Breast cancer: బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

2020 నాటికి ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరికి  బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని డబ్యూహెచ్ఓ హెచ్చరిక..   ఆహార సమతుల్యతతో ఎలాంటి  రోగాన్నైనా ఎదుర్కోవచ్చని సూచిస్తున్న ఆరోగ్య నిపుణులు..

Amala Ravula | news18-telugu
Updated: January 13, 2019, 11:24 AM IST
Breast cancer: బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: January 13, 2019, 11:24 AM IST
2020 నాటికి ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరికి  బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్నది.  దీనికి కారణం లేకపోలేదు.. తినే ఆహారంపై శ్రద్ధ  తీసుకోకపోవడమే అని డబ్యూహెచ్‌ఓ  వెల్లడిస్తుంది.  అయితే ఆహార సమతుల్యతతో ఎలాంటి  రోగాన్నైనా ఎదుర్కోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే..

* ఆహారంలో ప్రతిరోజూ కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. పండ్లను కూడా తీసుకోవడం మరవద్దు.

* రొమ్ము క్యాన్సర్‌ను అరికట్టడంలో పసుపు కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే, వంటల్లో పసుపు వాడడం  తప్పని సరి.

* ప్రతిరోజూ 60 గ్రాముల చొప్పున వాల్‌నట్స్ తీసుకోవాలి. ఇలా తినడం వలన రొమ్ము క్యాన్సర్ కణతుల పెరుగుదల ఆగిపోతుంది. వీటిలో ఉండే  ఒమెగా-3, యాంటీ ఆక్సిడెంట్స్, పైతోస్టెరాల్స్ క్యాన్సర్ కారణ కణాల పెరుగుదలను నివారిస్తాయి.



* ప్రతిరోజూ తినే ఆహారంలో ఉల్లిగడ్డ/ఎల్లిపాయలను భాగం చేసుకోవడం ద్వారా రొమ్ము క్యాన్సర్‌ను నివారించవచ్చు.

* ఆవిసె గింజల్లో ఒమెగా-3, లిగ్నన్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ బారిన పడకుండా  రక్షిస్తాయి.
Loading....
* ఆల్కహాల్, కేక్‌లు, చిప్స్, కూల్‌డ్రింక్స్, తీపి పదార్థాలు, రెడ్ మీట్, వేపుడు వంటి వాటికి దూరంగా ఉండాలి.
First published: January 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు