హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Propose Best Friend : బెస్ట్ ఫ్రెండ్‌తో ప్రేమలో పడ్డారా?ఇలా చేస్తే వారి నుంచి పాజిటివ్ రిజల్ట్

Propose Best Friend : బెస్ట్ ఫ్రెండ్‌తో ప్రేమలో పడ్డారా?ఇలా చేస్తే వారి నుంచి పాజిటివ్ రిజల్ట్

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

How to Propose Best Friend : రిలేషన్ షిప్(Relationship) మెరుగుపరచుకోవడానికి ప్రేమతో పాటు స్నేహం అవసరం. కొన్ని జంటలు ప్రేమలో పడిన తర్వాత స్నేహితులుగా మారతారు, అయితే చాలా మంది తమ ప్రాణ స్నేహితులతో(Best friend) మాత్రమే ప్రేమలో పడతారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

How to Propose Best Friend : రిలేషన్ షిప్(Relationship) మెరుగుపరచుకోవడానికి ప్రేమతో పాటు స్నేహం అవసరం. కొన్ని జంటలు ప్రేమలో పడిన తర్వాత స్నేహితులుగా మారతారు, అయితే చాలా మంది తమ ప్రాణ స్నేహితులతో(Best friend) మాత్రమే ప్రేమలో పడతారు. results)పొందవచ్చు. ప్రాణ స్నేహితులైన వ్యక్తితో ప్రేమలో పడడం సర్వసాధారణం, అయితే స్నేహం(Friendship) తెగిపోతుందేమోననే భయంతో కొంతమంది తమ భావాలను ఫ్రెండ్ ముందు చెప్పుకోలేక పోతున్నారు. అటువంటి పరిస్థితిలో ఫ్రెండ్ కి ప్రపోజ్(Proposing best friend) చేయడానికి మీరు కొన్ని సులభమైన పద్ధతుల సహాయం తీసుకోవచ్చు. మీరు కూడా మీ బెస్ట్ ఫ్రెండ్ తో ప్రేమలో పడి ఉంటే 5 సులభమైన మార్గాల్లో ప్రేమను వ్యక్తపరచడం ద్వారా మీరు చాలా సానుకూల ఫలితాలను(Positive results)పొందవచ్చు. ఫ్రెండ్ కి ప్రేమను వ్యక్తపరిచే మార్గాలను తెలుసుకుందాం.

హింట్ ఇవ్వడానికి లేదా సూచించడానికి ప్రయత్నించండి

ఫ్రెండ్ తో నేరుగా ప్రేమను వ్యక్తపరిచే బదులు మీరు ముందుగానే వారికి చిన్న సూచన ఇవ్వవచ్చు. దీని కోసం మీరు ఫ్రెండ్ తో సరసాలాడటం మరియు వారి పట్ల అదనపు జాగ్రత్తలు తీసుకోవడం వంటి చిట్కాలను అనుసరించవచ్చు. అటువంటి పరిస్థితిలో మీ ప్రవర్తనలో ఈ మార్పును ఫ్రెండ్ ఇష్టపడితే అతనికి లేదా ఆమెకు కూడా అవును అని అర్థం చేసుకోండి.

ఇష్టమైన ప్రదేశంలో ప్రపోజ్ చేయండి

ఫ్రెండ్ కు ప్రేమను తెలియజేయడానికి మీరు వారికి ఇష్టమైన స్థలాన్ని ఎంచుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో ఫ్రెండ్ కి ఇష్టమైన గమ్యస్థానానికి తీసుకెళ్లడం ద్వారా తనని ఆశ్చర్యపర్చండి మరియు మీ హృదయంలో మాట గురించి నేరుగా తనికి చెప్పండి. మీ ప్రేమకు కారణం కూడా చెప్పండి. ఇది మీ ఫ్రెండ్ వెంటనే అవును అని చెప్పేలా చేస్తుంది.

ప్రేమ లేఖను ప్రయత్నించండి

ఇంటర్నెట్ యుగంలో ప్రేమలేఖలు రాసే ట్రెండ్ చాలా పాతబడిపోయింది. కానీ ప్రేమను వ్యక్తీకరించడానికి ఇది ఉత్తమ మార్గం. మీ ఫ్రెండ్ ముందు నిలబడి ఐ లవ్ యూ చెప్పలేకపోతే మీరు వారికి మనోహరమైన బహుమతితో పాటు ప్రేమ లేఖను వ్రాసి పంపవచ్చు.

Mass wedding : 800 మంది జంటలకు పెళ్లిళ్లు..32 కేజీల బంగారం గిఫ్ట్‌గా ఇచ్చారు

ఫోన్ కాల్

ఫ్రెండ్ ముందు ప్రేమను వ్యక్తపరచడానికి సంకోచిస్తే మీరు ఫోన్ కాల్ చేయడం ద్వారా ఫ్రెండ్ కి మీ హృదయాన్ని తెలియజేయవచ్చు. అయితే రాత్రి సమయంలో స్నేహితుడికి కాల్ చేయడం మంచిది. అటువంటి పరిస్థితిలో, మీరు మీ భావాలను ఫ్రెండ్ ముందు సులభంగా పంచుకోవచ్చు.

మనసు తెలుసుకో

ఫ్రెండ్ తోప్రేమను వ్యక్తపరిచే ముందు వారి మనసు తెలుసుకోవడం కూడా ముఖ్యం. మీ ఫ్రెండ్ మరొకరిని ఇష్టపడితే పొరపాటున కూడా నీ హృదయ స్థితిని వారికి చెప్పకు. లేకపోతే, మీ స్నేహం ఇంతటితో ముగియవచ్చు.

First published:

Tags: Friendship, Girl friend, Love, Relationship

ఉత్తమ కథలు