భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సూచనతో ఐక్యరాజ్యసమితి 2014లో జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day)గా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనితో 2015, జూన్ 21 నుంచి ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. అయితే జూన్ 21నే యోగా దినోత్సవం జరుపుకోవడానికి ఒక ముఖ్య కారణం ఉంది. అదేంటంటే, ఏడాదిలో 365 రోజుల్లో ఈరోజు మాత్రమే ఉత్తరార్ధగోళంలో ఎక్కువ పగటి సమయం ఉంటుంది. 5 వేల సంవత్సరాల కంటే ముందుగానే యోగా ఇండియాలో ఉద్భవించింది. కాలచక్రంలో యోగా దేశదేశాలకు దావానలంలా వ్యాపించింది. మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో యోగా ఎంతగానో దోహదపడుతుంది. యోగా సాధన వల్ల కలిగే ప్రయోజనాలు కోకొల్లలు. ఈ ప్రయోజనాల గురించి అవగాహన పెంచడమే యోగా డే లక్ష్యంగా పెట్టుకుంది.
ఏటా ఒక థీమ్‌తో యోగా దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఏడాది 'మానవత్వం కోసం యోగా (Yoga for Humanity’)' అనే థీమ్‌తో యోగా డేని జరుపుకోనున్నారు. రేపే యోగా డే, కాగా యోగాపై పీఎం మోదీ ఇప్పటివరకు చెప్పిన కొన్ని పవర్‌ఫుల్ కొటేషన్లు ఏవో తెలుసుకుందాం.
1. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, శ్రేయస్సు కోసం కోరుకునేవారికి యోగా సాధన అనేది సింబల్‌గా నిలుస్తుంది. ఏ ఖర్చు లేని ఆరోగ్య ప్రదాయని యోగా.
2. యోగా అనేది రోగాల నుంచి విముక్తి కలిగించేది మాత్రమే కాదు, భోగాల నుంచి ముక్తి కలిగించేది కూడా. యోగా మన సాంస్కృతిక రాయబారి కావచ్చు. ఈ మాధ్యమం ద్వారా మనం ప్రపంచాన్ని చేరుకోవచ్చు.
3. యోగా నుంచి మనమేం పొందుతున్నామనేది ముఖ్యం కాదు. యోగా ద్వారా మనమేం వదిలేస్తున్నామనేది ముఖ్యం.
4. యోగా అనేది క్రమశిక్షణ, మెడిటేషన్‌కి ఒక ఫిలాసఫీ లాంటిది. ధ్యానం అనేది ఒక వ్యక్తిని మనసా, వాచా కర్మణా, జ్ఞానం, భక్తిలో మెరుగైన వ్యక్తిగా చేస్తుంది.
5. ప్రస్తుత కాలంలో మనతో మనం అసలు ఉండటం లేదు. యోగా మనతో మనల్ని మమేకం చేసేందుకు సహాయపడుతుంది.
6. యోగ మనస్సు, శరీరాన్ని ఏకం చేస్తుంది. ఆలోచనలు, చేసే పనిని.. నిగ్రహం, నెరవేర్పును ఒకటి చేస్తుంది. మనిషి, ప్రకృతి మధ్య సామరస్యాన్ని పెంపొందిస్తుంది. ఆరోగ్యం, శ్రేయస్సుకు సమగ్ర విధానాన్ని అందిస్తుంది.
7. యోగా ఆరోగ్యంతో పాటు ఫిట్‌నెస్‌ను మెరుగుపరుస్తుంది. యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదు ఇది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సు అందిస్తూ ప్రశాంతతను పొందే ఒక ఉత్తమ మార్గం.
8. అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది ప్రపంచం ఇంతకుముందెన్నడూ కనీవినీ ఎరుగని అతిపెద్ద జ్ఞాన-ఆధారిత ప్రజల ఉద్యమానికి ప్రతిబింబం.
9. యోగా ప్రజలు జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి, ప్రకృతితో మమేకం అవ్వడానికి సహాయపడుతుంది. యోగా వల్ల స్వయం భావన పెరిగి మన కుటుంబాలను సమాజాలు, మానవాళిని మనకు కొనసాగింపుగా చూడగలుగుతాం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health, Narendra modi, Yoga, Yoga day 2022