Weight Loss Tips: బరువు తగ్గడానికి వాకింగ్ చేస్తున్నారా...? అయితే ఈ చిట్కాలు పాటించండి

Weight Loss Tips: అధిక బరువు సమస్యతో బాధపడేవారికి వాకింగ్ ఒక మంచి వ్యాయామం. దీని ద్వారా ఎటువంటి అనారోగ్య సమస్యలూ ధరిచేరవు. కానీ ఎంతసేపు నడవాలి..? ఎలా నడవాలి..? ఎక్కడ నడవాలి..? అనేదానిమీద చాలా మందికి అవగాహన ఉండదు.

news18
Updated: November 27, 2020, 4:05 PM IST
Weight Loss Tips: బరువు తగ్గడానికి వాకింగ్ చేస్తున్నారా...? అయితే ఈ చిట్కాలు పాటించండి
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: November 27, 2020, 4:05 PM IST
  • Share this:
నేటి బిజీ జీవన శైలి, చెడు ఆహారపు అలవాట్లతో చాలా మంది చిన్న వయసులోనే ఊబకాయం, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వీరు బరువు తగ్గడానికి తరచుగా డైటింగ్ చేయడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. కానీ ఇది సరైన పద్ధతి కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆహార పరిమాణాన్ని తగ్గించడం అనేది బరువు తగ్గడానికి చేసే ఆరోగ్యకరమైన ఎంపిక కాదని వారు పేర్కొంటున్నారు. దీనికి బదులుగా, సరైన డైట్ ప్లాన్‌ను సిద్ధం చేసుకోని రోజూ ఉదయం ఒక గంట పాటు వాకింగ్ చేయండని వారు సూచిస్తున్నారు. వాకింగ్ కేవలం బరువు తగ్గడానికే కాకుండా, రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. మీరు కూడా వాకింగ్ ద్వారా బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే, వాకింగ్ చేసే సమయంలో ఈ క్రింది చిట్కాలను పాటించండి.

వాకింగ్ చేసే సమయంలో సరైన దుస్తులు ధరించడం చాలా ముఖ్యం. ఇది మీ వాకింగ్ ను సౌకర్యవంతంగా చేస్తుంది. లేదంటే మీ దుస్తులు చెమటలో నిండిపోతాయని గుర్తించుకోండి. అందువల్ల, వాకింగ్ చేసేటప్పుడు సౌకర్యవంతమైన ట్రాక్‌సూట్ ను ఎంచుకోండి. అది మిమ్మల్ని అసౌకర్యానికి గురిచేయకుండా మిమ్మల్ని మీ నడకపై దృష్టి పెట్టేలా చేస్తుంది.

తక్కువ బరువు గల స్నీకర్లను వేసుకోండి

వాకింగ్ సమయంలో మీ పాదాలు మీ మొత్తం శరీర బరువును మోయాల్సి ఉంటుంది. కాబట్టి, తప్పనిసరిగా సౌకర్యవంతమైన స్నీకర్లను ధరించండి. తక్కువ బరువుతో ఉండే వాటినే ఎంపిక చేసుకోండి. ఎందుకంటే, అధిక బరువు గల పాదరక్షలు నొప్పిని కలిగిస్తూ మీ వాకింగ్కు ఆటంకం కలిగిస్తాయి.

తక్కువ బరువున్న వాటర్ బాటిల్ లేదా పర్సును తీసుకెళ్లండి

నడుస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు ఉత్తేజంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీ శరీరంలో డీహైడరేషన్ను నివారించడానికి క్రమం తప్పకుండా కొన్ని వాటర్ను తీసుకోండి. బరువు తగ్గాలని కోరుకునే వారు తరచూ నీరు త్రాగాలి. ఎందుకంటే, నీరు శరీరంలోని అధిక కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. అదేవిధంగా, ఎల్లప్పుడూ తక్కువ బరువున్న వాటర్ బాటిల్, పర్సును తీసుకెళ్లడానికే ప్రయత్నించండి.

క్రమంగా నడక వేగాన్ని పెంచండి

ఒకేసారి నడక వేగాన్ని పెంచకండి. ఇది కాళ్ళ నొప్పులకు దారితీస్తుంది. అందువల్ల, క్రమంగా మీ నడక వేగాన్ని పెంచుకోండి. దీనికి గాను కొన్ని రోజుల పాటు సాధన చేయడం మంచిది.

నిటారుగా నడవండి

మీరు నడుస్తున్నప్పుడు మీ వెన్నెముకను నిటారుగా ఉంచండి. అంతేకాక, చేతులు, భుజాలను గట్టిగా ఉంచండి. నడక సమయంలో ఎల్లప్పుడూ రిలాక్స్ గా ఉండండి.

అప్పుడప్పుడు మెట్లు ఎక్కండి

వాకింగ్ ట్రాక్ లేదా రహదారిలా కనిపించేలా ఉన్న సురక్షితమైన స్థలాన్ని వాకింగ్ కు ఎంచుకోండి. అంతేకాక, అప్పుడప్పుడు మెట్లు ఎక్కడం ద్వారా మీ శరీరంలోని అధిక కొవ్వును కరిగించవచ్చు.
Published by: Srinivas Munigala
First published: November 27, 2020, 4:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading