ప్రస్తుత బిజీ జీవన శైలిలో చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో గ్యాస్ట్రిక్ సమస్య ఒకటి. తక్కువ జీర్ణమయ్యే ఆహారాన్ని తినడం ద్వారా వచ్చే ఈ బాధాకరమైన సమస్య క్రమంగా కడుపు నొప్పి, ఉబ్బరం, ఉదర భారము, గుండెల్లో మంటకు దారి తీస్తుంది. గ్రాస్ట్రిక్ సమస్యకు కార్భోహైడ్రేట్లు అధికంగా ఉండే, తక్కువగా జీర్ణమయ్యే బీన్స్, క్యాబేజీ, చిక్కుళ్ళు లేదా చక్కెర పానీయాలు వంటి వాటిని తీసుకోవడం ప్రధాన కారణం చెప్పవచ్చు. ఈ ఆహారాలు పేగులో ఎక్కువ వాయువును సృష్టించగలవు. అయితే, గ్యాస్ట్రిక్ సమస్యకు వేయించిన ఆహారాలు ప్రధాన కారణమని భావిస్తుంటారు చాలా మంది. కానీ కొన్ని సందర్భాల్లో మీ గ్యాస్ట్రిక్ సమస్యకు కూరగాయలు కూడా ముఖ్య కారణం కావచ్చు. ఎందుకంటే మనం రోజూ తీసుకునే కూరగాయల్లో కొన్ని త్వరగా జీర్ణం కావు. దీంతో గ్యాస్ట్రిక్ సమస్య తరుచుగా ఉత్పన్నమవుతుంది. మీరు గ్యాస్ట్రిక్ సమస్య నుండి దూరంగా ఉండాలంటే ఈ ఐదు కూరగాయలకు దూరంగా ఉండటం మంచిది.
జాక్ ఫ్రూట్
జాక్ ఫ్రూట్, హిందీలో దీన్ని కాథెల్ అని కూడా పిలుస్తారు. శాఖాహారులు దీన్ని నాన్-వెజ్ ఆకుకూరగా పరిగణిస్తారు. వాస్తవానికి, దీని ఆకృతి కూడా నాన్వెజ్గానే ఉంటుంది. జాక్ ఫ్రూట్లో పుష్కలంగా పోషకాలు లభిస్తాయి. కాని, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారికి ఇది మంచి ఎంపిక కాదు. ఎందుకంటే, జాక్ ఫ్రూట్లు శరీరంలో గ్యాస్ ఉత్పత్తిని పెంచుతాయి.
టారో రూట్ లేదా అర్బి
దీన్ని హిందీలో అర్బి లేదా ఘున్యాన్ అని పిలుస్తారు. అర్బిని చాలా మంది ఇష్టమైన కూరగాయగా పరిగణిస్తారు. ఈ కూరగాయలు రుచికరంగా ఉంటాయి. అంతేకాక, పప్పుతో కలిపి చేసే ఈ వంటకం రుచికరమైన ఆహారంగా పనిచేస్తుంది. కాని, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వారికి ఇది ఉత్తమ ఎంపిక కాదు. ఎందుకంటే , ఇది శరీరంలో గ్యాస్ స్థాయిని పెంచుతుంది.
ముల్లంగి
క్యారెట్ ఆకారంలో తెలుపు రంగులో ఉండే ముల్లంగి శీతాకాలంలో విరివిగా లభించే కూరగాయ. అయితే, ప్రస్తుతం ఇది దేశంలోని చాలా ప్రాంతాల్లో ఏడాదంతా లభ్యమవుతుంది. మీరు దీన్ని అమితంగా ఇష్టపడితే సలాడ్‌లో కలిపి పరిమిత పరిమాణంలో తీసుకోవడం మంచిది. అయితే, వీటిని ఎక్కువగా తినడం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలు రావొచ్చు. ముల్లంగి తినడం వల్ల వచ్చే గ్యాస్ సమస్యను ఎదుర్కోవటానికి వాటర్లో బ్లాక్ సాల్ట్ లేదా పుడినా ఆకులను కలిపి తీసుకోండి.
తెలుపు చిక్పా
చోలే పూరి, చోలే భతురే, చోలే చావల్ ఇవి చాలా మంది ఉత్తర భారతీయులు ఇష్టపడే వంటకాలు. కానీ చోల్ గ్యాస్ట్రిక్ ట్రబుల్కు కారణమవుతుంది. మలబద్దకం ఉన్నవారు దీన్ని తీసుకోకపోవడే మంచిది. ఒకవేళ తీసుకున్నా పరిమిత పరిమాణంలో మాత్రమే ఉండాలని గుర్తించుకోండి.
రెడ్ బీన్స్ (రాజ్మా)
ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధ వంటకంగా పరిగణించే రాజ్మా చావాల్ చాలా ఇండ్లలో ప్రతి వారం తప్పనిసరిగా తయారుచేసే వంటకం. అయితే, జీర్ణక్రియ సమస్యతో బాధపడుతున్న వారు రెడ్ బీన్స్ (రాజ్మా)ను తక్కువగా తీసుకోవడం ఉత్తమం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health Tips