తొందరగా బరువు తగ్గాలంటే ఈ ఆహారం చాలా మంచిది

అధిక ప్రొటీన్లు ఉండే ఆహారంతోనే బరువును త్వరగా తగ్గించుకోవచ్చు

అధిక ప్రొటీన్లు ఉండే ఆహారంతోనే బరువును త్వరగా తగ్గించుకోవచ్చు

 • Share this:
  అధిక బరువుతో బాధపడుతున్నారా? ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గలేకపోతున్నారా? ఎక్సర్‌సైజులు, డైటింగులతో ఒళ్లు హూనం అయ్యేలా కష్టపడుతున్నా లాభం ఉండటం లేదా? ప్రస్తుతం అధిక బరువు చాలా మందిని వేధిస్తోంది. ముఖ్యంగా యువతీయువకుల బాధ వర్ణణాతీతం. బరువు తగ్గాలన్న కసితో కడుపు కాలుతున్నా నోరు కట్టేసుకుంటారు. అయితే ఆ సమస్యలేవీ లేకుండా అధిక ప్రొటీన్లు ఉండే ఆహారంతోనే బరువు తగ్గించుకోవచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం వల్ల కొవ్వు తగ్గడమే కాకుండా కండరాల బరువు అదుపులో ఉంటుందట.

  1.గుడ్లు
  కోడిగుడ్లలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. చౌకకే లభించే ఈ ఆహారం వల్ల బరువు త్వరగా తగ్గవచ్చట. కావల్సినన్ని అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ దొరకడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఉడకబెట్టిన గుడ్డును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల లాభాలుంటాయి.
  2.కాటేజ్ చీజ్
  బరువు తగ్గాలనుకునేవారు కాటేజ్ చీజ్‌ను ఆహారంగా తీసుకుంటే మంచిది. ఆకలిగా ఉన్నపుడు చిన్న చీజ్ ముక్కను తింటే చాలు. సోయా గింజలతో తయారు చేసే ఈ కాటేజ్ చీజ్ గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలను పటిష్ఠంగా ఉంటాయి.
  3.పెరుగు
  కాల్షియం, ప్రొటీన్లు, పోషకాలు ఎక్కువగా ఉండే పెరుగు వల్ల బరువును త్వరగా తగ్గవచ్చు. ఎలాంటి ఇతర ఆహార పదార్థాలతో జోడించకుండా కేవలం పెరుగును తినాలి. పళ్ల రసాల్లో చేర్చి తిన్నా మంచిదే.
  4.ఓట్‌ మీల్
  ఓట్ మీల్‌లో ఫైబర్, ప్రొటీన్లు, కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్లు పుష్కలంగా లభిస్తాయి. ఒక కప్పు ఓట్ మీల్‌ను స్నాక్‌గా తీసుకుంటే ఆకలి తగ్గడమే కాకుండా శరీరానికి కావల్సినన్ని ప్రొటీన్లు అందుతాయి.
  5.బాదం, వాల్‌నట్స్
  బాదం, వాల్‌నట్స్, జీడిపప్పు, పిస్తా లాంటి ఆహార పదార్థాల్లో ప్రొటీన్లు అధికంగా ఉండటమే కాకుండా ఆరోగ్యకరమైన కొవ్వును అందిస్తాయి. నట్ బటర్ కూడా బరువును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. బ్రెడ్ ముక్కకు కాసింత తగిలించి తింటే ఆకలి దూరమై బరువు త్వరగా తగ్గడానికి దోహదపడుతుంది.
  First published: