Control Blood Pressure: బీపీ తగ్గాలా... ఈ జ్యూస్ ఓ గ్లాస్ తాగితే సరి

బీపీ తగ్గాలా... ఈ జ్యూస్ ఓ గ్లాస్ తాగితే సరి...

Ginger Garlic Lemon Juice Health Benefits : ఈ జ్యూస్ ఎంత మంచిదంటే... ధమనుల్లో (Arteries) కొవ్వును తరిమేసి... హైబీపీ సమస్యకు చెక్ పెడుతుంది. ఇంకా చాలా లాభాలున్నాయి. వివరంగా తెలుసుకుందాం.

 • Share this:
  Ginger Garlic Lemon Juice Health Benefits : ధమనుల్లో రక్తం నిరంతరం ప్రవహిస్తూ ఉంటుందని చిన్నప్పుడు మనం చదువుకున్నాం. ఈ ప్రవాహం ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు. ఒక్కోసారి ఆగుతుంది. దీన్నే ఆర్టెరీస్ బ్లాక్ అంటారు. రక్తం గడ్డకట్టినా, రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువైనా... ధమనుల్లో రక్త ప్రవాహం ఆగిపోతుంది. ఫలితంగా రక్తంపై ఒత్తిడి పెరిగిపోతుంది. ఎందుకంటే... వెనకున్న రక్తం... ఆగిపోయిన రక్తాన్ని ముందుకి నెడుతుంది. ఆగిపోయిన రక్తం ముందుకి వెళ్లలేక... వెనకున్న రక్తాన్ని ఆగమని చెప్పలేక... సతమతమవుతుంది. ఆ పరిస్థితుల్లో హై బ్లడ్ ప్రెష్షర్ (హైబీపీ) వచ్చేస్తుంది. దీన్నే హైపర్ టెన్షన్ (hypertension) అంటాం. ఒక్కసారి ధమనులు బ్లాక్ అయ్యాయంటే... వాటిని సరిచెయ్యడం చాలా కష్టం. దురదృష్టవశాత్తూ... అమెరికాలో... 10 కోట్ల మందికి హైబీపీ (30 శాతం మందికి) ఉంది. అక్కడే కాదు ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఈ సమస్య ఉంది. దీనంతటికీ ప్రధాన కారణం కొలెస్ట్రాలేనని పరిశోధనల్లో తేలింది. సో, మనం ఆ కొలెస్ట్రాల్ అంతు చూడాలి. లేదంటే... సమస్యే.

  కొలెస్ట్రాల్ (కొవ్వు లాంటిది) ఏర్పడటానికి... స్మోకింగ్, జన్యులోపాలు, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఎక్సర్‌సైజ్ చెయ్యకపోవడం, అధిక బరువు, డయాబెటిస్ వంటివి కారణాలుగా ఉన్నాయి. కొలెస్ట్రాల్ సమస్య తీవ్రమవుతుంటే... చాలా మంది డాక్టర్లను సంప్రదిస్తున్నారు. కానీ ఇలాంటి సమస్యలకు డాక్టర్లు ఇచ్చే ట్రీట్‌మెంట్, వాడించే మందుల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. లక్కేంటంటే... మనం ఇళ్లలో కూడా కొవ్వుకు విరుగుడు తయారుచేసుకోవచ్చు. వెల్లుల్లి, అల్లం, నిమ్మకాయ రసం, యాపిల్ సైడెర్ వెనిగర్ (సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది), తేనె ద్వారా తయారుచేసుకునే జ్యూస్... ధమనులు గడ్డకట్టకుండా, బీపీ కంట్రోల్ అయ్యేలా చేస్తాయి.

  ఇదెలా పనిచేస్తుంది : ధమనులను సరిచేసే శక్తి వెల్లుల్లికి ఉందని తేలింది. ఇది బీపీని తగ్గిస్తూ... చెడు కొలెస్ట్రాల్‌ని తరిమికొడుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. షుగర్ లెవెల్స్ నార్మల్‌గా ఉన్నప్పుడు... మనం ఆకలిని కంట్రోల్ చేసుకోగలం. అప్పుడు ఆటోమేటిక్‌గా బరువు తగ్గుతారు.

  అల్లం.. గుండె సమస్యల్ని పరిష్కరించగలదు. ఎందుకంటే ఇది రక్త ప్రసరణ (బ్లడ్ ఫ్లో)ని పెంచగలదు. అంతే కాదు... మనం ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండేలా అల్లం ఎనర్జీ ఇవ్వగలదు. అందువల్ల ఎనర్జీ కోసం మనం ఎక్కువ ఆహారం తీసుకోం. ఫలితంగా బరువు తగ్గుతాం.

  నిమ్మకాయ రసం... గుండె లయను (హార్ట్ బీట్)ను సరిచెయ్యగలదు. గుండెను సరిగా పనిచేసేలా చేస్తుంది. శరీరమంతా రక్త ప్రసరణ సరిగా జరిగేలా చేస్తుంది.

  యాపిల్ సైడెర్ వెనిగర్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి మన బాడీలో చెడు వ్యర్థాల్ని తొలగిస్తాయి. ఇందులో చాలా విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్ ఉంటాయి. అవి బాడీని హెల్తీగా ఉంచుతాయి.

  ఇక తేనె సంగతి తెలియనిదెవరికి. అది బ్యాక్టీరియాతో పోరాడుతుంది. బాడీకి ఎనర్జీ ఇస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. గుండె జబ్బులకు చెక్ పెడుతుంది.

  జ్యూస్ తయారీ విధానం :
  కావాల్సినవి -
  1 కప్పు అల్లం రసం (ఫిల్టర్ చెయ్యండి)
  1 కప్పు వెల్లుల్లి రసం (ఫిల్టర్ చెయ్యండి)
  1 కప్పు నిమ్మ రసం (ఫిల్టర్ చెయ్యండి)
  1 కప్పు యాపిల్ సైడెర్ వెనిగర్
  2 కప్పుల సేంద్రియ (ఆర్గానిక్) తేనె

  జ్యూస్ ఇలా తయారుచేసుకోవాలి :
  - అల్లం రసం, వెల్లుల్లి రసం, నిమ్మ రసం, వెనిగర్ అన్నింటినీ ఓ సాస్ ప్యాన్‌లో పోయాలి.
  - మీడియం ఫ్లేమ్‌లో 30 నిమిషాలు ఉడికించాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి.
  - అరగంట తర్వాత స్టవ్ నుంచీ కిందకు దింపి... ఆరనివ్వాలి.
  - ఆ జ్యూస్‌లో 2 కప్పుల తేనె పోసి... బాగా కలపాలి.
  - ఈ మిశ్రమాన్ని ఓ శుభ్రమైన గాజు సీసాలో పోసి... ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.

  మిశ్రమాన్ని ఎలా వాడాలి :
  ప్రతి రోజూ ఉదయం ఒక టేబుల్ స్పూన్, మధ్యాహ్నం మరో టేబుల్ స్పూన్, సాయంత్రం ఇంకో టేబుల్ స్పూన్ మిశ్రమాన్ని తాగాలి. తాగే సమయంలో పొట్ట ఖాళీగా ఉండేలా తాగాలి. అంటే బ్రేక్ ఫాస్ట్‌కి ముందు, భోజనానికి ముందు తాగితే మేలు. ఈ మిశ్రమం... ఫ్రిజ్‌లో 2 నెలలపాటూ నిల్వ ఉంటుంది. ఫ్రిజ్ స్విచ్ఛాఫ్ చెయ్యకుండా చూసుకోవాలి.
  Published by:Krishna Kumar N
  First published: