Home /News /life-style /

PLANNING A TOUR IF YOU GO TO THESE PLACES IN THE NORTH YOU WILL NEVER FORGET UMG GH

Indian Villages: టూర్ ప్లాన్ చేస్తున్నారా ? నార్త్ లో ఈ ప్రాంతాలకు వెళ్తే.. ఎప్పటికీ మీరు మరచిపోలేరు..!

టూర్ ప్లాన్ చేస్తున్నారా ? నార్త్ లో ఈ  ప్రాంతాలకు వెళ్తే.. ఎప్పటికీ మీరు మర్చిపోరు !

టూర్ ప్లాన్ చేస్తున్నారా ? నార్త్ లో ఈ ప్రాంతాలకు వెళ్తే.. ఎప్పటికీ మీరు మర్చిపోరు !

దేశంలోని అనేక అందమైన గ్రామాలు(Villages) టూరిజానికి ప్రసిద్ధి పొందాయి. గొప్ప సంస్కృతి, సంప్రదాయాలకు నిలయంగా మారాయి. ఆహ్లాదకరమైన వాతావరణంతో టూరిస్టు(Tourist)లను కట్టిపడేస్తున్నాయి. ముఖ్యంగా చిన్న ట్రిప్ ప్లాన్ చేసేవారికి కొన్ని గ్రామాలు బెస్ట్ డెస్టినేషన్‌గా నిలుస్తున్నాయి.

ఇంకా చదవండి ...
టూరిజం(Tourism) రంగానికి ఇటీవల డిమాండ్ బాగా పెరిగింది. ప్రభుత్వాలు కూడా ప్రోత్సాహం అందిస్తున్నాయి. టూరిస్ట్ స్పాట్లను డెవలప్ చేయడం, మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తున్నాయి. కరోనా(Corona) కారణంగా గత రెండేళ్లలో టూరిజం దెబ్బతిన్నప్పటికీ, ఇటీవల మళ్లీ పుంజుకుంటోంది. దేశంలోని అనేక అందమైన గ్రామాలు టూరిజానికి ప్రసిద్ధి పొందాయి. గొప్ప సంస్కృతి, సంప్రదాయాలకు నిలయంగా మారాయి. ఆహ్లాదకరమైన వాతావరణంతో టూరిస్టులను కట్టిపడేస్తున్నాయి. ముఖ్యంగా చిన్న ట్రిప్ ప్లాన్ చేసేవారికి కొన్ని గ్రామాలు బెస్ట్ డెస్టినేషన్‌గా నిలుస్తున్నాయి. అవేంటో చూద్దాం.

మవ్లిన్నోంగ్ (Mawlynnong)- మేఘాలయ
ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా మావ్లిన్నోంగ్ ప్రసిస్ధి పొందింది. అక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా, ప్రకృతి దృష్యాలు మనోహరంగా ఉంటాయి. అక్కడి గ్రామస్తులు పర్యావరణ అనుకూల జీవన విధానాన్ని గడుపుతున్నారు. మీరు ఈ గ్రామాన్ని సందర్శిస్తే, వెయ్యి సంవత్సరాల పురాతనమైన ‘లివింగ్ రూట్స్ వంతెన’ను తప్పక చూడండి.

మలాన, హిమాచల్ ప్రదేశ్
కులు లోయలోని అద్భుతమైన, చారిత్రాత్మక గ్రామం మలాన. ఇక్కడ చాలా తక్కువ మంది నివసిస్తుంటారు. మలాన గ్రామం పరిసరాల్లో పర్వతాలు ఉన్నాయి. దీంతో ట్రెక్కింగ్ చేయాలనుకునేవారికి ఇది బెస్ట్ ప్లేస్. స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన గాలి, ప్రకృతిని ఆస్వాదించాలంటే మలాన‌కు వెళ్లాల్సిందే.

రావంగ్లా, సిక్కిం
ఈ గ్రామం పచ్చని పచ్చిక బైళ్లతో నిండి ఉంటుంది. ప్రకృతిని ఆస్వాదించే వారికి ఇది స్వర్గధామం. ఈ గ్రామంలో వివిధ రకాల వృక్ష, జంతుజాలానికి ఆవాలంగా ఉంది. ఈ గ్రామం సంప్రదాయ పండుగలకు ప్రసిద్ధి. రావంగ్లా ఎల్లప్పుడూ పర్యాటకులతో కళకళలాడుతుంటుంది.

నాకో, లాహౌల్ స్పితి
ఇది హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది. దేశంలో అంత్యంత సుందరమైన గ్రామాల్లో ఇది ఒకటి. స్ఫటికాలతో కూడిన స్వచ్ఛమైన సరస్సులు, మంచు పర్వతాలు, పచ్చని లోయలు పర్యాటకులను కనువిందు చేస్తాయి. చలికాలంలో ఈ గ్రామం పూర్తిగా మంచుతో కప్పి ఉంటుంది. స్కీయింగ్‌కు చేయడానికి ఇది అనువైన ప్రదేశం. వేసవిలో బోటింగ్‌‌ను ఆస్వాధించవచ్చు. ఇక్కడి మఠాలను కూడా సందర్శించి ఆధ్యాత్మిక భావనను పెంపొందించుకోవచ్చు.

ఇదీ చదవండి: GK Capsule: పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారా ? అయితే ఇదిగో మీకోసం స్పెషల్ జీకే క్యాప్సూల్..!


లాచెన్, సిక్కిం
ఇది సముద్ర మట్టానికి సుమారు 3,000 మీటర్ల ఎత్తులో ఉంది. ప్రకృతి సోయగానికి నిలయంగా ఉంది. మంచు పర్వత శిఖరాలపై గొప్ప వృక్షజాలం చూపరులను ఆకట్టుకుంటాయి. టూరిస్ట్‌లు ఇక్కడి చారిత్రక మఠాలను సందర్శించవచ్చు.జంజెలి, హిమాచల్ ప్రదేశ్
ఈ గ్రామం దేశంలోని అత్యంత సుందరమైన గ్రామాల్లో ఒకటిగా పేరుపొందింది. మండి జిల్లాలో ఉన్న ఈ గ్రామం పట్టణ జీవనానికి దూరంగా, ప్రశాంతతను కోరుకునే వారికి గొప్ప గమ్యస్థానంగా నిలుస్తుంది. రోడ్ల పక్కన ఉండే కేఫ్‌ల్లో సూర్యుడి వెలుగులో సేదతీరడం ఎంతో హాయిగా అనిపిస్తుంది. శిఖరి మాత దేవాలయం వంటి ఆలయాలను సందర్శించవచ్చు. హైకింగ్, ట్రెక్కింగ్(Trekking), నైట్ సఫారీ వంటి ఆటలకు ఇది ప్రసిద్ధి పొందింది.
Published by:Mahesh
First published:

Tags: Himachal Pradesh, Meghalaya, Sikkim, Tourism

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు