Sexual Wellness: ఆ వయసులో ఉన్న వారికి సుఖ వ్యాధుల ప్రమాదం ఎక్కువ.. ఎందుకంటే..

మధ్య వయసులో ఉన్నవారు లైంగికంగా సంక్రమించే అంటువ్యాధుల (sexually transmitted infections) బారిన పడే ప్రమాదం ఎక్కువ అని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. సెక్యూర్డ్ సెక్స్ వల్ల ఎదురయ్యే వ్యాధుల గురించి అవగాహన ఉండకపోవడం వల్ల 45 ఏళ్లు పైబడిన వారు ఇలాంటి వ్యాధుల బారిన పడుతున్నారని తాజా అధ్యయనం వెల్లడించింది.

news18-telugu
Updated: December 27, 2020, 8:45 PM IST
Sexual Wellness: ఆ వయసులో ఉన్న వారికి సుఖ వ్యాధుల ప్రమాదం ఎక్కువ.. ఎందుకంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మధ్య వయసులో ఉన్నవారు లైంగికంగా సంక్రమించే అంటువ్యాధుల (sexually transmitted infections) బారిన పడే ప్రమాదం ఎక్కువ అని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. వయసు పైబడిన వారికి అన్ సెక్యూర్డ్ సెక్స్ వల్ల ఎదురయ్యే వ్యాధుల గురించి అవగాహన ఉండకపోవడం వల్ల 45 ఏళ్లు పైబడిన వారు ఇలాంటి వ్యాధుల బారిన పడుతున్నారని తాజా అధ్యయనం వెల్లడించింది. బ్రిటన్, బెల్జియం, నెదర్లాండ్స్ పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. షిఫ్ట్ సెక్సువల్ హెల్త్ ఇనిషియేటివ్ సంస్థకు చెందిన నిపుణులు ఇంగ్లాండ్ దక్షిణ తీరం, బెల్జియం, నెదర్లాండ్స్ ఉత్తర ప్రాంతాలలో 800 మంది అడల్డ్స్‌పై సర్వే చేశారు. వీరిలో 200 మంది వ్యక్తులు సామాజిక ఆర్థిక ప్రతికూలతల వల్ల ఇలాంటి విషయాలు బయటకు చెప్పలేకపోతున్నామని తెలిపారు.

కొన్ని దశాబ్దాలుగా సెక్సువల్లీ యాక్టివ్ ఓల్డర్ వ్యక్తుల లైంగిక ప్రవర్తనలో పెద్ద మార్పులు వస్తున్నట్టు పరిశోధకులు తెలిపారు. కానీ వారిలో చాలామంది STIల ప్రమాదాలను పరిగణించట్లేదు. ఒక్కరితోనే రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు గర్భనిరోధక సాధనాలను వాడకుండా సెక్స్‌లో పాల్గొంటున్నారు. ‘45 ఏళ్ళకు పైబడిన మహిళలు మెనోపాజ్ దశకు చేరుకోవడం వల్ల తమకు గర్భం వచ్చే అవకాశం లేదని కాంట్రాసెప్టివ్స్‌ను వాడట్లేదు. కానీ వారు STIల గురించి పెద్దగా ఆలోచించట్లేదు’ అని బ్రిటన్లోని చిచెస్టర్ యూనివర్సిటీ సీనియర్ లెక్చరర్ ఇయాన్ టిండాల్ చెబుతున్నారు.

టెస్టులు చేయించుకోవట్లేదు
సాధారణ ప్రజలతో పాటు సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన వారిలో 50 శాతం కంటే ఎక్కువ మంది సుఖ వ్యాధుల సంక్రమణ పరీక్షలు చేయించుకోవట్లేదని పరిశోధకులు కనుగొన్నారు. అపరాధ భావన, సిగ్గు వల్ల 45ఏళ్లు దాటినవారు ఈ వ్యాధుల గురించి చర్చించడానికి ఇష్టపడట్లేదు. సెక్సువల్ హెల్త్‌ను ఒక డర్టీ పదంగా చాలామంది భావిస్తున్నారు. "సోషల్ స్టిగ్మా, వృద్ధుల జీవితంలో సెక్స్ ఒక భాగం కాదనే ఊహాగానాల వల్ల చాలామంది సెక్సువల్‌ హెల్త్ గురించి పట్టించుకోవట్లేదు. ఆ ఏజ్ గ్రూప్ ప్రజలకు లైంగిక ఆరోగ్యంపై అవగాహన పరిమితంగా ఉంటుంది" అని పరిశోధన బృంద సభ్యులు టెస్ హార్ట్‌లాండ్ చెప్పారు.

అవగాహన లేకనే...
లైంగికంగా సంక్రమించే సుఖవ్యాధుల ప్రమాదాల గురించి తెలియదని సర్వేలో పాల్గొన్నవారిలో చాలామంది చెప్పారు. బ్రిటన్, నెదర్లాండ్స్‌లో 42శాతం మందికి తమకు సెక్సువల్‌ హెల్త్‌కు ఎక్కడ సేవలు పొందాలో తెలియదని చెప్పారు. 45 ఏళ్లు పైబడిన వారిలో కొంతమంది పాఠశాలలో ఉన్నప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్‌ గురించి తెలుసుకున్నామని తెలిపారు. డాక్టర్లు, నర్సులు వంటి ఆరోగ్య నిపుణులకు కూడా సెక్సువల్ హెల్త్ నాలెడ్జ్ ఉండట్లేదని అధ్యయనంలో పాల్గొన్నవారు చెప్పారు. సుఖవ్యాధులకు చికిత్స కోసం వారికి సాధారణ వైద్యసేవలందించే డాక్టర్ల దగ్గరికే వెళ్తున్నారు. వారికి సెక్సువల్ హెల్త్‌పై అవగాహన ఉండట్లేదు.

వారికి ప్రమాదం ఎక్కువ

సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన ప్రాంతాలలో నివసిస్తున్న 45 ఏళ్ళకు పైబడిన వయసున్నవారు సుఖవ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువ అని పరిశోధకులు కనుగొన్నారు. వారికి ఇలాంటి వ్యాధులకు చికిత్స తీసుకోకపోవడం, వైద్యసేవలకు దూరంగా ఉండటం వల్ల అనారోగ్యాలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. "ఇళ్లు లేనివారు, వలస వచ్చినవారు, స్థానిక భాష మాట్లాడలేనివారు, సెక్స్ వర్కర్లు... వంటి వారు లైంగికంగా సంక్రమించే వ్యాధులతో ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వారికి సుఖ వ్యాధుల గురించి అవగాహన ఉండకపోవడం, వ్యాధులకు సరైన చికిత్స తీసుకోకపోవడం వల్ల ప్రమాదాల తీవ్రత పెరుగుతుంది" అని బ్రిటన్‌లోకి ఎస్కెక్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకురాలు రూత్ లౌరీ చెబుతున్నారు.
Published by: Nikhil Kumar S
First published: December 27, 2020, 8:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading