news18-telugu
Updated: December 12, 2020, 6:00 PM IST
ప్రతీకాత్మక చిత్రం
గర్భం రాకుండా ఉండేందుకు అనేక మంది కండోమ్ వాడతారు. అయితే పట్టణ ప్రాంతాల ప్రజల్లో కండోమ్ వాడకంపై ఉన్న అవగాహన గ్రామీణ ప్రాంతాల వారికి ఉండడం లేదు. దీంతో వారు కండోమ్ వాడకంలో మిస్టేక్స్ చేస్తున్నారని తాజా సర్వేలో తేలింది. వాడిన కండోమ్ నే మళ్లీ వాడడం లాంటివి చేస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. దీంతో వారు ఇన్ఫెక్షన్లకు గురవుతున్నారు. దాంతో పాటు అలాంటి అపరిశుభ్ర కండోమ్ లు వాడడం వలన గర్భం వచ్చే ప్రమాదం ఉంటుందని తేలింది. వివరాల ప్రకారం నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే(NHFC) ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో దాదాపు 97.9 శాతం మంది సెక్స్ లో యాక్టీవ్ గా ఉండే పురుషులకు కండోమ్ యొక్క ప్రాముఖ్యత తెలుసని తేలింది. భారతదేశంలోని 94 శాతం మంది పురుషులకు కండోమ్ వాడకం గురించి తెలుసని వెల్లడైంది. అయితే గ్రామీణ ప్రాంతాలకు చెందిన అనేక మంది కండోమ్ వాడితే సెక్స్ లో అంతగా సుఖాన్ని పొందలేమని భావిస్తున్నట్లు తెలిసింది.
మరి కొందరు వాడిన కండోమ్ లనే మళ్లీ మళ్లీ వాడుతున్నట్లు సర్వే ద్వారా తెలిసింది. కండోమ్ వాడకం గురించి, కుటుంబ నియంత్రణ గురించి సరిగా అవగాహన లేకపోవడమే ఇందుకు కారణంమని నిపుణులు తేల్చారు. వాస్తవానికి ఇండియాలోని రూరల్ మార్కెట్లలో కండోమ్ ల కొరత ఉంటుంది. ఇది కూడా పై సమస్యకు ఓ కారణంగా చెప్పవచ్చు. మన దేశంలో రోజు రోజుకూ జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. ప్రస్తుతం జనాభా విషయంలో భారత్ చైనా తరువాతా రెండో స్థానంలో ఉంది. అయితే జనాభా ఇలాగే పెరిగితే 2024 కల్లా మన దేశం ప్రపంచంలో మొదటి స్థానానికి చేరే ప్రమాదం ఉంది. కండోమ్ లు జనాభా నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి.
అయితే కండోమ్ ల వాడకంపై అనేక మందికి సరైన అవగాహన లేదు. ఇప్పటికీ అనేక మంది కండోమ్ అడగడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో అబార్షన్లు అధికమవుతున్నాయి. దీంతో మన దేశంలో ఇంకా కండోమ్ వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. 2017లో భారత ప్రభుత్వం కండోమ్ ల యాడ్స్ పై నియంత్రణ విధించింది. యాడ్స్ ను తక్కువ సమయానికి పరిమితం చేసింది. అయితే చిన్నారులు ఇబ్బంది పడుతారనే ఆలోచనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కండోమ్ ల గురించి ఎక్కువగా చదవడానికి, తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారని తాజా అధ్యాయనంలో తేలింది.
Published by:
Nikhil Kumar S
First published:
December 12, 2020, 5:56 PM IST