పిల్లలు గంట కంటే ఎక్కువ సేపు టీవీ చూస్తే.. ఆ రోగాలు రావడం ఖాయం

news18-telugu
Updated: April 25, 2019, 12:48 PM IST
పిల్లలు గంట కంటే ఎక్కువ సేపు టీవీ చూస్తే.. ఆ రోగాలు రావడం ఖాయం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇంట్లో టీవీ, చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందా.. పిల్లలకు పొద్దు ఇట్టే గడుస్తుంది. కొందరైతే టీవీలో ఏదైనా ప్రోగ్రాం పెడితేనో.. ఫోన్‌లో గేమ్ ఆడిపిస్తేనో.. అన్నం తింటున్నారు. పిల్లలకు అన్నం తినిపించడానికైనా తల్లిదండ్రులు ఫోన్లను వాళ్ల చేతిలో పెట్టాల్సి వస్తోంది. అయితే, ఈ చర్యలు చాలా ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. నిరంతరం టీవీ ముందు కూర్చునే పిల్లలు తమకు తెలియకుండానే ఏదో ఒకటి తింటూ ఉంటారని, కదలకుండా అలాగే తినడం వల్ల లేనిపోని రోగాలు వస్తాయని చెబుతోంది.

ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలు గంట సేపు కంటే ఎక్కువగా టీవీ, స్మార్ట్‌ఫోన్ చూస్తే ఊబకాయం, అధిక బరువు, మధుమేహం, హైపర్ టెన్షన్, హృద్రోగాలు వస్తాయని హెచ్చరించింది. అంతేకాదు, టీవీలో పాత్రలని అనుసరించడం వల్ల వారిలో హింసాత్మక ధోరణులు పెరిగే ప్రమాదం ఉందని తెలిపింది.

First published: April 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>