తాళం వేసి ఊరు వెళ్తున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి..

ప్రతీకాత్మక చిత్రం

తీర్థయాత్రలు, ఊర్లకి వెళ్లినప్పుడు ఇంటికి తాళం వేసి వెళ్తుంటాం. అలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎలాంటి నెగెటీవ్ వైబ్రేషన్స్ ఇంటిమీద పడవు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • Share this:
వేసవి సెలవులు, వరుసగా సెలవులు వచ్చినప్పుడు లేదా కుటుంబమంతా కలిసి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఇంటికి తాళం వేసి వెళ్తుంటాం. అయితే, ఇలాంటి సందర్భాల్లో కంగారుగా ఎక్కడివక్కడ వదిలి వెళ్లకూడదు. ఇలాంటి పనుల వల్ల ఇంటిమీద, కుటుంబసభ్యుల మీద నెగెటీవ్ వైబ్రేషన్స్ పడతాయి. ఊరెళ్దామనుకున్నప్పుడు ఇంటిలోని వండిన పాత్రలు, ఎంగిలి పాత్రలను శుభ్రంగా క్లీన్ చేసి ఎక్కడివక్కడ సర్దిపెట్టి వెళ్లాలి. ఇంటిని కూడా వీలైనంతవరకూ నీట్‌గా ఉంచుకుని వెళ్లాలి. ముఖ్యంగా బొద్దింకలు, పురుగులు ఇలాంటివి ఉండకుండా వాటిని దూరం చేయాలి. అంటే ఏవైనా స్ప్రేలు, మందులు వాడి వాటిని చంపేసి క్లీన్‌గా ఉంచుకోవాలి.

ఇంట్లో దేవుడి గదిలో దీపం వెలుగుతూ ఉండే ఏర్పాటు చేయాలి. అయితే.. అగ్నిప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి.. అలాంటి ఏర్పాటు చేసుకుని వెళ్లడం మంచిది.


ఇంటికి తాళం వేసి తిరిగొచ్చేలోపు ఏవైనా జీవరాశులు చచ్చిపోవడం, ఇల్లంతా చెత్తగా మారిపోవడం వంటివి జరగకుండా జాగ్రత్తపడాలి. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు.. సైన్స్ పరంగా కూడా మంచిది. కాబట్టి కుటుంబమంతా బయటికెళ్లాలనుకున్నప్పుడు ఇలాంటివి పాటించడం చాలా ముఖ్యం.

ఈ వీడియో చూడండి..

First published: