గ్రూప్స్‌కి ఇలా ప్రిపేర్ అయితే..జాబ్ కొట్టడం గ్యారెంటీ..

గ్రూప్-1, గ్రూప్-2 సర్వీసులకు, ఇతర పోస్టులకు మొత్తం 21 ఉద్యోగ నియామక ప్రకటనలు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) నుంచి విడుదలయ్యాయి.

Amala Ravula | news18-telugu
Updated: January 4, 2019, 3:51 PM IST
గ్రూప్స్‌కి ఇలా ప్రిపేర్ అయితే..జాబ్ కొట్టడం గ్యారెంటీ..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: January 4, 2019, 3:51 PM IST
గ్రూప్-1, గ్రూప్-2 సర్వీసులకు, ఇతర పోస్టులకు మొత్తం 21 ఉద్యోగ నియామక ప్రకటనలు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) నుంచి విడుదలయ్యాయి. ఇందులో మొత్తం 3255 పోస్టులు.. ఇందులో గ్రూప్-1లో 169, గ్రూప్-2లో 446 ఉన్నాయి. వీటికి వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. కాబట్టి.. అభ్యర్థులు పూర్తిస్థాయిలో సంసిద్ధం కావాలి. అదెలాగో చూద్దాం..
గ్రూప్-1లో డిప్యూటీ కలెక్టర్, అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డిస్ట్రిక్ రిజిస్ట్రార్ మొదలైనవీ, గ్రూప్-2లో అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మొదలైనవి 446 పోస్టులున్నాయి. అయితే, ఇంతకుముందు ఉమ్మడి సిలబస్ ప్రవేశపెట్టకముందు దాదాపు అన్ని ప్రిలిమినరీ పరీక్షల్లో ఒకేరకమైన సిలబస్ ఉండేది.. దాంతో స్క్రీనింగ్ వరకూ ఇబ్బందులూ ఉండేవి కాదు.. కానీ, స్క్రీనింగ్, మెయిన్స్ మధ్య అంతరాన్ని తొలగించడం వల్ల దాదాపుగా అన్ని పరీక్షల స్క్రీనింగ్‌లోనూ చాలా తేడాలొచ్చాయి. అందువల్ల ఒకేసారి ఒకటికి మించిన పరీక్షలకు సిద్ధపడేందుకు అదనపు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.
అయితే ముందుగా.. ఏ స్క్రీనింగ్ పరీక్షలో చూసినా జనరల్ స్టడీస్ విభాగం ఉమ్మడిగా ఉండడమే కాకుండా మరికొంత సమాచారాన్ని జోడించారు. కాబట్టి జాగ్రత్తగా ప్రతి అంశాన్ని చదవాలి.

ప్రస్తుతం ఏపీపీఎస్సీ అనుసరిస్తున్న విధానాన్ని చూస్తే.. గ్రూప్ 1, 2, 3 పరీక్షల్లో స్క్రీనింగ్, మెయిన్స్‌లకు వేర్వేరు సిలబస్ ఉండదు.. కాబట్టి.. స్క్రీనింగ్, మెయిన్స్‌కి ఏయే స్థాయిలో చదవాలో ముందే గ్రహించి.. ఆ విధంగా చదవాలి. అయితే, స్క్రీనింగ్‌కి తక్కువ మార్కులొచ్చినా పర్లేదు.. మెయిన్స్‌ సమయంలో ఎక్కువగా చదువుదామంటే కుదరదు.
ఎగ్జామ్స్‌లో ఏపీ జాగ్రఫీ, ఎకానమీ, విభజనానంతర ఏపీ స్థితిగతులు, చరిత్ర-సంస్కృతి కీలకంగా మారనున్నాయి. ఇందులోనుంచే 25-30 మార్కులు రానున్నాయి.
ఒక వేళ గ్రూప్ 1, 2 రెండు పరీక్షలూ రాయాలనుకుంటే ఖచ్చితంగా అదనపు ప్రిపరేషన్ అవసరమే.. గ్రూప్-1 పరీక్షలో అదనంగా ఉన్న సమాచారం: 1. ప్రాచీన భారతదేశ చరిత్ర, 2. మధ్య భారతదేశ చరిత్ర, 3. గాంధీ, అంబేద్కర్ తాత్విక చింతన, 4. ప్రపంచ భౌగోళిక అంశాలు, 5.పాలనలో విలువలు, శాస్త్ర సాంకేతిక అంశాల్లో లోతైన అధ్యయనం మనో వైజ్ఞానిక, మానసిక సామర్థ్యాల కింద అంకగణితం, లాజికల్ సామర్థ్యాలతో పాటు శుద్ధ గణిత శాస్త్ర అంశాలు.


మిగతా స్క్రీనింగ్ పరీక్షల్లో లేకుండా గ్రూప్-2లో మాత్రమే ఉన్నవి.. 1. ఆంధ్రప్రదేశ్ చరిత్ర, 2. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, 3.జనరల్ ఎకానమీతో కలవని ప్రత్యేక ఆర్థిక అంశాలు, 4.జాతీయ అంతర్జాతీయ సంఘటనలు.
Loading...
మొత్తానికీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు.. మెయిన్స్ లానే స్క్రీనింగ్‌‌కి కూడా ప్రిపేర్ అయితే ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా కొత్తగా పరీక్ష రాసే వారు.. ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా నేర్చుకోవాలి. కరెంట్ అఫైర్స్ విషయంలో కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుండాలి. ఏదైనా విషయాన్ని కేవలం ఆ ప్రశ్న వరకే కాకుండా పూర్తిగా విషయాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఈ విధంగా ప్రిపేర్ అయితే జాబ్ కొట్టడం గ్యారెంటీ.. ఆల్ ది బెస్ట్..
First published: January 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...