జీవితమే ఒక పయనం(Travel). అందుకే ఈ రోజుల్లో చదువు కోసమో, లేక ఉద్యోగం కోసమే, వ్యాపారం కోసమే ఇంటికీ(home), ఊరికీ దూరంగా(distance) బతుకుతారు. తెలియని ప్రదేశమైనా తమ కలలు నిజం చేసుకోవడం కోసం ఒంటిరి(single)గానే ప్రయత్నాలు మొదలుపెడుతారు. ఈ ప్రయాణం(travel)లో చాలా ఇబ్బందులూ పడుతారు. కష్టనష్టాలనూ ఓర్చుకుంటారు. ఒంటరిగానే రూమ్‌లను అద్దెకు తీసుకుంటారు. ప్రతిరోజు తమ కుటుంబసభ్యులతో గడిపిన మధురక్షణాలను నెమరువేసుకుంటూ తమ కలల్ని నిజం చేసుకోవడానికి పరుగు మొదలుపెడుతారు. అయితే ఇలా జీవితం(life)లో విజయం సాధించడానికి చాలా మంది తమ ఇంటిని, కుటుంబసభ్యులను విడిచిపెట్టి, ఒంటరిగా నివసిస్తున్న వ్యక్తులు (People living alone) ఇతరులకన్నా మానసికంగా బలంగా(stronger than others) ఉంటున్నారట. ఎలాంటి కష్టాలు ఎదురైనా నిలబడి పరిష్కరించుకుంటున్నారట. ఒకవేళ కుటుంబసభ్యులతో కలిసినా కూడా వారిలో నాయకత్వ లక్షణాలు(Leadership qualities)) మెండుగా ఉంటున్నాయట. సింగిల్‌గా దూరంగా బతికిన వాళ్లలో ఎక్కువ మంది ఇలాగే ఉంటున్నారట. అయితే వారిలో వృద్ధి చెందిన విషయాలేంటో ఇపుడు తెలుసుకుందాం..
ఒంటరిగానైనా విజయ తీరాలకు..
కుటుంబానికి దూరంగా, ఒంటరిగా నివసించే వ్యక్తులకు ప్రత్యేకమైన, బలమైన వ్యక్తిత్వం(personality) ఉంటుంది. ఒంటరిగా నివసించే వారిలో ఇది కనిపిస్తుంది. వీరు చాలా విశ్వాసం(trust), ధైర్యం(dare)తో ఉంటారు. ఇలాంటి వ్యక్తులు ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయం తీసుకునే సామర్థ్యం(power) వీరిలో పెరుగుతుంది. ఫ్యామిలీకి దూరంగా నివసిస్తున్న వారిలో కనిపించే మరో ప్రధాన లక్షణం సానుకూల ఆలోచనలు (Positive Thinking). ఆ విద్యార్థులు, ఉద్యోగులు ఇతరులతో పాజిటివ్‌గా వ్యవహరిస్తారు. తమను తాము అర్థం చేసుకునే గుణం అధికంగా కలిగి ఉంటారు. తప్పు చేస్తున్నారో, ఒప్పు చేస్తున్నారో వీరికి అవగాహన ఉంటుంది. ఏదైనా సమస్య వస్తే త్వరగా త్వరగా పరిష్కరిస్తారు.
ఇతరులపై ఆధారపడరు..
వీరు అనవసర ఆలోచనలు, ఒత్తిడికి దూరంగా ఉండేందుకే ఏదో ఓ పనిలో నిమగ్నమవుతారు. దీంతో వీరు పనితో పాటు మంచి జీవనశైలిని ఏర్పరుచుకుంటారు. వినోదానికి తగిన సమయం కేటాయిస్తారు. మన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అనే విషయాన్ని చాలా తక్కువగా ఆలోచిస్తారు. ఇతరులు ఏమనుకుంటున్నా అంతగా దాని గురించి ఆందోళన చెందరు. వాళ్లకు నచ్చిన పనులు చేస్తే సమాజం ఏమంటుందో, ఏమోనన్న వాటి గురించి పట్టించుకోరు.
వీరి జీవితంలో క్రమశిక్షణ ఓ భాగంగా కనిపిస్తుంది. ఏదైనా సాధించాలంటే క్రమశిక్షణ సైతం ముఖ్యమని భావిస్తారు. అందుకే ఈ లక్షణానికి ప్రాధాన్యం ఇస్తారు. వారి తల్లిదండ్రుల నుంచి, కుటుంబం నుంచి దూరంగా ఉండటం వలన, ఈ వ్యక్తులు ఆర్థికంగా స్థిరపడాలని భావిస్తారు. ఆర్థికంగా ఇతరులపై ఆధారపడేందుకు ఇష్టపడరు. సొంత ఖర్చులకు ప్రాధాన్యం ఇస్తారు.
కారణం లేకుండా విమర్శించబోరు..
ఎలాంటి అబద్ధాలకు మద్దతు తెలపరు. నిజాన్ని(Truth) చెప్పేందుకు తాపత్రయపడతారు. కారణం లేకుండా ఒకరిని విమర్శించడం, పొగడటం కానీ చేయరు. ఏ విషయంలోనైనా స్పష్టత కోరుకుంటారు. ఈ వ్యక్తులు బానిసత్వానికి దూరంగా ఉండాలని భావిస్తారు. నైతిక విలువలను కాపాడుకోవడంలో రాజీ పడరు. నైతిక విలువలే వీరికి స్థానికంగా గౌరవాన్ని కల్పిస్తాయని ఆశిస్తూ ముందుకు సాగుతారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Family dispute, Financial problem, Good business, Most Eligible Bachelor, Sol bathuke so better, Villagers