Home /News /life-style /

PONGAL SANKRANTI 2021 TRY THESE 5 TRADITIONAL PONGAL RECIPES AT YOUR HOME SK GH

Pongal recipes: సంక్రాంతి వేళ ఈ సంప్రదాయ వంటకాలను ట్రై చేయండి.. సూపర్ టేస్ట్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Pongal recipes: సంక్రాంతికి ఇళ్లను అందంగా అలంకరించడం, గుళ్లకు వెళ్లడం, గాలిపటాలు ఎగరేయడంతో పాటు సాంప్రదాయ వంటకాలు ఉంటేనే పండుగ సంపూర్తిగా ఉంటుంది. భోగి, మకర సంక్రాంతి నేపథ్యంలో ఇళ్లలో చేసుకోగలిగే ఐదు రకాల ముఖ్యమైన వంటకాల గురించి తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
Pongal 2021: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి నెలకొంది.  రంగు రంగుల ముగ్గులు వేసి, గొబ్బెమ్మలు పెట్టి యువతులు సందడి చేస్తున్నారు. గంగిరెద్దుల ఆటలు, కోడిపందేలతో పండుగ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది.  తమిళనాడు, కర్ణాటక, కేరళలోనూ ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఉత్తరాదిన శీతాకాలం ముగిసి, సుదీర్ఘమైన ఎండాకాలానికి సూచికగా, పంటలు కోసే సమయంగా దీనికి గుర్తింపు ఉంది. పంజాబ్, హర్యాణా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో లోహ్రి పేరుతో భోగి రోజున ప్రజలంతా పండుగ చేసుకుంటున్నారు. ఇళ్లను అందంగా అలంకరించడం, గుళ్లకు వెళ్లడం, గాలిపటాలు ఎగరేయడంతో పాటు సాంప్రదాయ వంటకాలు ఉంటేనే పండుగ సంపూర్తిగా ఉంటుంది. భోగి, మకర సంక్రాంతి నేపథ్యంలో ఇళ్లలో చేసుకోగలిగే ఐదు రకాల ముఖ్యమైన వంటకాల గురించి తెలుసుకుందాం.

పులిహోర
దక్షిణాది రాష్ట్రాల్లో ప్రతి పండుగకు ఇళ్లల్లో తప్పకుండా ఉండే వంటకం పులిహోర. పండుగరోజు ఉదయాన్నే స్నానం చేసి, వంటలు వండి దేవుళ్లకు పులిహోరతో నైవేద్యం పెడతారు. నిమ్మకాయతో పాటు చింతపండుతో కూడా పులిహోర తయారు చేసుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో పండుగలతో పాటు అన్ని రకాల ఫంక్షన్లు, కార్యక్రమాల్లోనూ ఇది తప్పనిసరిగా ఉంటుంది. ఈ సంక్రాంతికి బంధుమిత్రులను ఇంటికి పిలిచి పులిహోర వడ్డించేలా ఏర్పాట్లు చేసుకోవచ్చు.

మురుకులు, సకినాలు
తెలంగాణలో సకినాలు, ఆంధ్రలో మురుకులుగా పిలుచుకునే ఈ వంటకాన్ని సంక్రాంతికి ప్రత్యేకంగా తయారు చేసుకుంటారు. ముఖ్యంగా తెలంగాణలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఈ పండుగకు కచ్చితంగా సకినాలు చేసుకుంటారు. పండుగ సందర్భంగా ఇంటికి వచ్చే అతిథులకు వీటి రుచి చూపిస్తారు. పిల్లలకు చిరుతిండిగానూ వీటిని చేసుకోవచ్చు. సంక్రాంతి సందర్భంగా చేసుకునే పిండి వంటకాల్లో మురుకులు, సకినాలు తప్పనిసరిగా ఉండేలా ప్రణాళిక వేసుకోండి.

పూర్ణం బూరెలు
ఆంధ్రప్రదేశ్‌లో పూర్ణం బూరెలను ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారు. పండుగకు ప్రత్యేకంగా వీటిని తయారు చేసి వడ్డిస్తారు. పెళ్లిళ్లలోనూ అతిథులకు పూర్ణం బూరెలను పెడతారు. ఈ సంక్రాంతికి ఇంట్లో సులభంగా చేసుకోగలిగే వంటకాల్లో దీన్ని కూడా చేర్చవచ్చు. కొబ్బరి, బెల్లం వంటివి కలిపి పూర్ణాలు చేసి, వాటిని పిండిలో పెట్టి నూనెలో వేయించి బూరెలను తయారు చేస్తారు.

పాయసం
ఈ తీపి వంటకాన్ని కూడా పండుగ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేస్తారు. పాలు, బెల్లం లేదా చక్కెర కలిపి చేసే పాయసాన్ని చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటారు. దక్షిణ భారతంలో డెజర్ట్‌గానూ దీనికి పేరుంది. తమిళనాడులో కొన్ని రకాల పప్పులతో, కేరళలో కొబ్బరిపాలతో, తెలుగు రాష్ట్రాల్లో బియ్యంతో పాయసం తయారు చేస్తారు. పండుగ వంటకాల్లో దీన్ని కూడా చేర్చుకోవచ్చు. పెద్దగా ఇబ్బంది పడకుండా, సులువుగా పాయసం తయారు చేసుకోవచ్చు.

పొంగళి
ఈ సంక్రాంతికి ఇంట్లో సులభంగా చేసుకునే వంటకాల్లో ఇది ఒకటి. బియ్యం, పెసర పప్పు, మిరియాలు లేదా మిరియాల పొడి, జీలకర్ర, నెయ్యితో చేసే పొంగళి ఎంతో రుచిగా ఉంటుంది. బాదం పప్పు, జీడిపప్పు కలిపి దీన్ని సిద్ధం చేసుకోవచ్చు. తమిళనాడులో దీన్ని ఖారా పొంగల్ అంటారు. సంక్రాంతికి ఇంట్లో ఈ వంటకాన్ని తప్పనిసరిగా తయారు చేసుకుంటారు. అందుకే పండుగ పేరుమీదుగా దీనికి పొంగల్, పొంగళి అనే పేరు వచ్చింది.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Life Style, Pongal, Recipes, Sankranti 2021

తదుపరి వార్తలు