• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • ONLINE DATING HOW THE WORLD OF ONLINE DATING TRANSFORMED DURING THE PANDEMIC NS GH

Online dating: మీలాగే మీరు ఉండండి.. ఆన్లైన్లో అబద్ధపు అందాలను ప్రదర్శించకండి.. ఎందుకంటే..

Online dating: మీలాగే మీరు ఉండండి.. ఆన్లైన్లో అబద్ధపు అందాలను ప్రదర్శించకండి.. ఎందుకంటే..

ప్రతీకాత్మక చిత్రం

మనకు ఎవరైనా నచ్చారనుకోండి.. వారికి ఇష్టమైనట్లు ప్రవర్తించేందుకు రెడీ అవుతాం. ఇది చాలా మంచి ఆలోచన. కానీ ఇలా మారడం అనేది ఎంతవరకు కరెక్ట్.

  • Share this:
మనకు ఎవరైనా నచ్చారనుకోండి.. వారికి ఇష్టమైనట్లు ప్రవర్తించేందుకు రెడీ అవుతాం. ఇది చాలా మంచి ఆలోచన. కానీ ఇలా మారడం అనేది ఎంతవరకు కరెక్ట్. మిమ్మల్ని మీరు శాశ్వతంగా మిస్ అయ్యేందుకు మానసికంగా సిద్ధమై.. మీరు కోరుకున్న వారితో మీరు ఆనందంగా ఎప్పటికీ గడపగలిగితే ఎటువంటి కష్టం, నష్టం లేదు. కానీ నేను నాలానే ఉంటా, నేను నీకోసం ఎందుకు మారాలి? నీకోసం నన్ను నేను పోగొట్టుకున్నా, నేను నాలా ఉండటమే నాకు ఇష్టం, నన్ను నన్నుగా ఇష్టపడితేనే నాకు ఇష్టం.. ఇలాంటి భారీ డైలాగులనన్నీ భవిష్యత్తులో కొట్టాల్సిన అవసరం రాకూడదంటే మిమ్మల్ని మీరు ప్రేమించండి. మిమ్మల్నిమీలా ఇష్టపడేవారితో మాత్రమే జతకట్టండి.

మీకు లేనివి తెచ్చిపెట్టుకుంటే..
సింపుల్ గా చెప్పాలంటే మీరు అబ్బాయి అనుకోండి, మీకు టీ షర్ట్, ప్యాంట్ ఫేవరెట్. కానీ మీకు నచ్చిన అమ్మాయిని ఇంప్రెస్ చేసేందుకు మాత్రం మీరు ఫార్మల్స్ లో కనిపించాల్సి వస్తే ఎలా ఉంటుంది. అలాగే మీరు అమ్మాయి అయితే.. మీకు కుర్తా-పైజమా మాత్రమే కంఫర్టబుల్ అనుకోండి. మీరు ఓ క్రాప్ టాప్, జీన్స్ లో కనిపిస్తేనే మీకు నచ్చిన వారిని ఫిదా చేయగలం అనుకుంటే ఇలా ఎంత కాలం? ఓ అబ్బాయి తనకు శోభన్ బాబు లాంటి ఉంగరాల జుట్టుందని ఆన్ లైన్ లో స్టైలిష్ గా కనపడి, అమ్మాయిని ఆకట్టుకుని ఆన్ లైన్ డేటింగ్ మొదలెట్టాడు అనుకుందాం. చివరికి తనకు బట్టతల ఉందని ఆ అమ్మాయికి తెలిసిన క్షణం ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? వీరి మధ్య రిలేషన్ (relation) ఏమవుతుంది?

ఆన్ లైన్ డేటింగ్
కరోనా ముందు కూడా ఆన్ లైన్ డేటింగ్(online dating) ఉంది కదా అంటే ఎస్ కచ్ఛితంగా కరోనా (corona) ముందు కూడా వర్చువల్ డేటింగ్ (virtual dating) ఉంది. కానీ ఆన్ లైన్లో ఒకరికి ఒకరు నచ్చాక ఏకెఫే లోనో బార్ లోనో కలుసుకుని సరదాగా గడిపేవారు. లేదా ఔటింగ్ వెళ్లే చాన్స్ ఉండేది కనుక ఒకరిని ఒకరు పూర్తిగా తెలుసుకునే అవాకాశాలుండేవి. ఇప్పుడు ఇంటి నుంచే సోషల్ మీడియాలో(social media) పరిచయాలు, బంధాలు పెంచుకుంటున్నారు. కనుక అసలు నిజాలు కనుమరుగై, తెరపైన కనిపించేవన్నీ సత్యాలనుకుంటే నిండా మునిగినట్లే. ఏదో ఒక రోజు ఇదంతా బయట పడక తప్పదు, బెడిసి కొట్టక తప్పదు.

పెరిగిన బ్లఫ్పింగ్
కానీ కరోనా భయానికి ఇల్లు కదలడమంటే ప్రాణం మీదికి తెచ్చుకున్నట్లే మారింది. ఈ నేపథ్యంలో కేవలం ఆన్ లైన్లో కలుసుకుని, పరిచయాలు పెంచుకునేందుకు మొబైల్ ఫోన్ ను ఉపయోగిస్తున్న యువతీ యువకులు బ్లఫ్ గేమ్ (bluff game) కు పాల్పడుతున్నారు. తమకు నచ్చిన వ్యక్తి ఇష్టా ఇష్టాలను సోషల్ మీడియా ద్వారా సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేసి, వారి అభిరుచులకు అనుగుణంగా మేకప్ చేసుకోవడం, డ్రెస్సులు వేసుకోవడం వంటివి నిత్యం చేస్తున్నారు.

ఇలా తమ ఫొటోలను, వీడియోలను అప్ లోడ్ చేసి తమ పార్ట్ నర్ ను మెప్పిస్తూ, ఆనందిస్తున్నారు. మేకప్ తీసేస్తే మీరు ఏంటో మీ పార్ట్ నర్ కు తెలిస్తే! మీతో కటీఫ్ చెప్పరని ఏంటి గ్యారెంటీ? మీరు వెస్ట్రన్ వేర్ లో కాకుండా ఎథ్నిక్ వేర్ లో మాత్రమే ఉండేవారు అనుకోండి. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? అయినా ఇలాంటి జిమ్మిక్కులతో ఎంత కాలం మేనేజ్ చేస్తారు? జీవితకాలంపాటు ఇలాంటి ట్రిక్కులతో ఒక బంధాన్ని మేనేజ్ చేయలేమనే సత్యాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. ఫొటో షాప్, మార్ఫింగ్ వంటి వాటి ద్వారా చాటింగ్ యాప్ (chating apps)లో పరిచయమైన మీ పార్ట్ నర్ ను ఇంప్రెస్ చేయడమంటే ఇది కేవలం క్షణికమే.

పెరిగిన స్క్రీన్ టైం
మనిషి సంఘ జీవి (social animal). కాబట్టి ఎప్పుడూ తాను కోరుకున్నట్టు మనుషుల మధ్యే ఉంటాడు. కానీ కోవిడ్ కారణంగా ఇళ్లకే పరిమితమై సోషల్ మీడియాలో సోషల్ లైఫ్ (Social life) గడుపుతున్నవారు అత్యధికం. టిక్ టాక్, ఇన్ స్టా, స్నాప్ చాట్, ట్విట్టర్ వంటి వాడకం కోవిడ్ తర్వాత విపరీతంగా పెరగడానికి కారణం ఇదే. దీంతో మనందరి వ్యక్తిగత స్క్రీన్ టైం (Screen time) గతంలో కంటే భారీగా పెరిగింది. వర్చువల్ ప్రపంచం (virtual world) అందుబాటులోకి వచ్చాక అన్ని వయసుల వారు ఈ కొత్త వర్చువల్ లైఫ్ ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

వర్చువల్ డేటింగ్
గ్యాడ్జెట్లను చేతిలో పట్టుకుని వర్చువల్ డేటింగ్ మొదలు పెట్టిన వారంతా తమ క్రియేటివిటీకి రెక్కలు తొడుగుతున్నారు. ఇది ఓ దశవరకు మంచిదే. కానీ హద్దులు దాటితే మాత్రం నటనకు దారితీస్తుంది. జీవితంలో కాసేపు నటించగలం కానీ నటనే జీవితం కాదు కదా. నటిస్తూ జీవితాన్ని గడిపేయలేం కాబట్టి ఇంప్రెస్ చేసేందుకు అన్న సాకుతో మీమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. కూల్, బ్యూటిఫుల్, ఈస్తెటిక్, మోడరన్ గా తమ లైఫ్ ఉంటుందని బిల్డప్ ఇచ్చుకునే క్రమంలోనే సాధారణంగా ఇవన్నీ జరుగుతాయి. హాటర్ వర్షన్, సెక్సియర్ వర్షన్, బెటర్ వర్షన్ కోసం మేకప్, ఫ్యాషన్ బట్టలపై మీరు చేసే ప్రయోగాలు ప్రమాదకరమైన ఫీట్లకు దారితీస్తుంది. దీంతో మీరు మీ కంఫర్ట్ జోన్ అనే రేఖ దాటి ఏదో సాహసం చేస్తున్నట్టు. కానీ ఎవరైనా తమ కంఫర్ట్ జోన్లో మాత్రమే ఎప్పటికీ ప్రశాంతంగా, తృప్తిగా జీవితం గడపగలరు.

ఎప్పటికీ ఇలా వర్చువల్ వల్డ్ లో జీవించలేం కనుక రియల్ లైఫ్ లో ఉన్న రియాల్టీని అర్థం చేసుకోండి. ఇవన్నీ మీకు చాలా తలనొప్పులు తెచ్చి, జీవితాన్ని నరకంగా మార్చచ్చు. మీకు నచ్చిన వ్యక్తి కోసం మీ అభిరుచులు, స్టైల్స్, ఫ్యాషన్స్ అన్నీ మార్చుకుని ఎంతసేపు ఉండగలరు? మీ ఆత్మాభిమానం, నైతికత దెబ్బతిని నటించలేక, మీరే మానసికంగా డీలా పడి, డిప్రెషన్లో కూరుకుపోతారు. మీకు నచ్చిన వ్యక్తితో మీరు కాని మీరు ఎంతకాలం డేటింగ్ చేయగలరు. జీవిత భాగస్వామి కోసం మిమ్మల్ని మీరు మార్చుకోవడం వేరు, కానీ ఆన్ లైన్ డేటింగ్ యాప్స్ (dating apps) లో కేవలం పరిచయం పెంచుకునేందుకు మారిపోవడం అనేది వేరు అనేది గ్రహించాలి.
Published by:Nikhil Kumar S
First published: