Health Tips : ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్యాకెట్స్‌లోని నీరు తాగుతున్నారా..

ఈ సమయంలో చాలామంది దాహానని తట్టుకోలేక మంచినీళ్లు తాగుతుంటారు. కొంతమంది బయటే ప్లాస్టిక్‌బాటిల్స్, ప్యాకెట్స్ వాటర్ కొని తాగుతుంటారు. అయితే.. ఇందులో ఏ ప్లాస్టిక్ మంచిదో తెలుసుకోవాలంటే ఈ విషయాలు తెలుసుకోండి..

Amala Ravula | news18-telugu
Updated: May 7, 2019, 12:58 PM IST
Health Tips : ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్యాకెట్స్‌లోని నీరు తాగుతున్నారా..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: May 7, 2019, 12:58 PM IST
ప్లాస్టిక్ మంచిది కాదని మనకి తెలుసు. కానీ తప్పనిసరి సందర్భాల్లో తప్పవు.. అయితే, అందులోని కొన్ని విషయాలు గమనిస్తే వాటినుంచి వచ్చే ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. ఇప్పుడు మనం కొనే వాటర్ బాటిల్స్‌, ప్యాకెట్స్‌పై త్రిభుజాకారంలో బాణం గుర్తులుంటాయి.. వాటి గురించి తెలిస్తే చాలు...

plastic
ఇలాంటి గుర్తులు చూసి బాటిల్స్ కొనండి..


PETE అని రాసి ఉండే బాటిల్స్..బాటిల్‌పై త్రిభుజాకారంలో మధ్యలో 1 అని వేసి.. కింద PETE అని రాసి ఉంటుంది. అంటే.. పాలీ ఇథైలీన్ టెరిప్తలేట్ అని అర్థం. మనం సాధారణంగా పెట్ బాటిల్స్ అని వీటినే పిలుస్తుంటాం. వీటిని ఒక్కసారి మాత్రమే వాడాలి.. మళ్లీ మళ్లీ వాడితే.. మహిళల్లో గర్భస్రావ, రుతుక్రమ సమస్యలు వస్తాయని,.. ప్రతీ ఒక్కరి ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపిస్తాయని చెబుతున్నారు.

HDPE అని రాసి ఉండే బాటిల్స్.. బాటిల్‌పై త్రిభుజాకారంలో బాణం గుర్తు మధ్యలో 2 అని నెంబర్ ఉండి కింద HDPE అని రాసి ఉంటే.. ఇవి మంచి బాటిల్స్.. హై డెన్సిటీ పాలీ ఇథైలీన్ తో రూపొందించే ఇలాంటి ప్లాస్టిక్‌ని ఆహార పదార్థాల నిల్వకి కూడా వాడుకోవచ్చు. వీటిని ఎక్కువగా రీసైకిల్ చేస్తారుకాబట్టి ఆహార పదార్థాల ప్యాకేజింగ్‌లో వినియోగించరు..



PVC అని రాసి ఉండే బాటిల్స్.. బాటిల్‌పై త్రిభుజాకారంలో బాణం గుర్తు మధ్యలో 3 అని నెంబర్ ఉండి కింద PVC అని ఉండే బాటిల్స్ చాలా డేంజర్.. పాలీ వినైల్ క్లోరైడ్‌ అనే ఈ ప్లాస్టిక్ వినియోగం దగ్గరి నుంచి రీసైక్లింగ్, డిస్పోజల్ వరు అంతా విషపూరితమే.. వీటిని క్యాన్సర్ కారకంగా చెబుతారు. మెత్తగా ఎక్కువగ వంగేలక్షణం ఉండి.. తక్కువ ధరకు దొరకడం వల్ల వీటిని చాలామంది ఉపయోగిస్తారు. కానీ.. వీటిని ఎంత తక్కువ వాడితే అంత మంచిది.

LDPE అని రాసి ఉండే బాటిల్స్.. త్రిభుజాకారంలో బాణం గుర్తు మధ్యలో 4 అని కింద LDPE అని రాసి ఉండే ఈ బాటిల్స్ కాస్తా మంచివే.. లో డెన్సిటీ పాలీ ఇథైలీన్ అనే ఈ బాటిల్స్ వేడికి గురైనప్పుడు మాత్రం వీటిని అంతగా వాడొద్దు..
PP అని రాసి ఉండే బాటిల్స్.. త్రిభుజాకారంలో బాణం గుర్తు మధ్యలో 5 అని కింద PP రాసి ఉండే ఈ బాటిల్స్ కూడా మంచివే. పాలీ ప్రొపైలీన్‌తో రూపొందించే ఈ ప్లాస్టిక్‌ మందుల కంటెయినర్లు, స్ట్రాలు, బాటిళ్ల మూతలు, పాల బాటిళ్ళు, డిస్పోజబుల్ డైవర్లు వంటివి తయారవుతాయి ఈ ప్లాస్టిక్‌తో.
Loading...
PS అని రాసి ఉండే బాటిల్స్.. త్రిభుజాకారంలో బాణం గుర్తు మధ్యలో 6.. కింద PS రాసి ఉండే ఈ బాటిల్స్మరీ డేంజర్. పాలీ స్టైరీన్‌తో రూపొందించే ఈప్లాస్టిక్ తక్కువ ఖర్చుతో దొరుకుతాయని చాలామంది కొంటుంటారు. కానీ.. దీన్ని వినియోగించడం వల్ల క్యాన్సర్, ప్రత్యుత్పత్తి నిర్వీర్యం, నాడీ, మెదడు, కాలేయం, ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతాయని తేలింది కాబట్టి జాగ్రత్త.

OTHER అని రాసి ఉండే బాటిల్స్.. త్రిభుజాకారంలో 7 అని రాసి కింద OTHER అని ఉంటే.. కొంచెం ఆలోచించాల్సిందే. ఎందుకుంటే బీపీ, పాలీ కార్బోనట్, లెక్సాన్, ఇతర చాలా రకాలుంటాయి. వీటి వినియోగం తక్కువ. హానికరం కూడా తక్కువే. కాబట్టి తెలుసుకోండి..

ఏమైనా ప్లాస్టిక్‌ని ఎంత తగ్గిస్తే అంత మంచిది.. తప్పని పరిస్థితుల్లో వాడాలంటే.. ఈ విషయాలు ఖచ్చితంగా గమనించండి..

ఈ వీడియో కూడా చూడండి..

First published: May 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...