హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Hotel Bookings: సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా..? హోటల్ బుకింగ్స్‌లో మనీ ఇలా సేవ్ చేసుకోండి..

Hotel Bookings: సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా..? హోటల్ బుకింగ్స్‌లో మనీ ఇలా సేవ్ చేసుకోండి..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

కొన్ని సూచనలు పాటిస్తే వెకేషన్‌లో బడ్జెట్ ఫ్రెండ్లీ హోటళ్లలో వసతి ఏర్పరుచుకోవచ్చు. టూర్ ప్లాన్స్‌ చేస్తే, హెటల్ బుకింగ్‌కు చేసే ఖర్చును ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకోండి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Hotel Bookings: వేసవి వచ్చిందంటే చాలు.. ఎక్కడికి వెళ్దామా? అనే ఆలోచనలు మొదలవుతాయి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి టూర్‌లు చుట్టేందుకు ప్లాన్‌లు చేస్తుంటారు. తక్కువ ఖర్చుతో వీలైనన్ని ఎక్కువ ప్రదేశాలు కవర్ చేయాలని కొందరు భావిస్తుంటారు. ఇందుకు టూరిస్ట్ స్పాట్స్‌కు దగ్గర్లో అందుబాటు ధరల్లో ఉండే హోటళ్లు, తదితర సౌకర్యాల కోసం చూస్తుంటారు. వెకేషన్ ట్రిప్‌లో మంచి వసతి, సదుపాయాల కోసం ఎక్కువగా ఖర్చు అవుతుంది. అయితే కొన్ని సూచనలు పాటిస్తే వెకేషన్‌లో బడ్జెట్ ఫ్రెండ్లీ హోటళ్లలో వసతి ఏర్పరుచుకోవచ్చు. టూర్ ప్లాన్స్‌ చేస్తే, హెటల్ బుకింగ్‌కు చేసే ఖర్చును ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకోండి.

* అడ్వాన్స్‌డ్ బుకింగ్

వేసవిలో హోటల్ రూమ్స్ ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. రెగ్యులర్ ప్రైజ్‌లో వసతి దొరక్కపోవచ్చు. అందుకే ముందుగానే హోటల్స్‌ బుక్ చేసుకోండి. దీంతో డబ్బులు ఆదా అవుతాయి. పీక్ సీజన్‌లో పెరిగిన ఛార్జీలను అవాయిడ్ చేయడానికి ఎర్లీ బుకింగ్స్ బాగా ఉపయోగపడతాయి. అయితే, కొన్ని సందర్భాల్లో లేట్ బుకింగ్స్ కూడా మీకు బెనిఫిట్స్ ఇస్తాయి. మార్కెట్లో కాంపిటీషన్‌ని బట్టి పీక్ సీజన్‌లో కొన్ని హోటళ్లు డిస్కౌంట్‌ ఆఫర్ చేయొచ్చు. ఆన్‌లైన్‌లో రిసార్ట్, హోటల్స్‌ని బుక్ చేసేటప్పుడు వీటిపై ఓ కన్నేసి ఉంచాలి.

* బడ్జెట్‌పై క్లారిటీ

వెకేషన్‌లో హోటల్స్‌ అకామడేషన్‌కి కావాల్సిన బడ్జెట్ ఎంతో ముందే డిసైడ్ చేసుకోండి. పక్కా ప్లాన్‌తో డబ్బును ఖర్చు చేయండి. ఒక బడ్జెట్ ప్లాన్ వేసుకోండి. ఎక్కడ, ఏ హోటల్‌కి, ఎంత ఖర్చు చేయాలని అనుకుంటున్నారో ముందే ఫిక్స్ అవ్వండి. బడ్జెట్ ప్లాన్ లేకపోతే డబ్బు వృథాగా ఖర్చయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్స్ కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేయండి.

* ఆన్‌లైన్ బుకింగ్ పోర్టల్స్

హోటల్ బుకింగ్ కోసం ఆన్‌లైన్ పోర్టల్స్ కొన్నిసార్లు స్పెషల్ ఆఫర్లను ఇస్తుంటాయి. మేక్ మై ట్రిప్(Makemytrip), గోఐబిబో(Goibibo) వంటి ఆన్‌లైన్ బుకింగ్ పోర్టల్స్ మంచి డిస్కౌంట్‌లను అందిస్తాయి. అంతేగాకుండా కొన్ని క్రెడిట్ కార్డులపై అదనంగా బెనిఫిట్స్ ఇస్తుంటాయి. వీటితో తక్కువ ధరకే మంచి హోటల్‌ని బుక్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది.

Layoffs: టెక్ లేఆఫ్స్‌లో సరికొత్త రికార్డ్.. మూడు నెలల్లోనే గతేడాది మించి ఉద్యోగుల తొలగింపు..!

* బడా హోటళ్లలో ఆఫర్లు

దేశంలోని బడా హోటళ్లు కొన్ని సందర్భాల్లో ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. తాజ్ హోటల్, రాడిసన్ హోటల్ వంటివి డిస్కౌంట్లు ఇస్తుంటాయి. నేరుగా హోటల్‌కి వెళ్లి బుక్ చేసుకోవడం కూడా కొన్నిసార్లు మంచిదే. అప్పుడప్పుడు మెరుగైన సౌకర్యాలతో కూడిన హోటళ్లు తక్కువ ధరకే లభించొచ్చు. మీ ట్రిప్‌లో ఈ తరహా హోటళ్లు లొకేట్ అయి ఉన్న ప్రాంతాలు ఉంటే నేరుగా వెళ్లి బుక్ చేసుకోవచ్చు.

* మెంబర్‌షిప్

చాలా వారకు హోటళ్లు మెంబర్‌షిప్ కార్డ్ సౌకర్యాన్ని కల్పిస్తాయి. ఈ కార్డులపై డిస్కౌంట్‌లు, ఆఫర్లను కల్పిస్తాయి. మీకు కూడా ఇలాంటి మెంబర్‌షిప్ కార్డు ఉంటే హోటల్ బుకింగ్ సమయంలో ఉపయోగపడుతుంది. కార్డులో ఉన్న పాయింట్స్‌ మీకు సహాయపడొచ్చు. వీటితో హోటల్ రూమ్స్‌ని తక్కువ ధరకే దక్కించుకోవచ్చు. హోటల్ బుక్ చేసే సమయంలో ఈ మెంబర్‌షిప్ కార్డును వాడటం మర్చిపోవద్దు. దేశవ్యాప్తంగా బ్రాంచ్‌లు ఉన్న హోటళ్లలో మెంబర్‌షిప్ ఉంటే ఎక్కువగా లబ్ధి పొందవచ్చు.

First published:

Tags: Hotels, Travel

ఉత్తమ కథలు