హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Health : ప్రాసెస్ చేసిన మాంసం తింటే కాన్సర్ వస్తుందా?

Health : ప్రాసెస్ చేసిన మాంసం తింటే కాన్సర్ వస్తుందా?

Health : ప్రాసెస్ చేసిన మాంసం తింటే కాన్సర్ వస్తుందా?

Health : ప్రాసెస్ చేసిన మాంసం తింటే కాన్సర్ వస్తుందా?

Health : మాంసం అనేది చికెన్ అయినా, మటన్ అయినా... అది పాడవ్వకముందే వండుకొని తినేయాలి. ప్రాసెస్ చేసింది తింటే... కాన్సర్ వస్తుందా రాదా అన్న అంశంపై మరో పరిశోధన జరిగింది.

Health : ఈ రోజుల్లో బిజీ వర్క్ లైఫ్‌లో ప్రజలు మాంసాహారాన్ని నిల్వ చేసి తింటున్నారు. వారానికి సరిపడా ఒకేసారి మాంసం తెచ్చేసుకొని... ఫ్రిజ్‌లో ఉంచి... అప్పుడప్పుడూ వండుకునే వారు కొందరైతే... ఎప్పటికప్పుడు ప్యాకెట్లలో నిల్వ చేసిన మాంసాన్ని (ప్రాసెస్ చేసిన మాంసం) కొనుక్కొని, వండుకు తింటున్నవారు మరికొందరు. ఐతే... ప్రాసెస్ చేసిన మాంసాన్ని తింటే... కాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2015లో చెప్పింది. ఎందుకంటే అందులో గ్రూప్ 1 కార్సినోజెన్స్ ఉంటున్నాయి. అవి కాన్సర్ వచ్చేందుకు దారితీస్తున్నాయి అని WHO తెలిపింది. ఐతే... ఇప్పుడో కొత్త పరిశోధనలో కొత్త విషయం తెలిసింది. ప్రాసెస్ చేసిన అన్ని మాంసాలూ కాన్సర్ వచ్చేందుకు దారి తియ్యట్లేదు. వాటిలో నైట్రైట్స్ ఉన్నాయా లేదా అన్న దాన్ని బట్టీ కాన్సర్ వస్తుందా రాదా అన్నది ఆధారపడి ఉంటుందని WHOకి చెందిన కాన్సర్ పరిశోధనా విభాగం IARC తెలిపింది.

మాంసాన్ని నిల్వ ఉంచేందుకు ప్రాసెస్ చేస్తారు. ఇందుకోసం దాన్ని యూరింగ్, సాల్టింగ్, స్మోకింగ్, ఫెర్మెంటేషన్ వంటివి చేస్తారు. తద్వారా మాంసం పాడవకుండా, ఫ్లేవర్ పోకుండా ఉంటుంది. కొంత మంది మాంసాన్ని ప్రాసెస్ చేసేందుకు, కలర్ పెంచేందుకు, ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు అందులో సోడియం నైట్రైట్ కలుపుతారు. అన్ని రకాల ప్రాసెస్డ్ మాంసాల్లోనూ నైట్రైట్ ఉండదు. బ్రిటన్, ఐర్లాండ్ సాసేజెస్‌లో నైట్రైట్ వాడరు. అమెరికాకి చెందిన ఫ్రాంక్‌ఫర్టెర్స్, చోరిజో, పెప్పెరోనీలో మాత్రం నైట్రైట్ ఉంటుందని తెలిసింది.

ఈ రోజుల్లో నైట్రైట్ వాడని ప్రాసెస్డ్ మాంసం అందరికీ అందుబాటులోకి వస్తోంది. హామ్ (ham), బాకన్ (bacon) వంటివి ఈ కోవలోకే వస్తాయి. అదే నైట్రైట్ కలిపిన ప్రాసెస్డ్ మాంసం తింటే... పేగులు, పెద్ద పేగు, మూత్రాశయ కాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనంలో తేలింది. అందువల్ల నైట్రైట్ కలపని ప్రాసెస్డ్ మాంసం తింటే కాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువే అంటున్నారు. ఈ తలనొప్పంతా లేకుండా... అసలు ప్రాసెస్డ్ మాంసం జోలికే వెళ్లకుండా... తాజా మాంసం ఎప్పటికప్పుడు కొనుక్కుంటే ఇంకా బెటరంటున్నారు.

First published:

Tags: Breaking news, India news, National News, News online, News today, News updates, Telugu news, Telugu varthalu

ఉత్తమ కథలు