది. దీంతో ఈ సారి కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా అంతకు అంత పెరిగాయి. అయితే మరణించిన కరోనా రోగుల్లో శ్వాస సరిగ్గా ఆడకపోవడంతో మరణాలు ఎక్కువగా నమోదయ్యాయని గణంగాకాలు చెబుతున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తమయి.. మెడికల్ పరికారాలను ఎక్కువగా విక్రయించడం మొదలు పెట్టారు. అంటే పల్స్ ను చెక్ చేసుకోవడానికి పల్స్‌ ఆక్సీమీటర్, నెబ్యులైజర్‌ వంటి వాటిని కొనుగోలు చేశారు.

    ముందు జాగ్రత్తగా ఇలా వాటిని కొనుగోలు చేయడంతో దాదాపు మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు వాటి ధరలను అమాంతం పెంచేశారు. ఇలా కొవిడ్‌ బాధితుల శ్వాస, చక్కెర శాతం, రక్తపోటు, జ్వరం పరీక్షించేందుకు ఉపయోగించే పల్స్‌ ఆక్సీమీటర్, గ్లూకోమీటర్, బీపీ మానిటర్, డిజిటల్‌ థర్మామీటర్‌తో పాటు శ్వాస సంబంధ ససమ్యలు పరిష్కరించేందుకు వినియోగించే నెబ్యులైజర్‌ ధరలు కూడా గణనీయంగా పెంచి విక్రయించారు. అయితే వీటిని అందరికీ అందుబాటులోకి తెచ్చే విధంగా డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చే ట్రేడ్‌ మార్జిన్‌ను గరిష్ఠంగా 70 శాతానికి పరిమితం చేశారు. దీంతో నేషనల్‌ ఫార్మాస్యూటికల్స్‌ ప్రైసింగ్‌ అథారిటీ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈనెల 20 నుంచి ఈ వైద్య పరికరాల ధరలు దిగొచ్చినట్లు పేర్కొంది.

    కొవిడ్‌ బాధితుల చికిత్సలో కీలకంగా మారిన పల్స్‌ ఆక్సీమీటర్, నెబ్యులైజర్‌ వంటి 5 రకాల వైద్య పరికరాల ధరలు 88 శాతం వరకు తగ్గాయని రసాయనాలు, ఎరువుల శాఖ తెలిపింది. 2021, జులై 23 నాటికి 684 బ్రాండ్ల వైద్య పరికరాలు నమోదు కాగా.. 620 (91 శాతం) పరికరాల ఎంఆర్‌పీ ధరలను ఆయా సంస్థలు సవరించాయి. ఇంతకుముందు డిస్ట్రిబ్యూటర్‌కు అందించే ధర, ఎంఆర్‌పీ మధ్య 709 శాతం వరకు వ్యత్యాసం ఉంది. దీన్ని 10 రెట్లకు పైగా తగ్గించారు.
    Published by:Veera Babu
    First published: