క్లీన్ షేవ్ (shaving) పొందేందుకు చాలా మంది ట్రై చేస్తారు. కానీ, షేవింగ్ చేసుకున్న తర్వాత వచ్చే దురద (itching) కచ్చితంగా అందరినీ ఇబ్బంది పెడుతుంది. మరి, ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి? ఆ వివరాలు తెలుసుకుందాం.
ప్రపంచవ్యాప్తంగా అనేక షేవింగ్ బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. దీన్ని సురక్షితంగా, తీసుకురావడానికి ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి షేవింగ్ చేసేటప్పుడు చర్మాన్ని రక్షించుకోవడానికి షేవింగ్ క్రీం చాలా ఎఫెక్టివ్గా పని చేస్తుంది. అయితే, మీకు ముందుగానే చర్మ సమస్యలు ఉంటే, ఎలాంటి షేవింగ్ క్రీం వాడుతున్నారు? మీ చర్మానికి సరిపోతుందా? అని ఆలోచించి కొనాలి. ఎందుకంటే షేవింగ్ తర్వాత అనేక సమస్యలు వస్తాయి. దీనికి భయపడాల్సిన పనిలేదు కానీ, షేవింగ్ చేసుకున్న తర్వాత ఆ ప్రాంతం ఎరుపు, పొడి, దురద ఎదుర్కొవాల్సి ఉంటుంది.
మన చర్మం ఎంత పొడిగా ఉంటే, షేవింగ్ చేసిన తర్వాత అన్ని ఎక్కువ సమస్యలు వస్తాయి. అందుకే షేవింగ్ చేసే ముందు మాయిశ్చరైజర్ లేదా అలొవేరా జెల్ ను తేలికగా రుద్దాలి. ఆ తర్వాత షేవింగ్ మొదలుపెట్టాలి.
ఇది కూడా చదవండి: చక్కెర ప్యూరిటీని గుర్తించండి! లేకపోతే అందులో యూరియా..
అయితే, నేరుగా షేవ్ చేయకుండా.. కొద్దిగా ట్రిమ్ చేయాలి. దీంతో పొడుగ్గా ఉన్న వెంటుకల పరిమాణం తగ్గుతుంది. ఒకటి కంటే ఎక్కువసార్లు చేయకుండా ట్రిమ్ చేస్తే పొడగాటి వెంటుకల్ కట్ అయిపోతాయి.
జుట్టు పెరుగుదలకు ఎల్లప్పుడూ షేవింగ్ చేయాల్సిందే. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
అంతేకాదు, సరైన షేవింగ్ క్రీం ఉపయోగించడం చాలా ముఖ్యం. షవర్ జెల్ లేదా సబ్బును ఎప్పుడూ ఉపయోగించకూడదు. మన చర్మ రకాన్ని బట్టి చర్మాన్ని సురక్షితంగా ఉండే షేవింగ్ క్రీం, ఫోం, జెల్ని ఎంచుకోవాలి.
ఇది కూడా చదవండి: బ్యాక్ పెయిన్‌కు ఇంట్లో ఉండే ఏకైక మందు ఏంటో తెలుసా?
షేవింగ్ చేసిన తర్వాత దురద మొదలయితే.. ఎక్కువ చర్మ సమస్యలకు దారితీస్తుంది. చర్మం దెబ్బతినకుండా ఉండటానికి షేవ్ చేసిన వెంటనే చర్మానికి కాస్త గాలి తగిలేలా ఉండాలి.
అలోవెరా జెల్ లేదా కూలింగ్ ఆఫ్టర్ షేవ్ లోషన్ షేవింగ్ తర్వాత అద్భుతంగా పని చేస్తుంది. చర్మంపై దద్దుర్లు, చికాకు, దురద మొదలైనవాటిని తగ్గించడానికి కలబంద కూడా ఉత్తమమైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.