Mint Leaves: పుదీనా ఆకులతో అత్యద్భుత ప్రయోజనాలు

Health : వామ్టింగ్, వికారంగా అనిపిస్తున్నప్పుడు... ఒకట్రెండు పుదీనా ఆకుల్ని తీసుకొని... ముద్దలా చేసి... కొద్దిగా పంచదార లేదా యోగర్ట్ కలిపి తింటే... ఫలితం కనిపిస్తుంది.

news18-telugu
Updated: August 29, 2020, 3:20 AM IST
Mint Leaves: పుదీనా ఆకులతో అత్యద్భుత ప్రయోజనాలు
Health : పుదీనా ఆకులతో అత్యద్భుత ప్రయోజనాలు
  • Share this:
Health : వాడకుండానే సువాసన వచ్చే అద్భుతమైన మొక్క పుదీనా. ఇది వంటకు మంచి ఫ్లేవర్ ఇవ్వడమే కాదు... ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. అసలీ మొక్క మొత్తం ఔషధ గుణాలతో ఉన్నదే. అందుకే మన పూర్వీకుల నుంచీ ఇప్పటివరకూ పుదీనాను ఎన్నో ఆయుర్వేద ఇతర మందుల తయారీలో వాడుతున్నారు. అంతేకాదు... కాస్మొటిక్ కంపెనీలు, ఔషధ కంపెనీలు ఈ మొక్కలను పెద్ద సంఖ్యలో సాగు చేయిస్తూ... ఈ ఆకుల రసాన్ని ఎన్నో క్రీములు, లోషన్లు, మందుల తయారీలో వాడుతున్నాయి. మన తెలుగువారు... ఎక్కువగా బిర్యానీ, ఇతర వంటల్లో పుదీనా ఆకుల్ని ఉపయోగిస్తారు. ఐతే... పుదీనాతో కలిగే ఎన్నో ప్రయోజనాలు తెలుసుకుంటే... ఈ మొక్కల్ని కూడా ఇళ్లలో పెంచుకోవడం ఖాయం.

పుదీనా ఆకులతో కలిగే ప్రయోజనాలు :

- ఇంట్లో చెడు వాసనలు వస్తూ ఉంటే... డోర్లు మూసేసి... కొన్ని పుదీనా ఆకుల్ని ఓ గిన్నెలో వేసి... నీరు పోసి... ఓ పది నిమిషాలు ఉడకబెట్టండి. ఆ పొగ ద్వారా వచ్చే సువాసనతో ఇంట్లో చెడు వాసనలు పరారవుతాయి.
- చూయింగ్ గమ్ తినేబదులు... మౌత్ ఫ్రెష్‌నర్‌గా పుదీనా ఆకులు తినడం బెటర్.
- వామ్టింగ్, వికారంగా అనిపిస్తున్నప్పుడు... ఒకట్రెండు పుదీనా ఆకుల్ని తీసుకొని... ముద్దలా చేసి... కొద్దిగా పంచదార లేదా యోగర్ట్ కలిపి తింటే... ఫలితం కనిపిస్తుంది.
- దగ్గు అదేపనిగా వస్తుంటే... పుదీనా ఆకుల రసం, బ్లాక్ సాల్ట్ కలిపి తీసుకుంటే... దగ్గు తగ్గుతుంది.
- కడుపులో నొప్పిగా ఉంటే... పుదీనా ఆకుల రసం, తేనె కలిపి తాగితే ఫలితం ఉంటుంది.- కడుపులో తిప్పుతూ ఉంటే... ఓ కప్పు నీటిలో.. పుదీనా ఆకుల రసం, నిమ్మ రసం కలిపి తాగితే ఉపశమనం కలుగుతుంది.
- కలరా సమస్య ఉంటే... నిమ్మరసం, మామిడి రసం, తేనె కలిపి తాగితే... ఫలితం ఉంటుంది.
- ముఖం కాంతివంతంగా మారాలంటే... పుదీనా ఆకుల్ని మిక్సీలో వేసి... గుజ్జులా చేసి... ఆ పేస్ట్‌ను ముఖానికి పట్టించి... గంట తర్వాత నీటితే కడిగేసుకోవాలి.
- టైఫాయిడ్ నుంచీ ఉపశమనం పొందాలంటే... పుదీనా ఆకులు, తులసి ఆకుల రసం కలిపి తాగాలి.
- జలుబుతో ముక్కు కారుతూ ఉంటే... పుదీనా ఆకుల రసం నాలుగు చుక్కల్ని ముక్కులో వెయ్యాలి. మంచి ఫలితం ఉంటుంది.
- ఆహారంతోపాటూ... పుదీనా ఆకులు, మిరియాల పొడి, నల్ల ద్రాక్ష, జీలకర్ర, సింధు, గసగసాలు... వీటన్నింటినీ కలిపి తీసుకుంటే... జీర్ణక్రియ మెరుగవుతుంది.
Published by: Krishna Kumar N
First published: August 29, 2020, 3:15 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading