E-cigarettes: మీ పిల్లలు సిగరెట్లు తాగుతున్నారా..? గుర్తించడం ఎలా?

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సిగరెట్లు తాగడం అనేది సాధారణమే. కానీ మీ పిల్లలు ధూమపానానికి అలవాటుపడ్డారా లేదా అని కనుక్కోవడం ఎలా..? ఈ విషయంలో తల్లిదండ్రులు వెనుకబడి ఉన్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఇటీవలే విడుదలైన పీడియాట్రిక్ జర్నల్ లో వెల్లడైంది.

news18
Updated: October 6, 2020, 12:52 PM IST
E-cigarettes: మీ పిల్లలు సిగరెట్లు తాగుతున్నారా..? గుర్తించడం ఎలా?
ప్రతీకాత్మకచిత్రం
  • News18
  • Last Updated: October 6, 2020, 12:52 PM IST
  • Share this:
మారుతున్న కాలం.. దురలవాట్లు ఉన్న స్నేహితుల స్నేహంతో చాలా మంది పిల్లలు వ్యసనాలకు బానిసలవుతున్నారు. ఇందులో ముఖ్యంగా మధ్యపానం.. తర్వాత ధూమపానం. అయితే మందు తాగేవారితో పోలిస్తే.. సిగరెట్లు, ఈ-సిగరెట్లు, పొగాకు తాగే వారిని గుర్తించడం తల్లిదండ్రులకు కత్తి మీద సాములాంటిదే. సిగరెట్ తాగినవాల్లు.. సోంపు గానీ, బబుల్ గమ్ గానీ నమిలితే వాసన రాదు. దానిని కనిపెట్టడం ఎవరివల్లా కాదు. మరి దీనిని గుర్తించడం ఎలా..? పిల్లలను వ్యసనాల బారిన పడకుండా కాపాడుకోవడం ఎలా..?

ఎలా పసిగట్టేది..?

పిల్లలు పొగాకు సంబంధిత ఉత్పత్తులను వాడకుండా, వాటికి అలవాటు పడకుండా చాలామంది తల్లిదండ్రులు వారికి కఠినమైన రూల్స్ విధిస్తారు. కానీ వాళ్లు లేని సమయంలోనో, కాలేజీకి, బయటకు వెళ్లిన సమయంలోనో పిల్లలు ఈ పని కానిచ్చేస్తుంటారు. అయితే ఇది జరగకుండా ఉండాలంటే.. ఇంట్లో పెద్దవాళ్లు నిత్యం వారి మీద ఓ కన్నేసి ఉంచాలని ఈ పరిశోధనలో తేలింది. యుక్త వయసు పిల్లలు పొగాకు వాడకానికి అలవాటుపడకుండా చూడాలంటే ఇది తప్పదని అధ్యయనకారులు చెబుతున్నారు. సిగరెట్లు తాగితే దుష్పరిణామాలు వస్తాయని వారితో చెబితే ఎలాంటి ఉపయోగమూ ఉండదని వారు తేల్చారు.

నిపుణులు ఏం చెబుతున్నారు..?
ఇంట్లో పెద్దవాళ్లేవరికీ పొగ తాగే అలవాటు లేకుండా ఉంటే.. ఆ ఇంట్లో పిల్లలు ధూమపానానికి దూరంగా ఉంటారని ఈ అధ్యయనంలో పాల్గొన్న సభ్యుడు బెంజమిన్ చాఫీ తెలిపారు. కాలిఫోర్నియా యూనివర్సిటీలోని శాన్ ఫ్రాన్సిస్కో స్కూల్ ఆఫ్ డెంటిస్ట్రీలో ఆయన అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ.. పొగతాగడాన్ని నివారించడంలో ఇలాంటి కుంటుంబాల్లోని పెద్దలు ముఖ్యమైన పాత్ర పోషిస్తారని ఆయన అన్నారు.

అన్ని రకాల ఉత్పత్తులపై పరిశోధన
యూఎస్ లోని 12-17 మధ్య వయసు ఉన్న 23 వేల మందిపై ఈ పరిశోధనలు నిర్వహించారు. కాగా, పొగాకు వాడకూడదనే నిబంధనలు విధించే ఇళ్లలోని పిల్లలు దురలవాట్లకు అలవాటుపడే అవకాశం 20-26 శాతం తక్కువ అని తేలింది. ఇక రూల్స్ ఏమీ లేని ఇళ్లలోని యువతతో పోల్చి ఈ వివరాలు వెల్లడించారు. సిగరెట్లు, ఈ-సిగరెట్లతో పాటు సిగరెట్లు, హుక్కా, బీడీలు, పొగరాని పొగాకు ఉత్పత్తులైన స్నాఫ్, చూయింగ్ టొబాకో, స్నస్, డిజాల్వ్డ్ టొబాకో వంటి వాటిపై కూడా అధ్యయనం చేశారు. తక్కువగా చదువుకున్న తల్లిదండ్రులు, పొగాకు వాడే కుటుంబాల్లోని పెద్దలు తమ పిల్లలు పొగతాగుతున్నారా, నికోటిన్ సంబంధించిన ఉత్పత్తులను వాడుతున్నారా అని ఎక్కువగా అనుమానిస్తున్నారు. ఈ విషయంలో తండ్రులకంటే తల్లులు ఎక్కువ అవగాహన కలిగి ఉన్నారని అధ్యయనంలో తేలింది.
Published by: Srinivas Munigala
First published: October 6, 2020, 12:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading