హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Parenting: పిల్లల్లో ఊహించని మార్పులా..? తల్లిదండ్రుల ప్రవర్తనే కారణం.. సర్వేలో షాకింగ్ నిజాలు..!

Parenting: పిల్లల్లో ఊహించని మార్పులా..? తల్లిదండ్రుల ప్రవర్తనే కారణం.. సర్వేలో షాకింగ్ నిజాలు..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పిల్లలు అనుచితంగా ప్రవర్తించినా, చెప్పిన మాట వినకుండా ఎదురు మాట్లాడినా సరే.. వారితో నెమ్మదిగా మాట్లాడి, అన్ని విషయాలూ అర్థమయ్యేలా వివరించాలి. వారిపై కోప్పడితే పిల్లల ప్రవర్తనలో మార్పులు వస్తాయని అధ్యయనం వెల్లడించింది. ఇంకా పలు ఆసక్తికర విషయాలను వెలుగులోకి తెచ్చింది.

ఇంకా చదవండి ...

తల్లిదండ్రుల ప్రవర్తన సరిగ్గా లేకపోతే పెంపకంలో పిల్లలపై ప్రతికూల ప్రభావం పడుతుందని తాజా సర్వే చెబుతోంది. పిల్లలు అనుచితంగా ప్రవర్తించినా, చెప్పిన మాట వినకుండా ఎదురు మాట్లాడినా సరే.. వారితో నెమ్మదిగా మాట్లాడి, అన్ని విషయాలూ అర్థమయ్యేలా వివరించాలి. అంతేకాని వారిపై కోప్పడితే పిల్లల ప్రవర్తనలో మార్పులు వస్తాయని అధ్యయనం వెల్లడించింది. ఎలాంటి సందర్భంలోనైనా సరే, పరిస్థితుల ప్రభావాన్ని వారికి ప్రశాంతంగా వివరించడానికి పెద్దవాళ్లు ప్రయత్నించాలి. ఇలాంటప్పుడు తల్లిదండ్రులు వాడే భాష, టోన్ కూడా ముఖ్యం. ఇవన్నీ కలిసి పిల్లల్లో సానుకూల క్రమశిక్షణ అలవడేలా చేస్తాయని సర్వే పేర్కొంది. అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. పిల్లల ప్రవర్తనకు సంబంధించిన వివిధ రకాల అంశాలు, వారిని మందలించడం వల్ల ఎదురయ్యే ప్రభావాలను అంచనా వేశారు.

ఈ అధ్యయనం కోసం యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ గతంలో నిర్వహించిన సర్వేల డేటాను విశ్లేషించారు. పిల్లలను వేధించడం, వారిని శారీరకంగా శిక్షించడం వల్ల వారి ప్రవర్తనలో విపరీతమైన మార్పులు వస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇలాంటి చర్యల వల్ల పిల్లల్లో కోపం, దూకుడుతనం, ఏకాగ్రత లోపాలు వంటి ఇబ్బందులు పెరుగుతున్నాయని తెలిసింది. వారికి అన్ని విషయాలూ వివరించి చెప్పడం వల్ల ఎలాంటి సమస్యలూ ఉండవని అధ్యయనం తేల్చింది. ఇలాంటి పిల్లలు తోటివారితో మెరుగైన సంబంధాలను కోరుకుంటారని కూడా పరిశోధకులు గమని౦చారు.

ప్రవర్తనే ముఖ్యం

కొంతమంది చిన్నారులు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటున్నారు. పిల్లలను కొట్టడం వంటివి చేయకున్నా.. గద్దించడం, గట్టిగా అరవడం, కఠినమైన భాష ఉపయోగించడం వల్ల వారిలో ప్రవర్తన పరమైన లోపాలు కనిపించాయని పరిశోధకులు చెప్పారు. అందువల్ల పిల్లలను శారీరకంగా శిక్షించడం ఒక్కటే వేధింపుల కిందకు రాదు. వారితో ఎలా మాట్లాడుతున్నారు, సమస్య పరిష్కారానికి ఎంత సున్నితంగా వ్యవహరిస్తున్నారు.. వంటివన్నీ చెప్పుకోదగ్గ ప్రభావం చూపుతాయి. ఇవన్నీ సైకలాజికల్ వయొలెన్స్ కిందకు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పిల్లలను మందలించాల్సి వస్తే, సాధ్యమైనంత వరకు వారితో సున్నితంగా, దయతో వ్యవహరించాలని పరిశోధకులు తేల్చారు.

కోపం తప్పుకాదు

పిల్లలు చెయ్యిదాటి పోతున్నారని అనిపించినప్పుడు వారిపై కోప్పడటం వల్ల బ్యాడ్ పేరెంట్‌గా మారరు. అలాగని చిన్నారులతో హద్దులు దాటి ప్రవర్తించకూడదు. ఇలాంటి సందర్భం ఎదురైనప్పుడు దీర్ఘకాలంలో వారి ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చేలా చూడాలి. వారితో ఎక్కువ సమయం గడపాలి. వాళ్లపై ఎంత ప్రేమ ఉందో అర్థమయ్యేలా వివరించాలి. సమస్య ప్రభావాలను సున్నితంగా వారికి తెలియజేయడం వల్ల ఫలితం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

Published by:Hasaan Kandula
First published:

Tags: Ayurveda health, Children, Health benefits and secrets, Health Insurance, Parenting, Survey

ఉత్తమ కథలు