ఇండోనేషియా..
దీపావళిని (Diwali 2021) భారత్‌లో ఏవిధంగా సెలెబ్రేట్ చేసుకుంటారో.. ఇంచుమించు వీరు కూడా అలాగే నిర్వహించుకుంటారు. అక్కడ కూడా ఈరోజు పబ్లిక్ హాలిడే (public holiday) . వారి బంధువు, మిత్రులను కలిసి అభినందనలు తెలుపుకుంటారు.
ఫీజీ..
ఫీజీలో ఉండే ఇండియన్స్ చాలా వైభవంగా నిర్వహించుకుంటారు. ఫిజీలో కూడా ప్రభుత్వ సెలవుదినం. దీపావళి రోజు (Diwali 2021) మన భారత్‌కు చెందిన ప్రజలు పార్టీలను జరుపుకుంటారు. ఒకరికొకరు గిఫ్ట్‌లను ఇచ్చుకుంటారు.
ఇది కూడా చదవండి: ఉసిరితో గుండె సంబంధిత వ్యాధులకు చెక్! ఈజీగా బరువు తగ్గొచ్చు.. ఇంకా..
మారిషస్..
మారిషస్‌లో హిందూ మతానికి చెందిన వారు 50 శాతం ఉంటారు. అక్కడ కూడా మట్టి దీపాలను ఇంటి గుమ్మంలో పెట్టుకుని కనుల పండువగా నిర్వహించుకుంటారు. దీంతో ఈ ద్వీపం ఫెయిరీ ల్యాండ్ మాదిరి కనిపిస్తుంది.
మలేషియా..
మలేషియాలో దీపావళిని హరి దివాలిగా పిలుస్తారు. ఇక్కడ ఈ పండుగను కాస్త భిన్నంగా నిర్వహించుకుంటారు. ఉదయాన్నే ఆయిల్‌తో స్నానం చేస్తారు. ఆ తర్వాత గుడికి Ðð ళ్తారు. కానీ, మలేషియాలో పటాకుల విక్రయాన్ని నిషేధించారు. అందుకే ఇక్కడి ప్రజలు గిఫ్ట్, స్వీట్స్‌తో విషేస్ చెప్పుకుంటారు.
ఇది కూడా చదవండి: పళ్లను బ్రష్ చేసుకోవడానికి 2 నిమిషాలు సరిపోదా?
శ్రీలంక..
శ్రీలంకలో కూడా దీపావళి నిర్వహించుకుంటారు. ఇక్కడి ప్రజలకు ఈ ఫెస్టివల్ ఎంతో ఇష్టం. శ్రీలంకలో కూడా దీపావళి పబ్లిక్ హాలిడే. చిన్న లైట్స్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల దుష్ట శక్తులు రావని వారి నమ్మకం. అంతేకాదు, ఈ దీపాలు తమ జీవితంలో కూడా వెలుగులు నింపుతుందని నమ్ముతారు.
నేపాల్..
దీపావళిని నేపాల్ తిహార్ అని కూడా పిలుస్తారు. చాలా అద్భుతంగా ఈ పండుగను నిర్వహించుకుంటారు. ఇంటిని అందంగా అలంకరించుకుని, లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. నేపాల్ రెండో అతిపెద్ద పండుగ ఇది. ఇక్కడ కూడా ఒకరికొకరు బహుమతులను ఇచ్చుకుంటారు.
సింగపూర్..
మీరు ఈ సమయంలో సింగపూర్‌లో ఉంటే.. ఇండియా లాగానే వేడుకలు నిర్వహించుకుంటారు. దీన్ని మీరు కళ్లారా చూడగలరు. ఎంతో ఆనందంగా దీపావళిని ఇక్కడి ప్రజలు జరుపుకొంటారు.
కెనడా..
కెనడాలో దీపావళి జాతీయ హాలిడే కాదు కానీ, ఇక్కడి చాలా పట్టణాలు, నగరాల్లో దీపావళి జరుపుకొంటారు. ఎంతో ఆనందంగా ఇక్కడి ప్రజలు దీపావళిని నిర్వహించుకుంటారు.
యూకే..
ప్రత్యేకంగా లీచెస్టర్, బర్మింఘల్ వంటి యూకే నగరాల్లో దీపావళిని చాలా గ్రాండ్‌గా నిర్వహించుకుంటారు. ఎందుకంటే ఈ నగరాల్లో ఇండియన్స్ ఎక్కువ మంది ఉంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Diwali 2021