Vegans: మీ ఎముకలు ఫట్ మని విరుగుతాయి.. వేగన్స్ లో క్యాల్షియం ఉంటే కదా..

వేగానిజం చాలా మంచిదే కానీ దీర్ఘకాలంలో దీనికి విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. ఇలా కేవలం ప్లాంట్ బేస్డ్ ఆహారాన్ని తింటూపోతే వీరిలో ఎముకలు అత్యంత బలహీనమవుతాయి.

news18
Updated: November 24, 2020, 3:15 PM IST
Vegans: మీ ఎముకలు ఫట్ మని విరుగుతాయి.. వేగన్స్ లో క్యాల్షియం ఉంటే కదా..
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: November 24, 2020, 3:15 PM IST
  • Share this:
వేగన్ (vegan) డైట్ ఈమధ్య కాలంలో అందరూ చాలా క్రేజీగా ఫాలో అవుతున్న డైట్ (diet)తో ప్రమాదాలున్నాయి. వేగన్ అంటే కేవలం 'ప్లాంట్ బేస్డ్ ఫుడ్' మాత్రమే తీసుకునే వారిలో ఎముకలు (bones) విరిగే ప్రమాదం 43 శాతం కంటే ఎక్కువగా ఉంటుందని ఆక్స్ ఫర్డ్ (Oxford) స్టడీ తేల్చింది. ఉదాహరణకు పాలు తీసుకోండి, వేగన్లు పశువుల నుంచి పిండిన పాలకు బదులు సోయా వంటి చెట్ల నుంచి తీసిన పాలనే ఉపయోగిస్తారన్నమాట. వేగానిజం చాలా మంచిదే కానీ దీర్ఘకాలంలో దీనికి విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది.

ఇలా కేవలం ప్లాంట్ బేస్డ్ ఆహారాన్ని తింటూపోతే వీరిలో ఎముకలు అత్యంత బలహీనమవుతాయి. అంటే వీరి ఎముకలకు కాస్త దెబ్బ తగిలితే చాలు ఎముకలు ఫట్ మని విరిగిపోయి, ఫ్రాక్చర్లు అయిపోతాయి. అదే మాంసం తినేవారిలో ఇలా జరిగే ప్రమాదం కాస్త తక్కువ. Oxford University BMC Medicine అనే జర్నల్ బ్రిటన్ లో వేగనిజం ఫాలో అయ్యేవారిపై జరిగిన విస్తృతమైన అధ్యయనంలో ఈ విషయాలు తేటతెల్లమైనట్టు పేర్కొంది.

కాల్షియం ఎలా వస్తుంది?

రోజురోజుకూ వేగనిజంకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరగటం ఓరకంగా మంచిదే కానీ అసలు అనుమానమంతా వీరికి కాల్షియం ఎక్కడి నుంచి వస్తుంది అనేదే. కాల్షియం, ఐరన్, B12 విటమిన్.. వీరికి సహజసిద్ధంగా అందే అవకాశాలు లేవు. 50,000 మందికిపై వ్యక్తులపై ఆక్స్ ఫర్డ్ పరిశోధన సాగగా మాంసం తినేవారితో శాకాహారులను, మాంసం కాకుండా చేపలు మాత్రమే తినే వారిపై కూలంకషంగా అధ్యయనం సాగింది. పరిశోధనలో పాల్గొన్న బృందంలో ఒకరైన డాక్టర్ టామీ టాంగ్ చెప్పేదాన్నిబట్టి మాంసం తినేవారిలో ఫ్రాక్చర్లు చాలా తక్కువగా జరుగుతాయి. 2016లో బ్రిటన్ లో వేగన్స్ జనాభా 6,00,000 మంది ఉండగా 2019 కల్లా వీరి జనాభా రెట్టింపు అయింది. వేగన్ సొసైటీ కూడా 2016-2019 మధ్య బ్రిటీషర్లు అత్యధికులు వేగన్స్ గా మారారని The Independent చెబుతోంది.

వేగన్ ఫుడ్ కు డిమాండ్

ఇక శరవేగంగా పెరుగుతున్న వేగన్ ఫుడ్ మార్కెట్ లో లాభాలు ఆర్జించేందుకు కంపెనీలు కూడా బాగా కష్టపడుతున్నాయి. రెడ్ మీట్ కు ప్రత్యామ్నాయంగా ఉండేలా ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ను రూపొందిస్తున్నాయి. వేగన్ సాసేజెస్, రోల్స్, బర్గర్స్ వంటి వాటిలో beetroot జ్యూస్ చేర్చి అవి బ్లీడ్ అవుతున్నట్టు గ్యార్నిష్ చేస్తున్నారు కూడా.

తుంటి ఎముకలకు ప్రమాదం.. వేగన్ ఫుడ్ తినేవారిలో తుంటి ఎముకలు, పక్కటెముకలకు ముప్పు ఎక్కువగా ఉండగా BMI కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తుందని డాక్టర్ టాంగ్ వివరిస్తున్నారు. వేగన్స్ తీసుకునే ఆహారంలో కాల్షియం. ప్రొటీన్ లేకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు వాటిల్లుతున్నాయని, ఎముకలు బలంగా, దృఢంగా ఉండేలా వీరు శ్రద్ధ తీసుకోవడం లేదని టాంగ్ హెచ్చరిస్తున్నారు. దీనికి విరుగుడు ఒక్కటే అదే బ్యాలెన్స్డ్ డైట్ (సమతుల ఆహారం), అది కూడా ప్లాంట్ బేస్డ్ డైట్ లో ఉండేలా చర్యలు తీసుకుంటే వేగన్స్ కు మంచిది. డయాబెటీస్, గుండె జబ్బులు వంటివి రాకుండా వేగన్లు తమను తాము రక్షించుకునేందుకు పోషకాలున్న బలమైన ఆహారాన్ని తీసుకోక తప్పదని ఈ తాజా పరిశోధన ఘాటుగా హెచ్చరిస్తోంది. ఆరోగ్య కరమైన BMI ఉండేలా శ్రద్ద తీసుకోవాలి. అంటే మరీ తక్కువ బరువు (underweight) లేదా అతి ఎక్కువ బరువు (overweight) ఉంటే వీటి పర్యవసానాలు కూడా విపరీతంగా ఉంటాయి.

Vegans, celebrities, overweight, underweight, BMI, diet, Oxford, veganism, bollywood celebrities diet, calcium, bones, britan, chicken, diet,iron
రకుల్ ప్రీత్ Photo : Instagram


సెలబ్రిటీలను కాపీ చేయకండి

హాలీవుడ్ సెలబ్రిటీలను చూసి పాశ్చాత్య దేశాల్లో వేగన్ సంప్రదాయాన్ని అనుసరించే వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. హాలీవుడ్ సెలబ్రిటీల ప్రభావం మన బాలీవుడ్ పై కూడా బాగానే పడింది. దీంతో రకుల్ ప్రీత్ సింగ్, మలైకా అరోరా, షాహిద్ కపూర్, సోనం కపూర్, సోనాక్షి సిన్హా, అనుష్కా శర్మ, జాన్ అబ్రహం, అలియా భట్ వంటివారు వేగన్లుగా మారిపోగా వీరి బాటలో నడుస్తున్న సామాన్యులు కూడా వేగన్లుగా మారిపోతున్నారు. ఇది మంచి విషయమే అయినప్పటికీ అసలు వేగన్ కల్చరపై సంపూర్ణ అవగాహన లేకపోవడంతో పోషకాహార లేమికి గురయ్యే ప్రమాదం ఉంటుంది.
Published by: Srinivas Munigala
First published: November 24, 2020, 3:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading