Health Tips : ఆఫీసుల్లో ఓవర్ టైమ్ పనిచేస్తున్నారా.. ఈ సమస్యలు తప్పవు..

చాలామంది ఓవర్‌టైమ వర్క్ చేస్తుంటారు.. నేటికాలంలో మహిళలు కూడా చేస్తున్నారు. ఇలాంటి వారు ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారని అధ్యయనాలు చెబుతున్నాయి.

Amala Ravula | news18-telugu
Updated: June 14, 2019, 11:12 AM IST
Health Tips : ఆఫీసుల్లో ఓవర్ టైమ్ పనిచేస్తున్నారా.. ఈ సమస్యలు తప్పవు..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: June 14, 2019, 11:12 AM IST
నేటి మహిళ అటు ఇంట్లో, ఇటు ఆఫీసుల్లోని పనులు ఒంటిచేత్తో నిర్వహిస్తుంటారు. అలాంటి వారు భవిష్యత్‌లో ఎన్నో మానసిక, శారీరక సమస్యలు ఎదుర్కొంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. వారంలో 55 కంటే ఎక్కువ గంటలు పనిచేసే మహిళలు కుంగుబాటు, నిరాశ, ఆందోళన వంటి మానసిక సమస్యలను ఎదుర్కొంటారని తాజా అధ్యనం తేల్చింది. బ్రిట్‌లోని క్వీన్ మేరీ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. 20వేల మందిపై కొనసాగిన ఈ పరిశోధనలో ఆసక్తికర నిజాలు బయటపడ్డాయి.

వాస్తవానికి 35 నుంచి 40 గంటలు పనిచేస్తున్న మహిళలతో పోలిస్తే ఎక్కువ గంటలు పనిచేసిన వారికి మానసిక సమస్యలు అధికంగా ఉంటాయని తేలింది. ఇవి మితిమీరితే శారీరక సమస్యలుగా కూడా మారతాయని, గుండెసమస్యలకు దారితీస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా సెలవులు కూడా తీసుకోకుండా పనిచేసే వారిలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని, ఇది పురుషులకు కూడా వర్తిస్తుందని చెబుతున్నారు. వారిలో 3.4 శాతం సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు.


ఎదుగుదల ముఖ్యమే. కానీ, ఆరోగ్యంగా ఉంటేనే ఎదుగుతామని గుర్తుంచుకోవాలి.
First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...