Weight loss: ఈ ఫుడ్‌తో అందం.. ఆరోగ్యం రెండూ.. మీ సొంతం!

మన శరీరానికి పోషకాలు అందించే ఫుడ్‌తో అందం కూడా పెంచుకోవచ్చు. కాస్త గమనించి వాటిని సరైన మోతాదులో తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం.

మన శరీరానికి పోషకాలు అందించే ఫుడ్‌తో అందం కూడా పెంచుకోవచ్చు. కాస్త గమనించి వాటిని సరైన మోతాదులో తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం.

  • Share this:
మనం తీసుకునే ఆహారంలో విటమిన్స్, మినరల్స్‌ ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. అయితే, కొన్ని రకాల ఆహారంతో ఆరోగ్యంగా ఉండటంతోపాటు బరువు కూడా తగ్గించుకోవచ్చు. శరీర అంతర్గత వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి మైక్రోన్యూట్రియేంట్స్‌ ముఖ్యం. కానీ, పొటాషియం సమృద్ధిగా ఉన్న ఆహారంతో శరీర ఆకృతి కూడా అందంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మన శరీరానికి పొటాషియం ఉన్న ఫుడ్‌తో ఎలక్ట్రోలైట్, మినరల్స్‌ అందుతాయి. బీపీని నియంత్రిస్తుంది. కణాలకు పోషకాలను అందిస్తుంది.

కిడ్నీ బీన్స్‌...
కిడ్నీ బీన్స్‌లో  Kidney beans ప్రోటిన్స్, ఫైబర్, పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది వెయిట్‌ లాస్‌కు అవసరమయ్యే న్యూట్రియెంట్స్‌ను అందిస్తుంది. అంతేకాదు, కిడ్నీ బీన్స్‌లో ఫోలెట్, ఐరన్, రాగి, విటమిన్‌ కే, మాంగనీస్‌ ఇతర న్యూట్రియెంట్స్‌ అధికంగా ఉంటాయి.

అరటి పండ్లు..
పొటాషియం రిచ్‌ ఫుడ్‌ ఇది. ఏడాది మొత్తం దొరికుతుంది. ధరకు కూడా తక్కువే. ఇందులో ఫైబర్, ఎక్కువ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉంటాయి. ఫైబర్‌ను అధిక మోతాదులో తీసుకుంటే బరువు తగ్గడానికి 30 శాతం ఉపయోగపడుతుంది. ఈ పండును తరచూ తినడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.

అరటి ఆరోగ్యంతోపాటు అందానికి ఎంత మేలు చేస్తుందంటే..!


కొబ్బరి నీరు..
బరువు తగ్గించుకునే పనిలో ఉంటే శరీరంలో హైడ్రేషన్‌ Hydration స్థాయిని కూడా గమనించాలి. కొబ్బరినీరు  coconut water తాగడం మంచిది. ఇందులో న్యూట్రియెంట్స్, ఎలక్ట్రోలైట్స్‌ను అందిస్తుంది. ఏదైనా ఎక్కువ పని చేసినపుడు శరీరంతో చెమట పోతుంది. అప్పుడు కొబ్బరినీరు తాగడం వల్ల ఎలక్ట్రొలైట్స్‌ సమతూల్యమవుతాయి. అంతేకాదు ఇందులో మెగ్నిషియం, కాల్షియం, ఉప్పు, మ్యాంగనీస్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.

స్వీట్‌ పొటాటో...
ఇది కేవలం చలికాలంలోనే దొరుకుతుంది. ఇందులో ఎక్కువ శాతం న్యూట్రియెంట్స్‌ Nutrients ఉంటాయి. ఇది స్నాక్‌ మాదిరి తీసుకోవచ్చు కూడా. స్వీట్‌ పొటాటోలో స్టార్చ్, విటమిన్‌ సీ, ప్రోటీన్, పొటాషియం, మెగ్నిషియం, విటమిన్‌ బీ6, విటమిన్‌ ఏ ఉంటాయి.

పాలకూర..
పాలకూర పోషకాల గని అని అందరికీ తెలిసిన విషయమే. ఉడికించిన పాలకూరలో 839 ఎంజీ పొటాషియం ఉంటుందట. విటమిన్‌ కే ను పెంచుకోవడానికి ఇది మంచి ఫుడ్‌.
Published by:Renuka Godugu
First published: