ONION HACK HOW TO CHOP AN ONION EASY WAY IN HOME WITHOUT PROBLEMS HERE IS THE SIMPLE SOLUTION WATCH VIDEO NK
Video: ఉల్లిపాయను ఈజీగా ఎలా కట్ చెయ్యాలి... అదిరే చిట్కా..!
ఉల్లిపాయను ఈజీగా ఎలా కట్ చెయ్యాలి (image credit - youtube)
Video: ఉల్లిపాయను తరగడం అనేది చాలా మందికి బ్రహ్మ విద్య. చాలా ఇబ్బంది పడుతుంటారు. కళ్లలోంచీ నీరు వచ్చేస్తుంటే... ఇక దాన్ని కట్ చెయ్యలేక... బాధపడుతుంటారు. ఈ చిట్కా చూస్తే... ఇక సమస్యే ఉండదు.
Onion Hack 1: ఉల్లిపాయ మనం రోజువారీ వంటల్లో వాడటం తప్పనిసరి. ప్రతి వంటకూ అది అవసరమే. కాబట్టి... ఉల్లిని ఎంతో చక్కగా, వేగంగా తరగడం మనకు రావాలి. ఉల్లిని సరిగా కట్ చెయ్యకపోతే... ముక్కలు పెద్దగా ఉండి సరిగా ఉడకవు. ఉల్లి ముక్కలు సరిగ్గా ఉడకకపోతే... అవి కడుపులోకి వెళ్లాక సరిగా అరగవు. కాబట్టి... ఉల్లిని చిన్న ముక్కలుగా కట్ చేయడం మనకు కచ్చితంగా రావాలి. జనరల్‌గా ఉల్లిని రెండు సమాన భాగాలుగా కోసిన తర్వాత... ఓ అర్థ భాగాన్ని ముక్కలు చేస్తున్నప్పుడు... అది చెదిరిపోతూ... సరిగా కట్ కాదు. అలా చెదిరిపోకుండా ఉండేందుకు ఓ సింపుల్ చిట్కా ఉంది. అది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఉల్లిని తీసుకొని... కింది భాగాన్ని పదునైన కత్తితో.. కట్ చెయ్యాలి. పైన వేర్లు ఉండే భాగాన్ని మాత్రం తీసేయకుండా అలాగే ఉంచాలి. ఇప్పుడు ఉల్లిని రెండు సగ భాగాలుగా కొయ్యాలి. వేర్ల భాగం కూడా 2 భాగాలుగా విడిపోతుంది. ఇప్పుడు... ఓ సగ భాగాన్ని తీసుకొని.. వేర్లను అలాగే ఉంచి... నిలువుగా కొయ్యాలి. తర్వాత అడ్డంగా చిన్న ముక్కలుగా కొయ్యాలి. అలా కోస్తూ ఉంటే...చివరకు వేర్ల భాగం దగ్గర కత్తి ఆగుతుంది. ఆ వేర్ల భాగాన్ని పారేయవచ్చు. ఇలా కోస్తే... ఉల్లిపాయ అన్ని ముక్కలూ సమానంగా వస్తాయి.
మీకు ఇంకా క్లియర్‌గా అర్థం కావాలంటే... ఈ వీడియో చూసేయండి.
Onion Hack 2: ఇప్పుడు మీకు మరో అదిరిపోయే చిట్కా ఇది. మీరు కోసిన ఉల్లిపాయల వేర్ల భాగాలను పారేయకుండా... వాటిని కుండీలోని మట్టిలో కప్పి ఉంచండి... రోజూ 4 చుక్కలు నీరు పొయ్యండి... ఇలా వారం ఉంచితే... ఆ వేర్ల భాగం నుంచి ఉల్లి కాడలతో మొక్కలు వస్తాయి. అవి 60 రోజులపాటూ పెరిగి... ఉల్లి పువ్వులు వస్తాయి. పువ్వులు వచ్చి... వాటి నుంచి ఉల్లి విత్తనాలు వస్తాయి. ఆ విత్తనాలు ఎండిపోయాక... మీరు వాటిని వేరే కుండీలో వేస్తే... కొన్ని వందల ఉల్లి మొక్కలు వస్తాయి.
80 రోజుల తర్వాత... ఉల్లి పువ్వులు, కాడలూ అన్నీ ఎండిపోయాక... ఉల్లి మొక్కలను కుండీ నుంచీ బయటకు తీస్తే... మీకు పెద్ద సైజు ఉల్లిపాయలు నాలుగైదు లభిస్తాయి. ఇలా మీరు ఇంట్లోనే ఉల్లిని పెంచుకోవచ్చు. ఉల్లి కాడలను కూడా కూరల్లో వాడుకోవచ్చు. అన్నీ లాభాలే.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.