Health Tips : రొయ్యలు తినండి.. గుండె సమస్యలను దూరం చేసుకోండి..

గుండె సమస్యలు తగ్గాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో.. ఇలాంటివారు రొయ్యలు తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

news18-telugu
Updated: May 17, 2019, 9:51 AM IST
Health Tips :  రొయ్యలు తినండి.. గుండె సమస్యలను దూరం చేసుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 17, 2019, 9:51 AM IST
ఈ మధ్యకాలంలో గుండెసమస్యలు చాలా కామన్ అయిపోయాయి. 30 ఏళ్లు దాటితే చాలు గుండె బలహీనంగా మారిసమస్యలను తీసుకొస్తుంది. ఇలాంటివారు సమస్యలు రాకముందునుంచే జాగ్రత్తపడడం చాలా మంచిదని చెబుతున్నారు. ముఖ్యంగా ఆహారం విషయంలో.. కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల గుండెసమస్యలనుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు. ఇందులో భాగంగా.. రొయ్యలు తీసుకోవాలని చెబుతున్నారు ఆహార నిపుణులు. రొయ్యల్లో ఎక్కువగా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చెబుతున్నారు.

అంతేకాదు.. అధికబరువుని తగ్గించడంలో రొయ్యలు బాగా పనిచేస్తాయి. రొయ్యల్లోని ప్రోటీన్స్ కండరాల నిర్మాణానికి, కొత్త కణజాలం ఏర్పాటుకు ఉపయోగపడతాయి. హార్మోన్ల సమస్యలు ఉన్నవారు.. రొయ్యలు తింటుంటే జీవక్రియలు సరిగ్గా నిర్వర్తింపబడతాయి.. ఆ సమస్యల నుంచి బయటపడతారు. రక్తహీనత సమస్య ఉన్నవారు రొయ్యలను రెగ్యులర్‌గా తీసుకోవాలి.

మొత్తానికీ రొయ్యలు తీసుకోవడం వల్ల ఎన్నో అదనపు లాభాలుంటాయి.. కాబట్టి రెగ్యులర్‌గా వీటిని మీ డైట్‌లో చేర్చుకోండి.

ఈ వీడియో కూడా చూడండి..



First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...