‘మిస్టరీ ప్రేమ జంట’ కోసం ఫోటోగ్రాఫర్ అన్వేషణ

తాను ఎంతో అద్భుతంగా తీసిన ఫోటోను ఆ జంటకు కానుకగా ఇవ్వాలన్నదే తన ఆకాంక్షగా చెబుతున్నాడు ఆ ఫోటోగ్రాఫర్.

news18-telugu
Updated: October 19, 2018, 3:42 PM IST
‘మిస్టరీ ప్రేమ జంట’ కోసం ఫోటోగ్రాఫర్ అన్వేషణ
అమెరికా ఫోటోగ్రాఫర్ కెమెరాకు చిక్కిన జంట(Photo:Matthew Dippel/Twitter)
  • Share this:
అమెరికాకు చెందిన ఓ ఫోటోగ్రాఫర్ తన కెమెరా కళ్లకు చిక్కిన ‘మిస్టరీ జంట’ కోసం వెతుకుతున్నాడు. మిచిగాన్ రాష్ట్రంలోని ఓ నేషనల్ పార్క్‌లో ఫోటోగ్రాఫర్ మాథ్యూ డిప్పెల్ ఈ నెల 6 తేదీన ఫోటోలు తీస్తున్నాడు. అదే సమయంలో సమీపంలోని ఓ పర్వతంపై ప్రియుడు తన ప్రియురాలికి ప్రత్యేక భంగిమలో పెళ్లి ప్రపోజ్ చేస్తున్న దృశ్యం అతనికి కనిపించింది. ఈ అద్భుత దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు. కొన్ని క్షణాల్లోనే ఆ ప్రేమ జంట అక్కడి నుంచి మాయమయ్యింది.

ఈ ప్రేమ జంటను కలుసుకోవాలన్న ఆసక్తితో మాథ్యూ డిప్పెల్ స్థానికుల వద్ద ఆరా తీశాడు. అయితే ఫలితం లేకపోయింది. కెమెరా కళ్లకు చిక్కిన ఆ జంటను స్థానికులు ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. ‘ఫోటో తీసిన కొన్ని క్షణాలకే వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు..అక్కడ  జరిగినదాన్ని నేను నమ్మలేకపోతున్నా’నని మాథ్యూ డిప్పెల్ తెలిపాడు.

అమెరికా ఫోటోగ్రాఫర్ కెమరాకు చిక్కిన జంట(Photo:Matthew Dippel/Twitter)
అమెరికా ఫోటోగ్రాఫర్ కెమరాకు చిక్కిన జంట(Photo:Matthew Dippel/Twitter)


అమెరికా ఫోటోగ్రాఫర్ కెమెరాకు చిక్కిన జంట(Photo:Matthew Dippel/Twitter)
అమెరికా ఫోటోగ్రాఫర్ కెమెరాకు చిక్కిన జంట(Photo:Matthew Dippel/Twitter)


ప్రేమ జంటను కలుసుకునేందుకు గత రెండు వారాలుగా చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కూడా అన్వేషణ మొదలుపెట్టాడు. వారి ఫోటోను ట్వీట్ చేసి, ఈ ప్రేమ జంట ఎవరో గుర్తించగలిగితే తనకు సమాచారం ఇవ్వాలని కోరాడు. అటు ట్విట్టర్‌లో అతని పోస్ట్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఆ పోస్టును రీ ట్వీట్ చేస్తూ...ఆ జంటను ఫోటోగ్రాఫర్ కలుసుకునేందుకు నెటిజన్లు తమ వంతు సాయం చేస్తున్నారు. మిస్టరీ జంట కోసం జరుగుతున్న అన్వేషణలో మేము సైతం అంటూ స్పందిస్తున్నారు.వేలాది మంది లైక్స్, రీట్వీట్లు చేసినా ఆ ప్రేమ జంటను మాత్రం తాను ఇప్పటి వరకు గుర్తించలేకపోయినట్లు చెబుతున్నాడు మాథ్యూ డిప్పెల్. అయితే తన ప్రయాస వృథా కాదని, ఏదైనా ఒక రోజు తాను కెమెరాలో బంధించిన జంటను కలుసుకుంటానని ఆ ఫోటోగ్రాఫర్ ధీమా వ్యక్తంచేస్తున్నాడు. తాను ఎంతో అద్భుతంగా తీసిన ఫోటోను ఆ ప్రేమ జంటకు కానుకగా ఇవ్వాలన్నదే తన ఆకాంక్షగా చెబుతున్నాడు. ఆ జంట కోసం అన్వేషిస్తున్న మాథ్యూ డిప్పెల్‌‌కు మీరు కూడా సాయపడగలరేమో చూడండి..
Published by: Janardhan V
First published: October 19, 2018, 3:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading