PEOPLE WITH MENTALLY STIMULATING JOBS ARE LESS LIKELY TO SUFFER FROM COGNITIVE DECLINE AND DEVELOP DEMENTIA AS THEY GROW OLD GH SK
Dementia: మీది మెదడుకు పనిచెప్పే ఉద్యోగమా? మానిసిక వ్యాధులు వస్తాయట.. కొత్త అధ్యయనంలో సంచలన నిజాలు
ప్రతీకాత్మక చిత్రం
Mental Illness: మెదడుకు పని పెట్టే, మానసికంగా ఛాలెంజింగ్‌గా అనిపించే ఉద్యోగాలు చేసేవారిలో మలి వయసులో మేధోశక్తి, జ్ఞాపకశక్తి తగ్గే అవకాశాలు చాలా తక్కువ అని తాజాగా ఒక అధ్యయనంలో తేలింది. ఈ తరహా ఉద్యోగాలు చేసేవారిలో డిమెన్షియా (Dementia) వంటి మానసిక రోగాల ముప్పు కూడా తగ్గుతుందని అధ్?
Dementia: రోజువారీ విషయాలను గుర్తు పెట్టుకోవడం, తెలివిగా ఆలోచించడం, లాజికల్‌గా థింక్ చేసే శక్తి వయసు పెరుగుతున్న కొద్దీ తగ్గుతూ ఉంటుంది. అలాగే పేలవమైన జీవనశైలి వల్ల కూడా కాగ్నిటివ్ (Cognitive) స్కిల్స్ క్షీణిస్తాయి. అయితే మెదడుకు పని పెట్టే, మానసికంగా ఛాలెంజింగ్‌గా అనిపించే ఉద్యోగాలు చేసేవారిలో మలి వయసులో మేధోశక్తి, జ్ఞాపకశక్తి తగ్గే అవకాశాలు చాలా తక్కువ అని తాజాగా ఒక అధ్యయనంలో తేలింది. ఈ తరహా ఉద్యోగాలు చేసేవారిలో డిమెన్షియా (Dementia) వంటి మానసిక రోగాల ముప్పు కూడా తగ్గుతుందని అధ్యయనం తేల్చింది. ఈ రోజుల్లో డిమెన్షియా, అల్జీమర్స్ అనే వ్యాధులతో చాలా మంది ప్రజలను బాధపడుతున్నారు. డిమెన్షియా రోగులు ఏమీ గుర్తులేక రోజువారీ పనులను కూడా చేసుకోలేకపోతున్నారు. కొందరు తమ సొంత కుటుంబ సభ్యులను కూడా గుర్తించలేకపోతున్నారు. అయితే ఇలాంటి తీవ్ర సమస్యకు మెంటల్లీ ఛాలెంజింగ్ జాబ్స్ (Mentally Challenging Jobs) చెక్ పెడతాయని ఒక స్టడీలో తేలింది. ఈ అధ్యయన ఫలితాలను చాలా అధ్యయనాలను కలిపి విశ్లేషించారు.
తీవ్ర మతిమరుపునే చిత్తవైకల్యం లేదా డిమెన్షియా అని పిలుస్తారు. ఈ సమస్య తలెత్తడానికి అనేక కారణాలు ఉంటాయి. హార్వర్డ్ హెల్త్ (Harvard Health) ఈ మానసిక రుగ్మతలపై పరిశోధనలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మెదడు పనితనం అవసరమయ్యే ఉద్యోగాలు చేస్తున్న వారికి డిమెన్షియా వచ్చే అవకాశం తక్కువ ఓ హార్వర్డ్ హెల్త్ అధ్యయనం ద్వారా వెల్లడైంది. దీన్ని బ్రిటిష్ మెడికల్ జర్నల్ (BMJ)లో ఆగస్ట్ 21, 2021న ప్రచురించారు. ఈ విశ్లేషణ ప్రకారం, మెదడును ఉపయోగించే ఉద్యోగులకు తమ భవిష్యత్తులో డిమెన్షియా ముప్పు బాగా తగ్గుతుంది. ఇలాంటి ఉద్యోగాల్లో చేరడం ద్వారా కూడా ఈ ముప్పు తగ్గించుకోవచ్చని విశ్లేషణ తెలిపింది.
దీర్ఘకాలిక వ్యాధి, వైకల్యం, మరణానికి.. ఉద్యోగాలు, పనికి ఎలాంటి సంబంధం ఉంటుందనేది తెలుసుకునేందుకు పలు అధ్యయనాల నుంచి పరిశోధకులు డేటాను సేకరించారు. ఆ డేటాను ఎలా కలిపారనే దాని గురించి BMJ నివేదిక వివరంగా తెలుపుతుంది. ఈ అధ్యయనాలన్నీ యునైటెడ్ స్టేట్స్, యూరప్స్లో ఉద్యోగాల చేసే వ్యక్తుల నుంచి సమాచారాన్ని సేకరించాయి. ఈ సమాచారం ద్వారా మెంటల్ వర్క్ డిమాండ్ చేయని ఉద్యోగాలు చేసే వారితో పోలిస్తే, మెంటల్ వర్క్ డిమాండ్ చేసే వారిలో డిమెన్షియా వచ్చే ప్రమాదం 23 శాతం తక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు.
ఆలోచన శక్తిని బాగా ఉపయోగించే ఉద్యోగాలు చేసేవారిలో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. వీరు మానసిక సవాళ్లతో కూడిన పనులు కూడా చేస్తారు. ఫలితంగా వారి మెదడు ఎప్పుడూ చురుగ్గానే ఉంటుంది. ఈ అధ్యయనంలో సగటున 45 ఏళ్ల వయస్సు గల 107,800 మంది పాల్గొన్నారు. యూఎస్, యూరప్ నుంచి డిమెన్షియా లేని వ్యక్తులు ఇందులో పాల్గొన్నారు. ఈ అధ్యయనాలు 1986 నుంచి 2006 వరకు కొనసాగాయి. అయితే డిమెన్షియాని గుర్తించే ఫాలో-అప్ 2017 వరకు కొనసాగింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.