Home /News /life-style /

OTHER THAN INDIA IN THESE FIVE COUNTRIES ALSO CELEBRATES NAVARATRI DURGA POOJA RNK

Navaratri 2021: భారత్‌ కాకుండా.. ఈ 5 దేశాల్లో కూడా దుర్గాపూజ ఘనంగా జరుపుతారు!

నవరాత్రి దుర్గాపూజ

నవరాత్రి దుర్గాపూజ

Navaratri 2021: నవరాత్రుల్లో అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తారు. నవరాత్రుల్లో, నవదుర్గలు మనకు ఆశీర్వదిస్తారు.  దుర్గాపూజ కేవలం భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మరో 5 దేశాల్లో కూడా ఘనంగా నిర్వహిస్తారు.

Navaratri నవరాత్రుల్లో దుర్గామాత Durga mata ను వివిధ రూపాల్లో పూజిస్తారు. ఇదే దుర్గామాత పూజకు ఉత్తమ సమయమని భావిస్తారు. ఈ ఏడాది కూడా నవరాత్రులు సందడిగా చేసుకుంటున్నారు.


దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహించుకునే హిందువుల పండుగ  .  ఈరోజుల్లో 9అవతారాల్లో 9రోజులపాటు దుర్గామాతను Durgamata పూజిస్తారు. ఈ రోజుల్లో ముఖ్యంగా అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తారు. నవరాత్రుల్లో, నవదుర్గలు మనకు ఆశీర్వదిస్తారు.  దుర్గాపూజ కేవలం భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మరో 5 దేశాల్లో కూడా ఘనంగా నిర్వహిస్తారు. ఆ దేశాలు ఏంటో తెలుసుకుందాం.

నేపాల్‌..
నేపాల్‌లో దుర్గాపూజను 10 రోజులపాటు నిర్వహిస్తారు. మన దేశంలో జరిగే నవరాత్రుల సమయాల్లోనే వారు కూడా ఘనంగా దుర్గాపూజను నిర్వహిస్తారు. దసరాను నేపాల్‌లో దశాయన్‌ అని కూడా అంటారు. ఈ సందర్భంలో అక్కడ కూడా పండగా వాతావరణం సంతరించుకుంటుంది. అక్కడి ప్రజలకు తమ ఫ్యామిలీతో గడపడానికి ఇది సరైన సమయంగా భావిస్తారు. అందుకే స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ సంస్థలకు సెలవు దినం. బస్సులు కూడా నడపరు.

ఇది కూడా చదవండి: దుర్గామాత ఆయుధాలు ధరించడం వెనుక రహస్యం?


బంగ్లాదేశ్‌..
ఈ వేడుక బంగ్లాదేశ్‌ Bengalis బెంగాళీల రెండో అతి పెద్ద పండుగ. అత్యంత వైభవంగా అమ్మవారి పూజలు చేస్తారు. ప్రతి నగరం, జిల్లాల్లో కూడా ఈ వేడుక కనిపిస్తుంది. ఆలయాలను, దుర్గామాత ప్రతిమను అందంగా అలంకరిస్తారు. వేల సంఖ్యల భక్తులు సందర్శించి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుంటారు.

యూకే..
ఇక్కడ నివసించే భారతీయులు దుర్గా పూజను ఘనంగా నిర్వహిస్తారు. అమ్మవారి ప్రతిమలను అక్కడ కూడా ఏర్పాటు చేసుకుంటారు. అత్యంత ప్రామాణికమైన బెంగాలీ పద్ధతిలో వేడుకలు నిర్వహించుకుంటారు. ఒక అసోసియేషన్‌గా కూడి కార్యాకలాపాలు నిర్వహిస్తారు. ఈ సమయంలో అందరూ కలిసి ఐక్యంగా ఉంటారు.

యూఎస్‌ఏ..
యూఎస్‌లో USA దుర్గాపూజ చాలా ఉత్సాహాంగా నిర్వహించుకుంటారు. ఎందుకంటే అక్కడ ఎక్కువ సంఖ్యలో భారతీయులు ఉంటారు. ముఖ్యంగా బెంగాలీలు 1970 లో ఈ ఉత్సవాలను అక్కడ ప్రారంభించారు. ఐదు రోజులపాటు వేడుకలు జరుపుతారు. యూఎస్‌లోని అన్ని రాష్ట్రాల్లోని భారతీయులు దుర్గాపూజను చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా అనేక అసోసియేషన్లు ఈ పండుగను అత్యంత అంకితభావంతో నిర్వహిస్తారు. ఇక్కడ ప్రజలు గుమిగూడి అందరూ కలుస్తారు. ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు.

ఇది కూడా చదవండి: నవరాత్రి.. అమ్మవారి 6వ అలంకరణ, ప్రసాదం, రంగు వస్త్రం!
ఆస్ట్రేలియా..
కొన్ని రికార్డుల ప్రకారం ఆస్ట్రేలియా Australia లో ఓ 12 కుటుంబాలు 1974లో దుర్గాపూజను ప్రారంభించారు. దీన్ని ప్రస్తుతం అన్ని నగరాల్లో నిర్వహిస్తున్నారు. సిడ్నీలో ఎంతోమంది బెంగాలీలు, ప్రవాస భారతీయులు పూజ మొదటిరోజు సమావేశమవుతారు. తదుపరి వేడుకలకు ప్రణాళికలు వేసుకుంటారు. మెల్‌బర్న్‌లో ఈ పండుగ సౌత్‌ కీస్‌బరోలో నిర్వహిస్తారు. ప్రతి ఒక్కరూ ఈ వేడకలో పాల్గొంటారు. ఇక్కడ ఈ వేడుక సమాజానికి సంబంధించిన వేడుకగా భావిస్తారు.
Published by:Renuka Godugu
First published:

Tags: Durga Pooja, Dussehra 2021, Navaratri, USA

తదుపరి వార్తలు