Home /News /life-style /

Acidity Problem: ఈ చిన్నపాటి చిట్కాలు పాటించండి.. ఎసిడిటీ సమస్యకు చెక్ పెట్టండి..

Acidity Problem: ఈ చిన్నపాటి చిట్కాలు పాటించండి.. ఎసిడిటీ సమస్యకు చెక్ పెట్టండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అతిగా తినడం, సరైన సమయంలో నిద్రపోకపోవడం వంటి అనారోగ్యమైన అలవాట్ల కారణంగా పుల్లటి తేనుపులు, ఎసిడిటీ (acidity) వంటి ఉదర సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఎసిడిటీ అనేది ఎక్కువగా పేలవమైన జీవనశైలి వల్లే వస్తుందని వైద్యులు చెబుతుంటారు.

  అతిగా తినడం, సరైన సమయంలో నిద్రపోకపోవడం వంటి అనారోగ్యమైన అలవాట్ల కారణంగా పుల్లటి తేనుపులు, ఎసిడిటీ (Acidity) వంటి ఉదర సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఎసిడిటీ అనేది ఎక్కువగా పేలవమైన జీవనశైలి వల్లే వస్తుందని వైద్యులు చెబుతుంటారు. ఆలస్యంగా నిద్రపోతున్నా.. అతిగా తింటున్నా మీరు కచ్చితంగా యాంటాసిడ్‌లకు బానిసలు అవుతారని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేద, పోషకాహార నిపుణుల ప్రకారం, జీవనశైలి మార్పులతో పాటు కొన్ని రకాల ఫుడ్స్ ప్రతిరోజు తినడం ద్వారా ఎసిడిటీ సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఆ ఆహార పదార్థాలు ఏవో, జీవనశైలి మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  Walking: ఆమె స్నేహితులతో సరదాగా వాకింగ్ కు వెళ్లింది.. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేకపోయింది..


  ఎసిడిటీ అంటే ఏమిటి?
  గ్యాస్ట్రిక్ గ్రంథులలో ఆమ్లాలు అధికంగా ఉత్పత్తి అయినప్పుడు కడుపులో ఎసిడిటీ ఏర్పడుతుంది. స్పైసీ ఫుడ్స్ (spicy foods), సుదీర్ఘమైన గ్యాప్ తో భోజనాలు చేయడం వల్ల గ్యాస్ట్రిక్ గ్రంథుల్లో అధిక స్థాయిలో యాసిడ్స్ విడుదల అవుతాయి. అందువల్ల స్పైసీ ఫుడ్స్ కి దూరంగా ఉండటం ఉత్తమం.

  ఎసిడిటీని పోగొట్టే మూడు ఆహారాలు

  1. అరటి: ప్రతిరోజు ఉదయాన్నే అరటిపండు తినండి. మీరు ఎదుర్కొంటున్న ఎసిడిటీ సమస్యలను సగం వరకు తగ్గించగల శక్తి అరటిపండుకు ఉంటుంది.

  2. తులసి విత్తనాలు: ఒక గ్లాసు నీటిలో 1-2 టీస్పూన్ల సబ్జా గింజలు నానబెట్టి ఆ నీటిని తాగాలి. తులసి విత్తనాలు శరీరాన్ని చల్లబరుస్తాయి. అందుకే పీరియడ్స్ సమయంలో లేదా జలుబు/దగ్గు సమస్యలు ఉన్నప్పుడు తులసి విత్తనాలను తీసుకోకండి.

  3. కొబ్బరి నీరు: అద్భుత పోషక విలువలున్న కొబ్బరి నీరు ఉదయం 11 గంటలకు తాగండి. కొబ్బరి నీరు ఎసిడిటీ సమస్యను చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.

  Shocking: రాత్రి సమయంలో బాత్రూంకి వెళ్లిన యువతి.. కేకలు వినిపించడంతో బయటకు వచ్చి చూసిన తండ్రి.. తర్వాత ఏమైందంటే..


  ఎసిడిటీని నివారణకు జీవనశైలి మార్పులు

  1. చిన్న మోతాదులలో తరచుగా ఆహారం తినండి.

  2. అధిక ప్రోటీన్‌ను తీసుకోవటం మానుకోండి.

  3. ఒక వారంలో మాంసాహార భోజనం 2-3 సార్ల కంటే ఎక్కువగా చేయకండి.

  4. మీ భోజనంలో ధాన్యాలు (grains) ఉండేలా చూసుకోండి.

  5. భోజనం చేసిన తర్వాత 100 అడుగులు వరకు నడవండి. ఇలా చేయడం వల్ల మీ జీర్ణాశయంలోని అవయవాలు కదులుతాయి. తద్వారా ఆహారం త్వరగా జీర్ణం అవ్వడంతో పాటు ఆమ్లం పైకి ఎగదన్నుకొని గొంతులోకి రాదు.

  School Student: అతడు పాఠశాలలో స్వీపర్.. టాయిలెట్ క్లీన్ చేస్తుండగా వెళ్లిన ఓ విద్యార్థినిపై అతడు..


  6. వజ్రాసనం (Vajrasana)లో కాసేపు కూర్చోండి.

  7. పాజిటివ్ గా ఉంటూ ఆనందకరమైన ఆలోచనలు చెయ్యండి.

  ఎసిడిటీ ప్రాణాంతకమైన సమస్య కాదు కానీ ఈ సమస్య వల్ల ఎప్పుడూ ఛాతిలో మంట పుడుతూనే ఉంటుంది. దీనివల్ల ప్రత్యక్ష నరకం అనుభవించాల్సి వస్తుంది. ఈ సమస్య ను తొలగించుకోవడానికి మాత్రల కంటే సరైన ఆహారం తీసుకోవడమే మంచిది.
  Published by:Veera Babu
  First published:

  Tags: Health, Health benefits, Lifestyle

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు