• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • POTATO ROSE TRICK TURN ONE ROSE INTO AN ENTIRE ROSE BUSH IN ONE WEEK HERE IS THE STEP BY STEP PROCESS NK

Potato Rose Trick: ఆమె ఇలా చేసింది... వారం తర్వాత ఏమైందంటే... వీడియో...

Potato Rose Trick: ఆమె ఇలా చేసింది... వారం తర్వాత ఏమైందంటే... వీడియో...

Potato Rose Trick: ఆమె ఇలా చేసింది... వారం తర్వాత ఏమైందంటే... వీడియో... (image credit - youtube)

Potato Rose Trick: మనందరికీ కూరగాయలతో ట్రిక్స్ చెయ్యడం నచ్చుతుంది. బంగాళా దుంపలతో చేసే ఓ ట్రిక్ ఇప్పుడు తెలుసుకుందాం. అది పిల్లలకు బాగా నచ్చుతుంది. వీడియోలో చూద్దాం.

  • Share this:
    Potato Rose Trick: మొక్కలు పెంచడం అంటే అందరికీ ఇష్టమే. ముఖ్యంగా గులాబీ మొక్కలంటే పిల్లలకు చాలా ఇష్టం. రంగురంగుల రోజా పూలు వారికి బాగా నచ్చుతాయి. చాలా మంది గులాబీ మొక్కలు కొంటూ ఉంటారు. అలా కాకుండా... చుట్టుపక్కల ఎవరికైనా గులాబీ మొక్క ఉంటే... దాని నుంచి ఓ చిన్న కాడను కట్ చేసి... మరో కొత్త మొక్క వచ్చేలా చెయ్యవచ్చు. ఇందుకు కావాల్సిందల్లా మట్టి, బంగాళాదుంప, రోజా మొక్క కాడ. ముందుగా రోజా మొక్క కాడ గ్రీన్ కలర్‌లో ఉన్నది కట్ చేసుకోవాలి. దానికి ఉన్న ముళ్లను తీసేయాలి. కాడ కనీసం 20 సెంటీమీటర్ల పొడవు ఉండాలి. ఇప్పుడు బంగాళా దుంపను తీసుకొని... దానికి మధ్యలో కన్నం పెట్టాలి. ఆ కన్నం మరీ పెద్దది కాకుండా... రోజా మొక్క కాడ పట్టేంత సైజులో ఉండాలి. ఆ కన్నంలో కాడను దూర్చినప్పుడు అది అటూ ఇటూ కదిలిపోకుండా.. గట్టిగా ఉండాలి. అందుకు తగిన విధంగా కన్నం పెట్టుకోవాలి.

    కన్నంలో రోజా కాడను దూర్చిన తర్వాత... కుండీలో గానీ లేదా గార్డెన్‌లో గానీ... ఓ చిన్న గొయ్యి తవ్వి... అందులో ఆ దుంప పూర్తిగా పట్టేలా సెట్ చెయ్యాలి. తర్వాత దుంపను మట్టితో పూర్తిగా మూసేయాలి. ఇప్పుడు రోజూ కొద్దిగా నీరు పోస్తూ ఉండాలి. వారం తిరిగేసరికి... ఆ కాడకు చిగుర్లు వస్తాయి. అదో కొత్త రోజా మొక్కగా మారిపోయింది. జస్ట్ వారంలోపే ఇలా జరుగుతుంది. వీడియోలు చూడండి.



    ఇలా ఎందుకు జరుగుతుందంటే... బంగాళాదుంప రోజురోజుకూ మట్టిలో కలిసిపోతూ... అదే మొక్కకు సహజమైన ఎరువులా మారుతుంది. దుంప మెత్తగా అవుతుంటే... రోజా పూల కాడకు వేర్లు వచ్చి, దుంపలోని పోషకాలను మొక్కకు అందిస్తాయి. దాంతో మొక్క చిగుర్లు వేస్తుంది. కాలక్రమంలో ఆ దుంపే పూర్తిగా మొక్కకు ఆహారంగా మారిపోతుంది. ఆలూ నుంచి తీసుకున్న పోషకాలతో రోజా మొక్క, దానికి వచ్చే పూలు బలంగా ఉంటాయి. అందుకే పిల్లలతో ఇలా చేయిస్తారు పెద్దలు.


    ఇది కూడా చదవండి: Chicken Chases Dog Video: కోడా మజాకా... కుక్కకు చుక్కలు చూపించిందిగా..

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు