శృంగారం చేసే ముందు పిజ్జా తిన్నారో ఇక కథ కంచికే...

తక్షణ శక్తి కొరకు కొందరు అడ్డదిడ్డంగా పిజ్జాలు, బర్గర్లు కానిచ్చేస్తుంటారు. అయితే శృంగారం చేసే ముందు పిజ్జా లాంటి హెవీ డైట్ తీసుకుంటే రాత్రంతా కునుకు పాట్లు తప్పవని హెచ్చరిస్తున్నారు.

news18-telugu
Updated: September 3, 2019, 11:11 PM IST
శృంగారం చేసే ముందు పిజ్జా తిన్నారో ఇక కథ కంచికే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చాలా మంది శృంగారం చేసే ముందు ఏదో ఒకటి గబుక్కున తినేసి పడక గదిలో ప్రతాపం చూపించేందుకు సిద్ధమైపోతుంటారు. అయితే నిపణులు మాత్రం తినే ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బాగా కొవ్వు ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మంచిదని డైటీషియన్లు సూచిస్తున్నారు. తక్షణ శక్తి కొరకు కొందరు అడ్డదిడ్డంగా పిజ్జాలు, బర్గర్లు కానిచ్చేస్తుంటారు. అయితే శృంగారం చేసే ముందు పిజ్జా లాంటి హెవీ డైట్ తీసుకుంటే రాత్రంతా కునుకు పాట్లు తప్పవని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిజ్జాలో వాడే పిండి రిఫైన్డ్ క్వాలిటీ కావడంతో అందులోని ఫైబర్ శాతం పూర్తిగా తగ్గిపోతుంది. ఫలితంగా జీర్ణ శక్తిపై ప్రభావం చూపుతుంది. అలాగే ఇందులోని సాస్, అలాగే చీజ్, చికెన్ లేదా మటన్ కారణంగా కొవ్వు పదార్థాలతో హృదయానికి రక్త ప్రసరణ జరిగే నాళాలకు అంత మంచిది కాదని సూచిస్తున్నారు.

అంతే కాదు పిజ్జా తింటే దాని అరిగించుకునేందుకు రక్త ప్రసారం అంతా జీర్ణ ప్రక్రియలో భాగమవుతుంది. ఇక శృంగారానికి కావాల్సిన ఉత్తేజం కొరవడుతుంది. ఫలితంగా హార్మోన్లు విడుదలవక కునుకు పాట్లు పడాల్సిన అగత్యం ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
First published: September 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading