భారత్ (India)తో పాటు ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ రోగుల సంఖ్య ఏటా పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. వివిధ రకాల క్యాన్సర్ల కేసులు అన్ని ప్రాంతాల్లోనూ నమోదవుతున్నాయి. ఇందుకు అనేక కారణాలు దోహదం చేయవచ్చు. అయితే మంచి ఆహార పద్ధతులు, అలవాట్లతో పాజిటివ్ లైప్‌స్టైల్ ఫాలో అయ్యేవారికి క్యాన్సర్ల ముప్పు తక్కువగా ఉంటుందని అనేక అధ్యయనాల్లో తేలింది. తాజాగా ఏరోబిక్ ఎక్సర్సైజ్(Aerobic Exercise)లు క్యాన్సర్ల రిస్క్‌ని తగ్గిస్తాయని తేల్చింది తాజా రిసెర్చ్. ఏరోబిక్ వ్యాయామాలతో మెటాస్టాటిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 72 శాతం వరకు తగ్గుతుందని అధ్యయనం వెల్లడించింది.
* మెటాస్టాటిక్ క్యాన్సర్ అంటే?
క్యాన్సర్(Cancer) గడ్డలు రోగి శరీరంలో ఒక దగ్గర ఏర్పడతాయి. అవి ఉన్న చోటనే ఉంటే చికిత్స తేలికవుతుంది. అయితే కొందరిలో అవి క్రమ క్రమంగా ఇతర భాగాలకు పాకడం మొదలు పెడతాయి. దీన్నే మెటాస్టాటిక్ క్యాన్సర్ అంటారు. దీనిపై ఏరోబిక్ ఎక్సర్సైజ్లు అద్భుతంగా పని చేస్తున్నాయని.
* పరిశోధన చేసిందెవరు?
ఇజ్రాయిల్‌లోని టెల్ అవీవ్ యూనివర్సిటీకి (TAU) పరిధిలోని ‘సాక్లర్ ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్’ మెడికల్ స్కూల్ హ్యూమన్ జెనెటిక్స్ అండ్ బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ కార్మిట్ లెవీతో పాటు సిల్వాన్ ఆడమ్స్ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్కు చెందిన డాక్టర్ యఫ్టాచ్ గెప్నర్ అనే ఇద్దరు వ్యక్తులు తాజా రిసెర్చ్ చేశారు. వీరి స్టడీ పేపర్ ప్రతిష్టాత్మక క్యాన్సర్ రీసెర్చ్ జర్నల్‌లో ప్రచురితమైంది. 2022 నవంబర్ ఎడిషన్ కవర్ పేజీ కోసం ఈ రిసెర్చ్ రిపోర్ట్ ఎంపికైందని వారు తెలిపారు.
* కణితిపై వ్యాయామం ప్రభావం
ఆ అధ్యయనం ప్రకారం ఏరోబిక్ వ్యాయామాల ద్వారా క్యాన్సర్ మెటాస్టాటిక్ వ్యాప్తి తీవ్రత 72 వరకు తగ్గుతోంది. అందుకు సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఈ ఎక్సర్సైజ్లు చేస్తున్నప్పుడు అంతర్గత అవయవాల్లో గ్లూకోజ్ (చక్కెర) పెద్ద మొత్తంలో కరుగుతుంది. అందువల్ల అక్కడ క్యాన్సర్ కణితికి లభించే శక్తి చాలా వరకు తగ్గిపోతుంది.
ఇది కూడా చదవండి : మీకు సైట్ ఉందా..? సమస్య పెరుగుతున్నట్లు అనిపిస్తోందా..? అయితే ఈ టిప్స్ మీకోసమే
ప్రొఫెసర్ లెవీ, డాక్టర్ గెప్నర్ ఈ అధ్యయనం గురించి వివరించారు. శారీరక వ్యాయామాలు కొన్ని రకాల క్యాన్సర్లను 35 శాతం వరకు తగ్గిస్తున్నాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అయితే ఈ వ్యాయామాలు గుండె జబ్బులు, మధుమేహం లాంటివాటిపైనా పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. ఏరోబిక్స్(Aerobic Exercise) చాలా ఇంటెన్సివ్‌గా జరిగే వ్యాయామం. ఇది చేసేటప్పుడు గ్లూకోజ్ పెద్ద ఎత్తున కరగడం ప్రారంభిస్తుంది. ఈ చర్య వలనే ఈ వ్యాయామానికి శక్తి లభిస్తూ ఉంటుంది. దీంతో ఇది మెటాస్టాటిక్ క్యాన్సర్ ప్రమాదాన్ని 72 శాతం వరకు తగ్గించగలదని తేలింది.
ఇజ్రాయెల్‌లో మెటాస్టాటిక్ క్యాన్సర్ వల్ల ఎన్నో మరణాలు సంభవిస్తున్నాయి. టీఏయూ(TAU)లోని కొన్ని స్కూల్స్ పరిధిలో క్యాన్సర్ రోగులపై ఈ అధ్యయనం చేశారు. దీని ఫలితాలు చాలా విలువైనవని ప్రొఫెసర్ లెవీ అన్నారు. ఇది మెటాస్టాటిక్ క్యాన్సర్(Metastatic Cancer)ను నివారించడంలో సహాయపడే డిస్కవరీగా చెప్పుకొచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cancer, Exercises, Fitness, Life Style