Polycet Exam : తెలంగాణ పాలిసెట్ 2019 నోటిఫికేషన్ రిలీజ్

వివిధ ఇంజినీరింగ్ కోర్సుల్లో డిప్లొమా ప్రవేశాలకు పాలిసెట్ 2019 నోటిఫికేషన్‌ని విడుదలైనంది. పదోతరగతి ఉత్తీర్ణులైన, ప్రస్తుతం పరీక్ష రాస్తున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

Amala Ravula | news18-telugu
Updated: March 14, 2019, 10:17 AM IST
Polycet Exam : తెలంగాణ పాలిసెట్ 2019 నోటిఫికేషన్ రిలీజ్
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: March 14, 2019, 10:17 AM IST
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో 2019-20 విద్యా సంవత్సరానికి వివిధ ఇంజినీరింగ్ కోర్సుల్లో డిప్లొమా ప్రవేశాలకు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రెయినింగ్ ‘పాలిసెట్-2019’ నోటిఫికేషన్‌ని విడుదల చేసింది. ఈ కోర్సుల్లో ప్రవేశానికి పదోతరగతి ఉత్తీర్ణులైన, ప్రస్తుతం పరీక్ష రాస్తున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో మార్చ 14 నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్ 16న పాలిసెట్ పరీక్ష నిర్వహిస్తారు. రిజల్ట్స్ ఏప్రిల్ 24న రిలీజ్ అవుతాయి.
పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ -2019 కోర్సుల వివరాలు..
మూడేళ్ల కోర్సులు - సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్, మెకానికల్, ఆటోమొబైల్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఐటీ, మైనింగ్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్ (షుగర్ టెక్నాలజీ), ప్రింటింగ్ టెక్నాలజీ, కంప్యూటర్ అండ్ కమర్షియల్ ప్రాక్టీస్.

మూడున్నరేళ్ల కోర్సులు -మెటలర్జికల్, టెక్స్‌టైల్ టెక్నాలజీ, కెమికల్, కెమికల్(ఆయిల్ టెక్నాలజీ, పెట్రో కెమికల్, ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్), సిరామిక్, లెదర్ టెక్నాలజీ, టెక్నాలజీ, లెదర్ గూడ్స్ అండ్ ఫుట్‌వేర్ టెక్నాలజీ.
ఎలక్ట్రానిక్స్‌లో స్పెషల్ డిప్లొమా కోర్సులు - ఎంబెడెడ్ సిస్టమ్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఇండస్ట్రీయల్ ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజినీరింగ్, టీవీ అండ్ సౌండ్ ఇంజినీరింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్.
అర్హత : పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత. 2019 మార్చిలో పదోతరగతి పరీక్షలు హాజరుకానున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.


దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా..
Loading...
ఎంపిక విధానం : ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా..
పరీక్ష విధానం : ఎంట్రెన్స్ టెన్స్‌లో మొత్తం 120 మార్క్స్ ఉంటాయి. ఇందులో మ్యాథ్స్ -60, ఫిజిక్స్ -30, కెమిస్ట్రీ -30 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు.
పరీక్షా సమయం : 2 గంటలు.
అర్హత మార్కులు : 36
ప్రవేశ పరీక్షలో ఉత్తర్ణులైనవారు మూడేళ్లు, మూడున్నరేల్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలుపొందుతారు.
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ విడుదల : 13-03-2019
దరఖాస్తు ప్రారంభం : 14-03-2019
పాలిసెట్ ఎగ్జామ్ డేట్ : 16-04-2019 (ఉ.11 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు)
రిజల్ట్స్ డేట్ : 24-04-2019

ఇవి కూడా చదవండి..
First published: March 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...