మీకుతెలుసా.. పందులు, గొర్రెల సాయంతో మనుషుల కిడ్నీలు రానున్నాయి..

అవయవాల కొరతకు త్వరలోనే పరిష్కారం లభించనుంది. సమస్యను పరిష్కరించేందుకు శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలిచ్చాయి.

Amala Ravula | news18-telugu
Updated: February 8, 2019, 9:59 PM IST
మీకుతెలుసా.. పందులు, గొర్రెల సాయంతో మనుషుల కిడ్నీలు రానున్నాయి..
మూత్రపిండాలు
Amala Ravula | news18-telugu
Updated: February 8, 2019, 9:59 PM IST
ఏదైనా సమయంలో అవయవాలు పనిచేయకపోతే, పాడైపోతే వాటిని మారుస్తుంటాం. కానీ, ఇలాంటి కేసులు ఎక్కువై అవయవాల కొరత ఏర్పడుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎప్పట్నుంచో పరిశోధనలు జరిగాయి. దాని ఫలితమే మనుషులకు అవసరమయ్యే అవయవాలను పందులు, గొర్రెల్లో తయారుచేయడం.
కిడ్నీ సమస్యలతోబాధపడి.. అవయవదాతలకోసం ఎదురుచూసి కన్నుమూసినవారి సంఖ్య వేలల్లో ఉంది. దీంతో జపాన్‌కి చెందిన శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన మూలకణాలతో ఎలుకల్లో కిడ్నీలను పెంచారు. వాటి పనితీరు ఇప్పుడు ఎంతో ఆశాజనకంగా ఉంది. ఇది గనుక సక్సెస్ అయితే.. ఇదే ఫార్మూలాను మనుషుల అవయవాలకు సరిపోలే పందులు, గొర్రెల్లో ప్రవేశపెట్టనున్నారు.
సరైన రసాయనిక పద్ధతులతో మూలకణాన్ని ఏరకమైన కణజాలంగానైనా మార్చొచ్చు. అయితే, అది పూర్తిగా మారాక.. ఏ విధంగా పనిచేస్తుందని చెప్పడం మాత్రం కాస్తా అనుమానం ఉంది. ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్న ఈ పరిశోధన.. సక్సెస్ అయితే, ఇక త్వరలోనే అవయవాల కొరత తీరనుంది.

First published: February 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు