Home /News /life-style /

PREPARE PERFECT GINGER AND GARLIC PASTE LIKE THIS FOR TASTY RECEPIES RNK

Ginger and garlic paste: అల్లం వెల్లుల్లి పర్ఫెక్ట్‌ పేస్ట్‌ను ఇలా రెడీ చేయండి!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Using ginger and garlic in foods: అల్లం వెల్లుల్లి రెండింటిలోనూ ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. మీ రోజువారీ ఆహారంలో ఈ పేస్టును జోడిస్తే.. అనేక ప్రయోజనాలు ఉంటాయి.

మన భారతీయ వంటకాలు అద్భుతంగా.. రుచికరంగా ఉండటానికి ప్రధాన కారణం.. వాటిలో వాడే స్రైసెస్‌ (spices). ఇది మన దేశంలో విరివిగా వాడతాం. ఈ ఆహారంతో ఆరోగ్యంతోపాటు రుచి అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది అల్లం వెల్లుల్లి (Ginger and garlic paste) గురించి. అల్లం వెల్లుల్లి ఆహారానికి మంచి అరోమా.. అద్భుతమైన రుచిని అందిస్తుంది. తిన్న ఆహారం జీర్ణం కావడానికి ఇది సహాయపడుతుంది. అతిసారం, ఉబ్బసం, నోటి పుండ్లు మొదలైన వాటిని ఇది నివారిస్తుంది. అందేకాదు అల్లం వెల్లుల్లితో వాంతులు రాకుండా నివారిస్తుంది.

అల్లం వెల్లుల్లి పేస్ట్‌ (Ginger and garlic paste)ను మన దేశంలో శతాబ్దాల చరిత్ర (decades)
ఉంది. ఆయుర్వేద వైద్యంలో దీన్ని వాడుతున్నారు. అల్లం వెల్లుల్లి రెండింటిలోనూ ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. మీ రోజువారీ ఆహారంలో ఈ పేస్టును జోడిస్తే.. అనేక ప్రయోజనాలు ఉంటాయి. మన శరీరంలోని వివిధ రుగ్మతలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. అయితే, దీన్ని ఆహారంలో వాడటానికి.. రుచి మరింత పెరగటానికి ఈ అల్లం వెల్లుల్లి పేస్టును ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: వైరల్‌ అవుతున్న రాశిఖన్నా బ్యూటిఫుల్‌ పిక్స్‌! ఒకప్పుడు బుమ్రాతో..

కావాల్సిన పదార్థాలు..
అల్లం–100 గ్రాములు
వెల్లుల్లి– 125 గ్రాములు

తయారీ విధానం..
ముందుగా అల్లాన్ని బాగా కడిగి పొట్టు తీయాలి. ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి పొట్టును తీసుకోవాలి. దీని పొట్టు తీయడానికి కూడా అనేక చిట్కాలు ఉన్నాయి. వాటిని ఓసారి ట్రై చేయండి దీంతో పని త్వరగా అయిపోతుంది. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి ముక్కలను కలిపి రుబ్బుకోవాలి. ఇప్పుడు జింజర్‌ అండ్‌ గార్లిక్‌ పేస్ట్‌ రెడీ అయిపోతుంది. దీన్ని గ్లాస్‌ జార్‌లో వేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రీజ్‌లో పెట్టుకోవాలి. దీన్ని కూర, మంసాహారం, రసం, బిర్యానీల్లో ఉపయోగించుకోవచ్చు.

ఇది కూడా చదవండి:   ఫర్మెంటెడ్‌ గార్లిక్‌ తింటే ఏమవుతుందో తెలుసా!

గమనిక..
ఇందులో మనం జాగ్రత్తగా చూడాల్సిన విషయం ఏంటంటే.. అల్లం కంటే వెల్లుల్లి పరిమాణం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడు ఈ పేస్ట్‌ పరిపూర్ణంగా.. రుచికరంగా ఉంటుంది. అప్పుడే మనం తయారు చేయబోయే రెసిపీ కూడా రుచికరంగా ఉంటుంది.

ఒకవేళ మీకు నెలకు లేదా 15 రోజులకు ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్టును గ్రైండ్‌ చేసిపెట్టుకునే అలవాటు ఉంటే.. కొద్దిగా ఉప్పు వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. అందువల్ల ఈ పేస్ట్‌ పాడవ్వకుండా .. ఎక్కువ రోజులు పాటు నిల్వ ఉంటుంది.
Published by:Renuka Godugu
First published:

Tags: Ginger

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు