Home /News /life-style /

OVERWEIGHT IS THE REASON FOR SEVERAL HEALTH PROBLEMS IN WOMEN AK GH

Women Problems: మహిళల్లో ఆ సమస్యలకు కారణమవుతున్న అధికబరువు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Women Problems: భారతదేశంలో 135 మిలియన్లకు పైగా వ్యక్తులు ఊబకాయం, అధికబరువుతో బాధపడుతున్నట్లు ఒక అంచనా. ఈ సమస్యపై దృష్టిపెట్టకపోతే ప్రజలు తీవ్రమైన అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

జీవనశైలి వ్యాధులు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిపైనా తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఊబకాయం అనేక రకాల అనారోగ్యాలకు కారణమవుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అధికబరువు ఒక పెద్ద ప్రజారోగ్య సమస్యగా మారింది. భారతదేశంలో 135 మిలియన్లకు పైగా వ్యక్తులు ఊబకాయం, అధికబరువుతో బాధపడుతున్నట్లు ఒక అంచనా. ఈ సమస్యపై దృష్టిపెట్టకపోతే ప్రజలు తీవ్రమైన అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. శరీర భాగాల్లో కొవ్వు ఎక్కువగా పేరుకుపోయి ఆరోగ్యాన్ని దెబ్బతీయడాన్నే అధిక బరువు లేదా ఊబకాయం అంటారు. బరువు ఆధారంగానే ఊబకాయాన్ని నిర్ణయిస్తారు. ఇందుకు బాడీ మాస్ ఇండెక్స్ (BMI)ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఒక వ్యక్తి ఎంత ఎత్తుకు ఎంత బరువు ఉండాలనేది బాడీ మాస్ ఇండెక్స్ నిర్దేశిస్తుంది. ఇది ఎక్కువగా ఉంటే శరీర భాగాల్లో కొవ్వు పేరుకుపోతుందని అర్థం. BMI కాలిక్యులేటర్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.

శరీర బరువును ఎలా కొలుస్తారు?
మహిళల్లో బీఎంఐ 25 నుండి 29.9 వరకు ఉంటే అధిక బరువుగా పరిగణిస్తారు. ఇది 30 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే వారిని ఊబకాయులుగా గుర్తిస్తారు. కొవ్వును కొలవడానికి నడుము చుట్టుకొలతను కూడా ప్రామాణికంగా తీసుకుంటారు. మహిళల్లో నడుం చుట్టుకొలత 35 అంగుళాల కంటే ఎక్కువగా ఉంటే అధిక బరువు ఉన్నట్లే లెక్క. శరీరంలో పేరుకుపోయే అధిక కొవ్వు ఇన్సులిన్‌పై ప్రభావం చూపుతుంది. దీనివల్ల హార్మోన్ల అసమతుల్యత, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ (PCOS) వంటి అనారోగ్యాలు ఎదురవుతాయి.

పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రభావం
మహిళల్లో రుతుక్రమం, సంతానోత్పత్తి, గర్భధారణ వంటివి వారి పునరుత్పత్తి ఆరోగ్యం (Reproductive Health) లో భాగంగా ఉంటాయి. ఊబకాయం వల్ల మహిళల రీ ప్రొడక్టివ్ హెల్త్ దెబ్బతింటుంది. పీరియడ్స్ క్రమం తప్పడానికి ప్రధాన కారణం హార్మోన్ల అసమతుల్యత. ఇది ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్, పీరియడ్స్ ఎక్కువ రోజులు ఉంటడం, రక్తహీనత, మానసిక సమస్యలకు కారణమవుతుంది. BMI ఎక్కువగా ఉండే మహిళలకు గర్భం అందకపోవచ్చు. ఇలాంటి వారికి వైద్య చికిత్స అవసరం. హార్మోన్ల అసమతుల్యత వల్ల అండం విడుదల కావడంలో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల గర్భం రావడానికి వీరికి ఎక్కువ సమయం పడుతుంది. BMI సాధారణంగా ఉండే మహిళతో పోలిస్తే అధిక బరువు ఉండే వారికి సంతానోత్పత్తి చికిత్స ఫలితాలు కూడా తక్కువగా ఉంటాయి.

గర్భం రాకపోవడం
అధిక బరువు, ఊబకాయం వల్ల మహిళలు గర్భధారణ సమస్యలు, మధుమేహం, రక్తపోటు వంటి అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గర్భస్రావం, నెలలు నిండకముందే ప్రసవం కావడం, శిశువు ఎదుగుదలలో లోపాలు, సిజేరియన్ డెలివరీ చేయాల్సి రావడం.. వంటి సమస్యల ప్రమాదాన్ని ఊబకాయం పెంచుతుందని పరిశోధనల్లో తేలింది. రక్తపోటు, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, వంటి సమస్యలు ఉన్న గర్భిణులకు హై రిస్క్ ప్రెగ్నీన్సీ సమస్య కూడా ఎదురుకావచ్చు. ఇది తల్లీ బిడ్డల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

నివారణ ఎలా?
BMI ఎక్కువగా ఉన్న మహిళలకు ప్రీ-కాన్సెప్షన్ కేర్, కౌన్సెలింగ్ ఇవ్వాలి. మందులతో పాటు మానసిక ఒత్తిడి తగ్గించే ఇలాంటి మార్గాల ద్వారా గర్భిణులకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇవన్నీ సహజంగా ప్రసవం అవ్వడానికి ప్రేరేపిస్తాయి. అధిక బరువు, ఊబకాయంతో బాధపడేవారు తమ శరీర బరువులో కనీసం మూడు నుంచి ఐదు శాతం బరువు తగ్గినా అనారోగ్యాల ప్రభావం గణనీయంగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల, గర్భం కోసం ఎదురుచూసేవారు, పీసీఓఎస్ వంటి సమస్యలు ఉండేవారు పోషకాహారం తీసుకుంటూ డాక్టర్ల సలహాలతో వ్యాయామాలు చేయడం వల్ల బరువు తగ్గాలి.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Health, Women health

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు