Home /News /life-style /

OUR HOMEMADE SPECIAL CHUTNEY RECIPES THAT ARE READY IN MINUTES TRY IT YOURSELF RNK

Indian chutney recipes: నిమిషాల్లో తయారు చేసే మన దేశీయ స్పెషల్ చట్నీ రెసిపీలు! మీరూ ట్రై చేయండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇడ్లీ ,దోస నుండి మొదలుకొని అన్ని రకాల ఆహారాలకు సైడ్ డిష్‌గా చట్నీ తరచుగా మన ఎంపిక. మీరు తయారుచేయగల రుచికరమైన ఆరోగ్యకరమైన చట్నీ జాబితా ఉంది… 

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada | Vizianagaram
Indian chutney recipes:  భారతీయ ఆహారం (Indian Recipes) లో ఎక్కువగా ఉదయం ,సాయంత్రం ఇడ్లీ, దోసె, చపాతీ మొదలైనవి ఉంటాయి. ఇంట్లో మహిళలు త్వరగా వంట చేయడానికి టమోటా ,కొబ్బరి చట్నీ (Coconut chutney) ని ఎంచుకుంటారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రసిద్ధి చెందిన చట్నీలను కొన్ని నిమిషాల్లో ఎలా తయారు చేయాలో ఇక్కడ నేర్చుకుందాం.

వెల్లుల్లి చట్నీ:
ఇది పశ్చిమ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన చట్నీలలో ఒకటి.

ఇది కూడా చదవండి: వినూత్న వంటకాలు ఇష్టపడే రాకేష్ ఝున్‌ఝున్‌వాలా లైఫ్‌స్టైల్ ఎలా ఉండేదో తెలుసా?


కావాల్సిన పదార్థాలు:
వెల్లుల్లి మొత్తం - 1
ఎండు మిర్చి - 4
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
కారం పొడి - 1 టేబుల్ స్పూన్
ఆవాలు - 1 టేబుల్ స్పూన్
ఆవాల నూనె - 4 టేబుల్ స్పూన్లు
ఉప్పు -తగినంత



రెసిపీ:
ముందుగా 4-5 టీస్పూన్ల పొట్టు తీసిన వెల్లుల్లి, ఎండు మిరపకాయలు, కారంపొడి తీసుకోవాలి. తరవాత కొద్దిగా నీళ్లు పోసి మిక్సీలో వేసి చిక్కని పేస్ట్‌లా మెత్తగా రుబ్బుకోవాలి.

తర్వాత బాణలిలో ఆవాల నూనె వేసి వేడి చేసి ఆవాలు, కరివేపాకు, చట్నీ పేస్ట్ వేసి బాగా కలపాలి. పచ్చి వాసన పోయే వరకు మీడియం మంట మీద ఉంచండి. ఇప్పుడు వెల్లుల్లి చట్నీ రెడీ.

కొత్తిమీర పుదీనా చట్నీ:
నార్త్ ఇండియా స్పెషల్ కొత్తిమీర పుదీనా చట్నీ చేయడానికి

కావలసిన పదార్థాలు :
కొత్తిమీర ఆకులు - 2 కప్పులు
పుదీనా ఆకులు - ¼ కప్పు
పచ్చిమిర్చి - 1
అల్లం - కొద్దిగా
వెల్లుల్లి - 4
ఉల్లిపాయ - 1
నిమ్మరసం,ఉప్పు - తగినంత



రెసిపీ:
ముందుగా కొత్తిమీర, పుదీనా ఆకులను బాగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, అల్లం, ఉల్లి, వెల్లుల్లి, నిమ్మరసం, కొద్దిగా ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి.
అవసరమైతే సీజనింగ్ చేయండి. లేకపోతే, కొత్తిమీర పుదీనా చట్నీని ఒక గిన్నెలో ఉంచండి. మీరు దీన్ని ఒక వారం పాటు కూడా ఉపయోగించవచ్చు.

ఇది కూడా చదవండి: వంకాయ వల్ల ఇన్ని లాభాలా..? ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనం..!


కొబ్బరి చట్నీ:
కొబ్బరి చట్నీ దక్షిణ భారతదేశంలో చాలా మంది తినే ఒక ప్రత్యేక చట్నీ.



కావాల్సిన పదార్థాలు:
½ కప్పు కొబ్బరి పొడి లేదా కొబ్బరి
¼ కప్ కాల్చిన వేరుశెనగ
¼ కప్ కాల్చిన చిక్‌పీస్
½ కప్పు పెరుగు
కొద్దిగా అల్లం పచ్చి మిర్చి
ఆవాలు - 1 టేబుల్ స్పూన్
ఎండు మిర్చి - 1
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు-తగినంత

రెసిపీ:
వేయించిన వేరుశెనగ, వేయించిన చిక్‌పీస్‌ను పొట్టు తీయాలి.
తర్వాత కొబ్బరిపొడి, పెరుగు, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు వేసి చిక్కని ముద్దలా రుబ్బుకోవాలి.
బాణలిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి చట్నీకి తాలింపు వేసి రుచికరంగా వడ్డించాలి.

(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. )
Published by:Renuka Godugu
First published:

Tags: Recipes

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు