Home /News /life-style /

OVER EXERCISING WATCH OUT FOR THESE 6 ADVERSE SIDE EFFECTS UMG GH

Over Exercising: అతిగా వ్యాయామం చేస్తున్నారా? అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్టే.. ఎందుకో తెలుసుకోండి..!

అతిగా వ్యాయామం చేస్తే ఏమవుతుందంటే..?

అతిగా వ్యాయామం చేస్తే ఏమవుతుందంటే..?

సరైన గైడెన్స్ లేకుండా మితిమీరిన ఫిజికల్‌ యాక్టివిటీలు చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలసిపోకుండా పని చేయడం, కాలిస్టెనిక్స్‌తో సహా కఠినమైన, భారీ వ్యాయామాలు చేయడం ఆరోగ్యానికి ప్రమాదకరమని చెబుతున్నారు.

బరువు తగ్గాలనుకునే వారి ముందున్న ప్రధాన మార్గం వ్యాయామం (Exercise) చేయడం. సరైన ఆహార నియమాలు పాటిస్తూ, రోజూ వ్యాయామం చేసేవారు ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం ద్వారా బరువు తగ్గడంతో పాటు ఫిట్‌నెస్‌ లెవల్స్‌ కూడా పెరుగుతాయి. అయితే సరైన గైడెన్స్ లేకుండా మితిమీరిన ఫిజికల్‌ యాక్టివిటీలు చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలసిపోకుండా పని చేయడం, కాలిస్టెనిక్స్‌తో సహా కఠినమైన, భారీ వ్యాయామాలు చేయడం ఆరోగ్యానికి ప్రమాదకరమని చెబుతున్నారు. ప్రతి వ్యాయామం లాభాలు, నష్టాలు గురించి తెలుసుకుని, నిపుణుల పర్యవేక్షణలో వ్యాయామం చేయడం మంచిది. మితిమీరిన వ్యాయామంతో శారీరకంగా, మానసికంగా దెబ్బతింటున్నారని తెలిపే సూచనలు ఇవే..

* తక్కువ ఎనర్జీ లెవల్స్‌
ప్రతి రోజూ ఎక్కువగా వ్యాయామం చేస్తుంటే అలసట వస్తుంది. బాడీ ఫంక్షనాలిటీపై ప్రభావం కనిపిస్తుంది. ఇటువంటి కఠినమైన వ్యాయామాలు ఎక్కువగా విశ్రాంతి తీసుకొనేలా చేస్తాయి. దీంతో దినచర్య అసమగ్రంగా తయారవుతుంది. తరచూ వ్యాయామం చేయడం వల్ల గాయాలు కూడా సంభవించవచ్చు. దీని ఫలితంగా ప్రేరణ లేకుండా పోతుంది. శారీరక శ్రమ స్థాయిని నెమ్మదిగా పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

* పనితీరుపై ప్రభావం
జిమ్‌కు వెళ్లేటప్పుడు లేదా సైక్లింగ్, స్విమ్మింగ్ లేదా రన్నింగ్ వంటి వివిధ రకాల ఏరోబిక్ ఫిజికల్ యాక్టివిటీలను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు పనితీరు, వేగం తగ్గుతుంది. చెమట పట్టడం లేదా దడ పట్టడం వంటివి గమనించవచ్చు. ఇది శరీరం విశ్రాంతి తీసుకోవడానికి సూచన. సహనం, సామర్థ్యానికి మించి చెమట పట్టేలా బలవంతంగా ఫిజికల్‌ యాక్టివిటీలు చేయకూడదు.

 ఇదీ చదవండి: వారెవ్వా.. ఫేస్ బుక్ లో టిక్ టాక్.. ఇక పండగే పండుగ.. ఎప్పటి నుంచి అంటే!


* నిద్రలేమి
మితమైన వ్యాయామం రిలాక్స్‌గా అనిపిస్తుంది. రాత్రి మంచి నిద్రను అందించడంలో సహాయపడుతుంది. ఎక్కువగా చేసే వర్కౌట్ కార్టిసాల్, అడ్రినలిన్ వంటి ఒత్తిడి హార్మోన్లను ప్రేరేపిస్తుంది. అలాంటి హార్మోన్ల ఉద్రేకం వల్ల నిద్రలేని రాత్రులు ఎదురవుతాయి.

* మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం
ప్రివెంటివ్ మెడిసిన్ పరిశోధన-ఆధారిత అధ్యయనం ప్రకారం.. వారానికి 7.5 గంటల కంటే ఎక్కువ పని చేయడం వల్ల ఆందోళన, నిరాశ వంటి మానసిక రుగ్మతలు వస్తాయి. శరీరాన్ని దాని పరిమితికి మించి కష్టపెడితే.. అనిశ్చితి, కోపం, దూకుడు, అస్థిరత వంటి సంకేతాలు కనిపిస్తాయి.* పీరియడ్స్‌పై ప్రభావం
అధిక వ్యాయామం మహిళల్లో పీరియడ్స్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. క్రమరహిత పీరియడ్స్‌కు కారణమవుతుంది. దీనిని అమెనోరియా అకా ఎక్సర్‌సైజ్ ప్రేరిత అనోరెక్సియా అంటారు.

* బాధాకరమైన అనుభవం
శరీరానికి విశ్రాంతి ఇవ్వకపోవడం, పునరుజ్జీవం పొందే సమయం ఇవ్వకపోతే, కండరాలు కోలుకోవడానికి తగినంత సమయం లేక నొప్పి వస్తుంది. దీంతో రోజువారీ పనులు ప్రభావితం అవుతాయి. రోజులో ఎక్కువ సమయం లోపించిన అనుభూతిని కలిగిస్తుంది. ఎక్కువ కాలం పాటు అధిక ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్(HIIT) వ్యాయామం చేయడం వల్ల కండరాలు బిగుతుగా మారతాయి. శ్రమకు దారితీయవచ్చు.
Published by:Mahesh
First published:

Tags: Exercises, Health, Health care, Sleep tips

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు