Home /News /life-style /

PHOTOGRAPHY TIPS DONT DO THESE THREE MISTAKES WHILE CLICKING GOOD PHOTOS ON YOUR SMARTPHONE GH SK

Smartphone Photography: స్మార్ట్‌ఫోన్‌తో ఫొటోలను క్లిక్ చేస్తున్నారా? ఈ మూడు తప్పులు చేయకండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Smart Phone Photography: ప్రతి ఒక్కరూ ఫోన్ కొనేముందు కాల్ క్వాలిటీ కంటే ముందుగా కెమెరా క్వాలిటీ (Camera Quality)నే చెక్ చేస్తున్నారు. అయితే బెస్ట్ కెమెరాతో వచ్చే ఫ్లాగ్‌షిప్ మొబైల్ కొన్నా కూడా కొన్ని టిప్స్ పాటిస్తేనే ఫొటోలు అద్భుతంగా వస్తాయి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
Smartphone Photography:  స్మార్ట్‌ఫోన్స్ (Smartphones) అందుబాటులోకి వచ్చాక సాధారణ కెమెరాలు మూలనపడ్డాయి. కొత్త ప్రదేశాలకు వెళ్లినా, హాలిడే డెస్టినేషన్ ప్లాన్ చేసినా స్మార్ట్‌ఫోన్ల కెమెరాల (Smartphones Cameras) ద్వారానే చాలా మంది ఫొటోలు తీసుకుంటున్నారు. ఈరోజుల్లో అన్ని స్వీట్ మెమరీస్‌ను బంధించే ఒక టూల్‌గా స్మార్ట్‌ఫోన్‌ మారిపోయింది. అందుకే ప్రతి ఒక్కరూ ఫోన్ కొనేముందు కాల్ క్వాలిటీ కంటే ముందుగా కెమెరా క్వాలిటీ (Camera Quality)నే చెక్ చేస్తున్నారు. అయితే బెస్ట్ కెమెరాతో వచ్చే ఫ్లాగ్‌షిప్ మొబైల్ కొన్నా కూడా కొన్ని టిప్స్ పాటిస్తేనే ఫొటోలు అద్భుతంగా వస్తాయి. అలానే, ఫొటోలు తీసేటప్పుడు 3 తప్పులను చేయకూడదు. ఈ మూడు తప్పులను చేయకుండా కొన్ని టిప్స్ ఫాలో అయితే ఫొటోలు ఫుల్ క్లారిటీతో వస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

* ఎక్స్‌పోజర్‌ను సరిగ్గా సెట్ చేయాలి
ఫొటో తీసేటప్పుడు ఎక్స్‌పోజర్‌ సరిగ్గా ఉండేలా జాగ్రత్తపడాలి. ఓవర్ లేదా అండర్ ఎక్స్‌పోజర్ కాకుండా ఫొటో తీయడం నేర్చుకోవాలి. కెమెరా అనేది ఓవర్ ఎక్స్‌పోజర్‌కి గురైతే ఫొటోలో హైలైట్ కావాల్సిన డీటెయిల్స్ మిస్ అవుతాయి. అండర్ ఎక్స్‌పోజర్ కారణంగా డార్క్‌గా ఉన్న ప్లేసెస్ చాలా నల్లగా కనిపిస్తాయి. దీనివల్ల ఫొటో అనేది సరిగ్గా రాదు. అందుకే ఫొటో తీసేటప్పుడు అన్ని డీటెయిల్స్ క్లారిటీగా వచ్చేలా ISO, షట్టర్ స్పీడ్ లేదా వైట్ బ్యాలెన్స్‌ని మ్యాన్యువల్‌గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఎక్స్‌పోజర్ స్లయిడర్‌ ఉపయోగిస్తూ ఫొటో ఎలా వస్తుందో కూడా చెక్ చేయాలి. కోరుకున్న హైలైట్‌లు, నీడలు ఫొటోలో కనిపించే వరకు ఎక్స్‌పోజర్ స్లయిడర్‌ను అడ్జస్ట్ చేసుకోవాలి. మీ ఫొటో ఎక్కడ బాగా ఎక్స్‌పోజ్‌ కావాలో ఆ భాగంలో ఫోకస్ చేయాలి. కాంతి
చాలా ఎక్కువగా ఉంటే మీ సబ్జెక్ట్‌కి బ్యాక్‌లైట్ లేకుండా జాగ్రత్త తీసుకోవాలి.

* ఎల్లప్పుడూ అల్ట్రావైడ్ లెన్స్‌ని ఉపయోగించకూడదు
అల్ట్రావైడ్ లెన్స్‌లతో షూట్ చేయడం సరదాగా అనిపిస్తుంది కానీ ఫొటో క్లారిటీ అనేది తగ్గుతుంది. కంపెనీలు తమ ఫోన్లలోని అల్ట్రావైడ్ లెన్స్‌లకు ఎక్కువ సామర్థ్యాన్ని అందించవు. అందుకే అల్ట్రావైడ్‌ మోడ్‌లో తీసే ఫొటో క్లారిటీ బాగా తగ్గుతుంది. ఫొటోలు షార్ప్ గా కాకుండా సాఫ్ట్ గా వస్తాయి. ఫొటోలు చాలా అస్పష్టంగా కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా ఇమేజ్ అనేది వంకరగా మారుతుంది. అందుకే, తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప అల్ట్రావైడ్‌ లెన్స్‌ను ఉపయోగించకపోవడం మంచిది.



* అవసరమైన భాగాన్ని మాత్రమే ఎడిట్ చేయాలి
ఎడిటింగ్ మీ ఫొటోలను గొప్పగా మార్చగలవు. ఫొటోని ఎడిటింగ్ చేసి దానిని చాలా క్వాలిటీగా మార్చవచ్చు. ఎడిటింగ్ అనేది పోర్ట్రెయిట్‌లోని ఒకరి కంటి రంగు కావచ్చు లేదా గోల్డెన్ అవర్ సమయంలో ఆకాశం రంగు కావచ్చు. HSL (Hue, Saturation, Luminance) అనేది బాగా ఉపయోగపడే ఫీచర్. ఈ ఫీచర్‌తో కావాల్సిన రంగును ఫొటోలో తీసుకురావచ్చు. మీ ఎడిటింగ్ ప్రోగ్రామ్‌లోని స్లయిడర్‌లు చాలా సమర్థవంతంగా ఫొటో లుక్‌ను మార్చగలవు కాబట్టి వాటిని తెలివిగా ఉపయోగించాలి. అలానే ఫొటోలు తీసేటప్పుడు కెమెరా లెన్స్‌ను ఒక శుభ్రమైన గుడ్డతో తుడవాలి. కావాల్సిన వస్తువు పై ఫోకస్ పెట్టిన తర్వాత కాసేపు కెమెరా ని అలాగే ఉంచి ఆ తర్వాత ఈ ఫొటో క్లిక్ చేయాలి. గ్రిడ్ ఫీచర్ ఉపయోగించే ఈ ఫొటో అనేది చక్కగా వచ్చేలా ప్లాన్ చేయవచ్చు.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Life Style, Lifestyle, Photography

తదుపరి వార్తలు