Home /News /life-style /

PREPARE THESE TASTY MAJJIGA PULUSU IN SUMMER FOR COOL FEELING RNK

Summer special: మండుతున్న ఎండకు.. హాయినిచ్చే రుచికరమైన మజ్జిగ పులుసు!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Summer special recipe: పెరుగుతో ఎన్నో రెసిపీలు తయారు చేసుకోవచ్చు. అందులో ఒకటి మజ్జిగ పులుసు. ఎండలు మండుతున్నాయి. అందుకే కడుపునకు చల్లదనాన్నిచ్చే మజ్జిగను అన్నంలో కలిపి తింటే ఎంతో హాయిగా ఉంటుంది. ఇంకా ఇందులో సొరకాయ కూడా జోడించి కేరళ స్టైల్ మజ్జిగ పులుసును ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
Summer special: పెరుగు (Curd) తో ఎన్నో రెసిపీలు తయారు చేసుకోవచ్చు. అందులో ఒకటి మజ్జిగ పులుసు. ఎండలు (Summer) మండుతున్నాయి. అందుకే కడుపునకు చల్లదనాన్నిచ్చే మజ్జిగను అన్నంలో కలిపి తింటే ఎంతో హాయిగా ఉంటుంది. ఇంకా ఇందులో సొరకాయ కూడా జోడించి కేరళ స్టైల్ మజ్జిగ పులుసును ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

వేసవి ఎండలు విపరీతంగా మొదలయ్యాయి. ఈ సమయంలో మనం హైడ్రేటెడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా బైక్ లపై పనుల కోసం ప్రయాణించేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. వారు రోజూ స్పైసీ ఫుడ్ తీసుకోకూడదు. అలాగే వేడి వేడి బాయిలర్ చికెన్, సాల్ట్ బిర్యానీ రెగ్యులర్ గా తింటే చాలా సమస్యలు వస్తాయి. పెరుగు, మజ్జిగ, గంజి వంటివి వారానికి కనీసం 2 సార్లు తీసుకోవడం చాలా మంచిది. ఈ వేసవిలో చాలా వరకు అందరి ఇళ్లలో పెరుగు ఉంటుంది. అందుకే ఎక్కువశాతం పెరుగుతో తయారు చేసిన ఆహారాన్ని తీసుకుంటే హీట్ స్ట్రోక్ తగులకుండా ఉంటుంది.

పెరుగు అన్నం, మజ్జిగ అన్నం తీసుకోకుండా పెరుగు మసాలా, మజ్జిగ పులుసు వెరైటీగా చేసుకోవచ్చు. మజ్జిగ పులుసులో అనేక రకాలు ఉన్నాయి. దీనికి సొరకాయ కూడా జోడించి కేరళ స్టైల్ మజ్జిగ పులుసు తయారు చేసుకోవచ్చు. మధ్యాహ్న భోజనానికి మజ్జిగ పులుసు సూపర్ గా ఉంటుంది.

ఇది కూడా చదవండి: Summer: మీ పిల్లలను హీట్ స్ట్రోక్ నుండి రక్షించడానికి ఎంతో ఉపయోగపడే 5 చిట్కాలు..


కావాల్సిన పదార్థాలు..

అవాలు, జీలర్ర, కందిపప్పు, ఎండు మిరపకాయలు, చిన్న ఉల్లిపాయలు, కరివేపాకు, పెరుగు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు తగినంత.

రెసిపీ తయారీ విధానం..

1. ముందుగా నానబెట్టిన కందిపప్పును మెత్తగా ఉడికించుకోవాలి.

2. ఆ తర్వాత పప్పులో పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర వేసి బాగా రుబ్బుకోవాలి..

3. ఇప్పుడు పెరుగును మజ్జిగలా గిలకొట్టి పక్కన పెట్టుకోవాలి.

ఇది కూడా చదవండి:  కొరియన్ బ్యూటీ టిప్స్ ఫాలో అవుతున్న సమంత.. ఆమె ఉపయోగించే మేకప్ ఇదే..!


4. తాలింపు కోసం బాణలిలో నూనె పోసి ఆవాలు, ఎండు మిరపకాయలు, కరివేపాకు, చిన్న ఉల్లిపాయలు, చింతపండు ,రుబ్బిన పప్పు వేయాలి.

5. ఇప్పుడు మజ్జిగ, ఉప్పు ,పసుపు వేసి మరిగించాలి.

6. చివరగా కరివేపాకు ,కొత్తిమీర చల్లుకుంటే, రుచికరమైన మజ్జిగ పులుసు సిద్ధం.
Published by:Renuka Godugu
First published:

Tags: Recipes, Summer

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు