Health Tips : పచ్చళ్లు రోజూ తింటే మంచిదేనా..

నోరూరిస్తున్న ఊరగాయ

ఎండాకాలం వచ్చిందంటే చాలు.. చాలామంది పచ్చళ్లు పెడుతుంటారు. వీటిని సంవత్సరం మొత్తం ఎంతో ఇష్టంగా తింటారు. అయితే, ఇది ఎంతవరకు మంచిదంటే..

  • Share this:
అమ్మ.. ఆవకాయ ఎవరూ మరిచిపోలేరు అని చెబుతాడు ఓ సినిమాలో హీరో. అవును.. ఆవకాయ, ఊరగాయ, పచ్చళ్లు ఇలా ఏవైనా సరే లేనిదే ముద్ద తిగదు. కూర ఏదైనా సైడ్ డిష్‌గా ఉండాల్సిందే. సీజన్స్‌లో దొరికే కాయలను తరిగి పచ్చళ్లు పెట్టి వాటిని అన్‌సీజన్‌లోనూ ఆనందంగా తింటుంటారు. ముఖ్యంగా తెలుగువారు వీటిని ఎంతో ఇష్టపడతారు. కొంతమంది కూరగాయలను తినడానికి ఇష్టపడరు. ఇలాంటివారు వాటితో పచ్ఛళ్లని చేసుకుని తింటే అన్ని పోషకాలు తీసుకున్నట్లుగా ఉంటుంది.

అయితే... మంచిది కదా అని ఎక్కువగా పచ్చళ్లు తీసుకోకూడదు.. మితంగా తింటేనే సరి లేదా ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి.


పచ్చళ్లలో ఉప్పు, నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల జీర్ణం అవడానికి సమయం పట్టడమే కాకుండా, బీపీ, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వీటిలో వాడేవన్ని ఆరోగ్యపరంగా మంచివే అయినా సరే.. వాటిని నిల్వ చేసి తింటున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎక్కుగా తీసుకోకూడదు. రోజుకి ఒక టీ స్పూన్ పచ్చడి మాత్రమే తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే నిల్వ పచ్చడితో పోలిస్తే రోటి పచ్చళ్లు కొంతవరకు మేలే. వీటిని తినొచ్చు. అలా అని పచ్చళ్లు మొత్తానికే మానేయాల్సిన అవసరం లేదు.. ముందుగా చెప్పినట్లు మితంగా తింటే చాలని చెబుతున్నారు నిపుణులు.

ఈ వీడియో కూడా చూడండి..

First published: