PAROTTA VARIETIES FOR HEALTH FEAR THAT EATING PAROTTA WILL INCREASE WEIGHT NOW EAT LIKE THIS FOR GOOD HEALTH EVK
Parotta Varieties for Health: పరోటా తింటే బరువు పెరుగుతారని భయమా.. ఇలా తింటే ఏం కాదు!
ప్రతీకాత్మక చిత్రం
Parotta Varieties for Health | చాలా మందికి పరోటాలు అంటే ఇష్టం. కానీ ఎక్కువ తినాలంటే భయం. ఎందుకంటే బరువు పెరుగుతారని ఎంత ఇష్టం ఉన్నా.. వాటి జోలికి పోకుండా ఉంటున్నారు. అయితే పరోటా తిన్నా బరువు పెరగకుండా ఉండొచ్చని ఫుడ్ స్పెషలిస్ట్‌లు చెబుతున్నారు.
చాలా మందికి పరోటాలు (Parottas) అంటే ఇష్టం. కానీ ఎక్కువ తినాలంటే భయం. ఎందుకంటే బరువు పెరుగుతాని ఎంత ఇష్టం ఉన్నా వాటి జోలికి పోకుండా ఉంటున్నారు. అయితే పరోటా తిన్నా బరువు పెరగకుండా ఉండొచ్చిన ఫుడ్ స్పెషలిస్ట్‌లు చెబుతున్నారు. ఎటువంటి పరోటాలు తింటే బరువు (Weight) పెరగకుండా ఉంటారు. అంతే కాకుండా ఆరోగ్యం (Health) మరింత మెరుగ్గా మారుతుందో కూడా చెబుతున్నారు. బయట పరోటాలు తింటే బరువు పెరుగుతారనే భయం ఉంటే ఇంట్లోనే పరోటాల్లో కొత్త రకం తయారు చేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి లభిస్తుందని చెఫ్‌లు చెబుతున్నారు. సాంప్రదాయ పద్ధతులతోపాటు.. కొత్త ట్రిక్స్ పాటిస్తే పరోటా మంచిదే అంటున్నారు చాలా మంది. మరీ మీరు పరోటా తినాలని కోరకుకుంటున్నారా అయితే ఓసారి ఈ ఆరోగ్యకరమై పరోటాల గురించి తెలుసుకొని ఇంట్లో ట్రై చేయండి.
పరోటా తినడం వల్ల ఎక్కువమందికి కలిగే భయం బరువు పెరుగుతుందని. ఒంట్లో నలతగా ఉంటుందని ఆలోచిస్తారు. శరీరానికి ఇబ్బంది కలుగకుండా ఇంట్లోనే వివిధ రకాలైన రుచికరమైన పరోటా రకాలు చేయవచ్చు. ఇంట్లో ఉడికించిన పరోటా ఆరోగ్యకరమైన బరువును తగ్గించే ఆహారంగా మార్చవచ్చు.
ముల్లంగి పరోటా..
ముల్లంగిలో చాలా పోషక పదార్థాలు ఉంటాయి. ముఖ్యంగా క్యాన్సర్ (Cancer) తగ్గించే గుణం ఉటుంది. విటమిన్ ఎక్కువగా ఉంటాయి. మధుమేహం ఉన్నావారు సైతం పరోటాను ట్రై చేయవచ్చు. అధిక కొలస్టిరాల్ మరియు శరీర బరువు ఉన్నవారికి బరువు తగ్గించడానికి ముల్లంగి పరోటా ఉపయోగపడుతుంది. సాధారణంగా పరోటా చేసే పద్ధతిలోనే ముల్లంగిని తురుమి అందులో కలిపితే చాలు రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం.
ఉల్లిపాయ పరోటా..
ఏ వంటలోనేనా మంచి రుచికి ఉల్లిపాయలు ఉపయోగపడతాయి. చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయలతో పరోటా తయారీలో వాడాలి. దీని ద్వారా కెలరీలు తక్కువగా ఉంటాయి. మిగతా పోషకాల్లో మార్పు రాదు. అదనంగా జీర్ణశక్తికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఉల్లిపాయ పరోటా ఆరోగ్యానికి మేలు.
మేత్తి పొడి పరోటా..
ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా లభించే పరోటాల్లో మేతి పరోటా ప్రముఖంగా ఉంటుంది. ఎక్కువ విటమిన్లు, మినరల్ ఉంటాయి. మధుమేహ ఉన్నవారికి మేతి పరోటాలు ఇబ్బంది పెట్టవు. ఇందులో ఉన్న యాంటీఆక్సిడెంట్లు శరీరానికి ఉపయోగపడతాయి.
పాలకూర పరోటా..
పాలకూర కంటికి.. వంటికీ చాలా మంచింది. రుచితోపాటు ఆరోగ్యానికి చిరునామాగా పాలకూరను వైద్యులు చెబుతారు. పాలకూరతో చేసే పరోటా తింటే బీపీ పెరుగదల ఎక్కువగా ఉండదు. జీర్ణశక్తి పెంచుకోవడానికి పాలకూర పరోటా బెస్ట్ అని చెబుతున్నారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.