• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • PREMATURE BABY HERES HOW TO TAKE CARE OF A PREEMIE AT HOME BA GH

Baby Care: ‘నెల తక్కువ’ పిల్లల విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Baby Care: ‘నెల తక్కువ’ పిల్లల విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచవ్యాప్తంగా ప్రీమెచ్యూర్ శిశువులు ఎదుర్కొంటున్న సవాళ్లు, భారం వంటి వాటిపై అవగాహన పెంచడానికి ప్రతి ఏడాది నవంబర్ 17న ‘వరల్డ్ ప్రీమెచ్యూరిటీ డే’ను జరుపుకుంటారు.

  • Share this:
ప్రపంచవ్యాప్తంగా ప్రీమెచ్యూర్ శిశువులు ఎదుర్కొంటున్న సవాళ్లు, భారం వంటి వాటిపై అవగాహన పెంచడానికి ప్రతి ఏడాది నవంబర్ 17న ‘వరల్డ్ ప్రీమెచ్యూరిటీ డే’ను జరుపుకుంటారు. 37వ వారానికంటే ముందే తల్లి గర్భంలో నుంచి జన్మించిన శిశువులను ప్రీమెచ్యూర్ శిశువుగా పిలుస్తారు. వీరిని ‘ప్రీమిస్’ అని కూడా అంటారు. తాజా గణాంకాల ప్రకారం ప్రతి ఏటా దాదాపు 15 మిలియన్ల మంది పిల్లలు ప్రీమెచ్యూరిటీతో జన్మిస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి పది మంది శిశువులలో ఒకరి కంటే ఎక్కువగా అని చెప్పవచ్చు. ఇటువంటి ముందస్తుగా పుట్టిన పిల్లలు తీవ్రమైన అనారోగ్యాలకు గురవుతుంటారు. ఈ పిల్లలకి ఇన్ఫెక్షన్లు లేదా ఉబ్బసం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ (SIDS) వచ్చే ప్రమాదం కూడా ఉంది. ప్రపంచ ప్రీమెచ్యూరిటీ దినోత్సవం సందర్భంగా, ముంబై ఖార్ఘర్‌లోని మదర్‌హుడ్ హాస్పిటల్కి చెందిన పీడియాట్రిక్స్ అండ్ నియోనాటాలజీ కన్సల్టెంట్ డాక్టర్ సురేష్ బీరాజ్‌దార్ ప్రీమెచ్యూర్ పిల్లల విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలను పేర్కొన్నారు. అవేంటో ఓసారి పరిశీలిద్దాం.

ప్రీమెచ్యూర్ శిశువు విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలు

NICU సంరక్షణ
తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్న శిశువులకు ప్రత్యేకమైన సంరక్షణను అందించడానికి నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU) ఎంతగానో సహాయపడుతుంది. NICU ద్వారా ప్రీమెచ్యూర్ పిల్లలకు సంరక్షణ, సహాయాన్ని అందించే నైపుణ్యం ఉంటుంది. ఇవి ఊపిరితిత్తుల సంరక్షణకు ఎంతగానో సహాయపడతాయి.

father gives poison to babies,mahabubnagar,father tries to kills girls,crime news,telugu news,పిల్లలకు విషమిచ్చిన తండ్రి,మహబూబ్ నగర్, క్రైమ్ న్యూస్
ప్రతీకాత్మక చిత్రం


కంగారో మదర్ కేర్
దీన్ని స్కిన్ టు స్కిన్ సాంకేతికతగా చెప్పవచ్చు. ఇది ప్రీమెచ్యూర్ శిశువులకు చాలా అవసరం. ఈ సాంకేతికత శిశువు, తల్లి మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

ఇన్ఫెక్షన్లు దరిచేరనివ్వకండి
శిశువును ఇన్ఫెక్షన్లు, అలెర్జీల నుండి కాపాడటం చాలా అవసరం. శిశువును తాకే సందర్భంలో చేతులను శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు. అంతేకాక, శిశువుకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించి, వాటికి అవసరమైన విధానాలను అనుసరిస్తూనే ఉండాలి. పుట్టిన తరువాత శిశువు సాధారణంగా ఊపిరి పీల్చుకుంటుందో లేదో పరిశీలించండి. శిశువు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవడానికి బ్యాగ్ లేదా ముసుగుతో వెంటిలేషన్ ఉపయోగపడుతుంది.

14 years Old girl gives birth in secret, Minor Girl Gives Birth in secret, minor Girl puts baby in freezer, minor Girl puts baby in freezer in russia, బిడ్డకు జన్మనిచ్చిన 14 ఏళ్ల బాలిక, ప్రసవించిన మైనర్ బాలిక, ఫ్రీజర్‌లో పసికందును ఉంచిన బాలిక
ప్రతీకాత్మక చిత్రం


తల్లి పాల ప్రాముఖ్యతను తెలుసుకోండి
తల్లి పాలు బిడ్డకు ఉత్తమమైన పోషకాహారంగా పనిచేస్తాయి. కాబట్టి, బిడ్డ పుట్టిన వెంటనే తల్లి పాలు తాగుతుందా? లేదా? అనేది నిర్ధారించుకోండి. కానీ, చాలావరకు, ప్రీమెచ్యూర్ పిల్లలు పీల్చుకోలేరు లేదా మింగలేరు. ప్రీమెచ్యూర్ శిశువులకు తల్లిపాలు త్రాగడానికి ఒక కప్పు లేదా చెంచా లేదా నాసోగాస్ట్రిక్ ట్యూబ్ సహాయపడుతుంది.

శిశువు బాగా నిద్రపోయేలా చూసుకోండి
మీ బిడ్డ నిద్రపోవడానికి ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించాలి. మీ బిడ్డ మంచి నిద్రపోయేలా చూడండి. ఇందుకోసం మీరు మీ బిడ్డను శబ్దాల నుంచి దూరంగా ఉంచండి. ఎందుకంటే ఇది మీ బిడ్డ నిద్రకు భంగం కలిగిస్తుంది.

air pollition, infant deaths, Health Effects Institute, Global Air 2020, వాయు కాలుష్యం, చిన్న పిల్లలు మృతి,
ప్రతీకాత్మక చిత్రం


గది ఉష్ణోగ్రత సరిగ్గా నిర్వహించండి
ఎల్లప్పుడూ సరైన గది ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోండి. మీ గది ఉష్ణోగ్రత చాలా చల్లగా లేదా వేడిగా ఉండకూడదు. మీ బిడ్డకు స్లీప్‌సూట్ దుస్తులను ధరింపజేయండి. శిశువుకు వెచ్చగా ఉండే దుప్పట్లను ఎంచుకోండి.

శిశువు పట్ల జాగ్రత్త వహించండి
ప్రీమిస్‌ శిశువులకు ఆకస్మిక శిశు మరణ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఉంది. చాలా మంది ఆరోగ్యకరమైన పిల్లలు నిద్రలోనే చనిపోతారనే విషయం తెలిసిందే. అందువల్ల, మీ బిడ్డ కోసం తేలికైన దుప్పటిని ఉపయోగించడం ఎంతో కీలకం. మీ దుప్పటి ముఖం నుంచి దూరంగా ఉండేలా చూసుకోండి. అలాగే ఇంట్లో ధూమపానం చేయడాన్ని మానుకోండి. డాక్టర్ సలహాలు, సూచనల మేరకు నడుచుకోండి.
Published by:Ashok Kumar Bonepalli
First published: