హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Christmas Vacation: క్రిస్మస్ వెకేషన్ ప్లాన్‌ చేస్తున్నారా? వీసా లేకుండా వెళ్లిరాగల 5 బ్యూటిఫుల్‌ కంట్రీస్‌ ఇవే..

Christmas Vacation: క్రిస్మస్ వెకేషన్ ప్లాన్‌ చేస్తున్నారా? వీసా లేకుండా వెళ్లిరాగల 5 బ్యూటిఫుల్‌ కంట్రీస్‌ ఇవే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

క్రిస్మస్‌ వెకేషన్‌కు కుటుంబంతో కలిసి విదేశాలను చుట్టిరావాలని ప్లాన్‌ చేస్తున్నారా? బడ్జెట్‌, వీసా అప్రూవల్‌ వంటి టెన్షన్‌లు ఉన్నాయా? అవేవీ ఆలోచించకుండా సులువుగా వెళ్లిరాగల అందమైన కొన్ని బ్యూటిఫుల్‌ కంట్రీస్‌ ఉన్నాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Christmas Vacation : ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో సరదాగా గడపడానికి సమయం దొరకడం చాలా తక్కువ. సంవత్సర కాలంలో చాలా అరుదుగా ట్రిప్‌లకు వెళ్లే అవకాశం దక్కుతుంది. అలాంటి ఓ ప్రత్యేక సందర్భమే క్రిస్మస్‌ వెకేషన్‌. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్‌(Christmas) సందడి మొదలైపోయింది. మీరు కూడా క్రిస్మస్‌ వెకేషన్‌కు(Christmas Vacation) కుటుంబంతో కలిసి విదేశాలను చుట్టిరావాలని ప్లాన్‌ చేస్తున్నారా? బడ్జెట్‌, వీసా అప్రూవల్‌ వంటి టెన్షన్‌లు ఉన్నాయా? అవేవీ ఆలోచించకుండా సులువుగా వెళ్లిరాగల అందమైన కొన్ని బ్యూటిఫుల్‌ కంట్రీస్‌ ఉన్నాయి. ఇండియన్ పాస్ పోర్ట్ ఉన్న వారికి వీసా లేకుండానే పర్యటించే అనుమతి ఉన్న దేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

థాయిలాండ్

చాలా తరచుగా తెలుగువారు థాయిలాండ్, బ్యాంకాక్ పేర్లు వింటూనే ఉంటారు. ఈ సౌత్ ఈస్ట్ ఏసియన్ దేశాలు అద్భుతమైన దేవాలయాలకు, రుచికరమైన ఆహారాలకు ప్రసిద్ధి. ఈ దేశాలలోని గొప్ప సాంస్కృతిక ప్రదేశాలు ఆకట్టుకుంటాయి. ఈ దేశంలోని ప్రతి ప్రాంతం థాయ్ ప్రజల ఆతిథ్యాన్ని చూపిస్తుంది. కోహ్ సమూయి, ఫి ఫి, కోహ్ ఫా న్గాన్ వంటి ఐలాండ్స్‌ టూరిస్ట్ అట్రాక్షన్‌లలో టాప్‌ ప్లేస్‌లో ఉన్నాయి.

మకావ్

మకావ్‌ను చైనా వేగస్‌గా పిలుస్తారు. ఈ ప్రదేశంలో నైట్‌లైఫ్‌ మెయిన్‌ అట్రాక్షన్‌. ఖరీదైన వినోదానికి, స్థానిక సంస్కృతి ఉట్టిపడేలా చేసిన నిర్మాణాలు ఆకట్టుకుంటాయి. భారతీయులు ఈ దేశంలో వీసా లేకుండా 30 రోజుల వరకు ఉండవచ్చు. అవసరమైతే హాంకాంగ్ ఎయిర్ పోర్టుకు వచ్చాక వీసా పొందవచ్చు.

Indonesia: ఇండోనేషియాలో పెళ్లికి ముందు శృంగారం,సహజీవనం నేరం..ఇండియా చట్టాలు ఎలా ఉన్నాయంటే?

మారిషస్‌

హిందూ మహాసముద్రం ఐలాండ్ దేశం మారిషస్‌. వెచ్చగా ఉండే స్వచ్ఛమైన సముద్రపు నీరు, బీచ్‌లు, వివిధ జాతులకు చెందిన ప్రజలతో సందడిగా ఉంటుంది. భారతీయులు అతి త్వరగా చేరుకోగల టూరిస్ట్ ప్లేసెస్‌లో ఇది ఒకటి. ఇక్కడ 90 రోజుల వరకు వీసా లేకుండా ఉండవచ్చు.

ఇండోనేషియా

ఇండోనేషియా హిస్టరీ చాలా గొప్పగా ఉంటుంది. భారతీయులు వెళ్లడానికి చాలా అనువైన ప్రదేశం. తానహ్ లాట్ దేవాలయం, కింతామని వోల్కానో జలపాతాలకు ఇండోనేషియాలో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు. భారతదేశం నుంచి వచ్చే టూరిస్టులకు ఈ దేశంలో 30 రోజుల వరకు వీసా లేకుండా ఉండే అవకాశం ఉంది.

ఫిజీ

ఫిజీని రిపబ్లిక్ ఆఫ్ ఫిజీగా పిలుస్తారు. ఫిజీ అనేది మలినేషియా(Melanesia)లో సౌత్ పసిఫిక్ ఓషన్ ఐలాండ్ రిపబ్లిక్. భారతీయులు ఈ దేశంలో వీసా లేకుండా 120 రోజులపాటు ఉండవచ్చు. తెల్లని బీచ్‌లు, ఆకర్షించే ఐలాండ్లు ఈ దేశానికి ఎక్కువ మంది టూరిస్ట్‌లను రప్పిస్తున్నాయి. ఇక్కడ స్కూబా డైవింగ్ చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు.

First published:

Tags: Christmas, Travelling, Visa

ఉత్తమ కథలు